93 ఏళ్లలో ఒకేఒక్కడు.. తెలుగోడా మజాకా..!
టీమిండియా All-rounder, మన తెలుగోడు Nitish Kumar Reddy హిస్టరీ క్రియేట్ చేశాడు. 93 ఏళ్ల ఇండియన్ క్రికెట్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన ఒకేఒక్క ఆటగాడిగా నిలిచాడు. ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 3 వన్డేల సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌తో నితీష్ కుమార్ రెడ్డి international వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.
టీమిండియా మాజీ కెప్టెన్ Rohit Sharma నుంచి debut క్యాప్ అందుకున్నాడు. దీంతో జస్ట్ ఏడాదిలో కాలంలో 3 ఫార్మాట్లలోకి దూసుకొచ్చిన నితీష్.. ఇండియా తరపున Perth Stadiumలో టెస్ట్, వన్డే క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఏకైక ప్లేయర్ గా rare record ని కూడా సొంతం చేసుకున్నాడు. గతేడాది Border-Gavaskar Trophy 2024-2025లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన టెస్ట్‌తో నితీష్ test Formatలోకి debut చేశాడు.
కింగ్ కోహ్లీ చేతుల మీదుగా debut cap అందుకున్నాడు. అంతేకాదు అదే seriesలో decemberలో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ లో అద్భుతమైన సెంచరీతో అదరగొట్టాడు. విచిత్రం ఏంటంటే.. ఆ seriesలో భారత్ గెలిచిన ఏకైక మ్యాచ్ కూడా అదే. ఇక నితీష్ కి ముందు పెర్త్ వేదికగా బరిందర్ శ్రణ్, సుబ్రోతో బెనర్జీలు భారత్ తరఫున వన్డేల్లోకి ఎంట్రీ చేయగా.. హర్షిత్ రాణా, వినయ్ కుమార్‌లు టెస్ట్‌ల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
ఇక ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేతో పెర్త్ వేదికగానే odi entry ఇచ్చిన నితీష్.. ఫస్ట్ మ్యాచ్ లోనే స్ట్రాంగ్ ఇంపాక్ట్ చూపించాడు. ప్లేయర్లంతా చెత్త ఆటతో పెవిలియన్ చేరిన టైంలో.. ఆఖర్లో బ్యాటింగ్ కి వచ్చి ఇరగదీశాడు. 11 బంతుల్లో 2 సిక్సులతో 19 రన్స్ బాది ఊపు తెచ్చాడు.
అలాగే లాస్ట్ ఇయర్ అక్టోబర్లో బంగ్లాదేశ్‌తో series లో t20 ఎంట్రీ ఇచ్చి.. ఏడాది కాలంలో 3 ఫార్మాట్లలోకి దూసుకొచ్చిన క్రికెటర్ అయ్యాడు. ఏదిఏమైనా మన తెలుగోడు క్రికెట్లో ఈ రేంజ్ లో దూసుకు పోవడం నిజంగా మన తెలుగూళ్ళంతా చాలా ఆనంద పడాల్సిన విషయం. మరి చూడాలి మనోడు.. ముందు ముందు ఎన్ని రికార్డులు బద్దలు కొడతాడో.






















