ఆస్ట్రేలియాతో ఫస్ట్ వన్డేలో ఫెయిలైన కోహ్లీ, రోహిత్.. రిటైర్మెంటే కరెక్టేమో..!
ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా సీరియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దారుణంగా ఫెయిల్ అయ్యారు. రోహిత్ 8 రన్స్ కొట్టి అవుటైతే.. కోహ్లీ అయితే ఏకంగా ఖాతా కూడా తెరవకుండానే అటెండెన్స్ వేయించుకుని వెళ్లిపోయాడు. ఈ సిరీస్‌కి ముందు రోహిత్‌ని కెప్టెన్సీ నుంచి తీసేసిన కోచ్ గంభీర్ డెసిషన్‌పై ఫ్యాన్స్ అంతా రెచ్చిపోయారు. కావాలనే హిట్‌మ్యాన్‌ని సైడ్ చేయడనికే.. గంభీర్ ఇలాంటి సెల్ఫిష్ డెసిషన్ తీసుకున్నాడని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు.
ఇక 2027 వన్డే వరల్డ్ కప్‌లో కోహ్లీ ఆడే ఛాన్స్‌లు తక్కువగానే ఉన్నాయన్నాడని.. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌ని కూడా సోషల్ మీడియాలో రౌండప్ చేసి ట్రోల్ చేశారు ఫ్యాన్స్. కానీ.. ఫస్ట్ మ్యాచ్‌లో హిట్‌మాన్, కింగ్ కోహ్లీ ఆటతీరు చూసి.. వాళ్లు అవుటైన తీరు చూసి.. మాత్రం ఇప్పుడు చాలా మంది ఫ్యాన్స్.. ‘గంభీర్, అగార్కర్ డెసిషన్ కరెక్టేనేమో. వీళ్లిద్దరూ వాళ్ల ప్రైమ్ టైమ్‌లో అదరగొట్టారేమో కానీ.. ఇప్పుడైతే వాళ్ల ఫ్యామ్ పోయినట్లే ఉంది. మేబీ రిటైర్మెంట్ వయసు మీదపడినట్లే ఉంది’ అని గుసగుసలాడుకుంటున్నారట. ఈ మధ్య జరిగిన ఛాంపియన్స్ ట్రోపీ కానీ, అంతకుముందు టీ20 వరల్డ్ కప్ కానీ.. వీళ్లిద్దరూ పెద్దగా ఆడిందేమీ లేదు.
ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్.. ఆడిన 5 మ్యాచ్‌ల్లో ఓ సెంచరీ, 2 హాఫ్ సెంచరీలతో పర్వాలేదనిపించి.. టీ20 వరల్డ్ కప్‌లో 7 మ్యాచ్‌ల్లో ఒక హాఫ్ సెంచరీతో ఫెయిల్ అయ్యాడు. అయితే కోహ్లీ టీ20 వరల్డ్ కప్‌తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌లో కూడా తన స్థాయికి తగ్గ పెర్ఫార్మెన్స్ చేసింది లేదు. ఇక ఇప్పుడు ఏకంగా ఆసీస్‌తో సిరీస్ ముందు వీళ్లిద్దరికీ ఫ్యాన్స్ విపరీతమైన హైప్ ఇచ్చారు. సింహాలొచ్చేశాయంటూ కోహ్లీ, రోహిత్ ఫ్యాన్స్ ఇద్దరినీ ఆకాశానికెత్తేశారు. కానీ తీరా గ్రౌండ్‌లో అడుగుపెట్టిన తర్వాత.. రోహిత్ 8 రన్స్ చేసి చెత్త ఆటతో అవుటైతే.. కోహ్లీ ఏకంగా ఖాతా కూడా తెరవకుండా డకౌట్ అయి వెళ్లిపోయాడు.
దీంతో ఫ్యాన్స్ నోటి నుంచి మాట రావడం లేదు. మరి నెక్ట్స్ 2 మ్యాచ్‌ల్లో అయినా వీళ్లిద్దరూ ఏదైనా మ్యాజిక్ చేస్తారేమో చూడాలి. ఒకవేళ అక్కడ కూడా ఫెయిల్ అయితే.. మే బీ ఇదే వీళ్లిద్దరికీ లాస్ట్ సిరీస్ అయ్యే ఛాన్స్ కూడా లేకపోలేదు.





















