News
News
X

Brahmamudi February 11th: సీన్ రివర్స్- ప్లాన్ సక్సెస్, రాహుల్ కి పడిపోయిన స్వప్న- అప్పు తలకి గాయం

దుగ్గిరాల కుటుంబానికి తన కూతుర్ని కోడల్ని చేయాలని కనకం ప్లాన్స్ వేస్తోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
Share:

రాజ్ స్వప్న కోసం బొకే తీసుకుని కారు స్టార్ట్ చేయబోతుంటే అది స్టార్ట్ అవదు. వెంటనే చాటుగా గమనించిన ఒక వ్యక్తి రాహుల్ కి ఫోన్ చేసి మీరు చెప్పినట్టే కారు స్టార్ట్ కాకుండా చేశానని అంటాడు. రాజ్ ఆటో ఎక్కినా ఏం చేసినా చెప్పమని అతనికి చెప్తాడు. స్వప్న కేఫ్ కి కొంచెం దూరంలో ఆటో దిగి అప్పుని వెళ్లిపొమ్మని చెప్తుంది. దీంతో అప్పు వెళ్ళిపోతుంది. తను రావడం అక్కడే కారులో ఉన్న రాహుల్ చూసి ఇంత రిచ్ అమ్మాయి కారులో కాకుండా కాలి నడకన వస్తుందేంటి అని రౌడీలకి ఫోన్ చేసి చెప్పినట్టు చేయమని చెప్తాడు. ఆ రౌడీలు స్వప్న చెయ్యి పట్టుకుని అల్లరి చేయబోతారు. కావాలంటే బ్యాగ్ తీసుకుని వెళ్లిపొమ్మని బతిమలాడుతుంది. అదంతా చూస్తూనే ఉన్న రాహుల్ హీరో ఎంట్రీకి టైమ్ అయ్యింది, ఇప్పుడు వాళ్ళతో ఫైట్ చేసి హీరో అయిపోదామని అనుకుంటాడు. కానీ అప్పు ఆ రౌడీలతో ఫైటింగ్ కి దిగుతుంది.

Also Read: మహేంద్ర, జగతి దెబ్బకు తోకముడిచిన దేవయాని- రిషికి నిజం చెప్పాలని డిసైడ్ అయిన వసు

రౌడీలను అప్పు చితక్కొడుతుంది. వీడు ఎవడు మధ్యలో హీరోయిజాన్ని చూపిస్తున్నాడని వెంటనే రౌడీకి ఫోన్ చేసి ఆ టోపీ గాడిని సైడ్ చేయమని రాహుల్ ఫోన్ చేసి చెప్తాడు. దీంతో అతను అప్పుని కొట్టుకుంటూ పక్కకి వెళ్లిపోగానే మిగతా రౌడీలు ఇప్పుడు నిన్ను ఎవరు కాపాడతారని అనగానే రాహుల్ హీరోలాగా ఎంట్రీ ఇచ్చి వాళ్ళతో ఫైట్ చేస్తాడు. అది చూసి స్వప్న తనకి పడిపోతుంది. రౌడీ అప్పుని తల మీద కొట్టేసి వెళ్ళిపోతాడు. స్వప్న వెయిట్ చేస్తూ ఉంటుందని అనుకుని రాజ్ క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోతాడు. అక్కడే ఉన్న వ్యక్తి రాహుల్ కి ఫోన్ చేసి విషయం చెప్తాడు. అప్పు గురించి కావ్యకి ఒకతను ఫోన్ చేసి చెప్తాడు. దీంతో కావ్య కంగారుగా వెళ్ళిపోతుంది. రాహుల్, స్వప్న ఇద్దరూ కేఫ్ లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు.

మీ అందానికి ఎప్పుడో ఫ్యాన్ అయిపోయానని రాహుల్ స్వప్నకి బిస్కెట్లు వేస్తూ ఉంటాడు. ఆ కేఫ్ లో వాలెంటైన్స్ డే సందర్భంగా కపుల్స్ కి చిన్న కాంప్లిమెంట్ అని చెప్పి ఐస్ క్రీమ్ ఇస్తాడు. అతను రాహుల్, స్వప్నని లవర్స్ అనుకుని మాట్లాడతాడు. ప్రపంచంలోకెల్లా అత్యంత అద్భుతమైన అమ్మాయి కనిపించినప్పుడు గిఫ్ట్ ఇవ్వాలని జేబులో పెట్టుకుని తిరుగుతున్నా అని రాజ్ చేయించి డైమండ్ రింగ్ స్వప్నకి ఇస్తాడు. అది చూసి స్వప్న ఆశ్చర్యపోతూ సంతోషపడుతుంది. ఈ విషయం రాజ్ కి చెప్పొద్దని అంటాడు. తనే డైమండ్ రింగ్ ఇస్తే రాజ్ ఇంకెంత కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తాడో అనుకుని స్వప్న మనసులో సంబరపడుతుంది. రాజ్ వచ్చాడని రాహుల్ ఎరేంజ్ చేసిన మనిషి ఫోన్ చేసి చెప్పడంతో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.

Also Read: ఇదేం చోద్యం రా బాబు, మాజీ పెళ్ళాంతో బైక్ మీద వెళ్లాలని లాస్యని సైడ్ చేసేసిన నందు- అభి ప్లాన్ తెలుసుకున్న తులసి

కావ్య అప్పుని తీసుకుని ఇంటికి వస్తుంది. కేఫ్ దగ్గర జరిగిన గొడవ అంతా అప్పు కావ్యకి చెప్తుంది. రాజ్ తనతో గొడవపడినట్టే ఇంకెవరితోనే గొడవపడి ఉంటాడు అందుకే వాళ్ళు దాడి చేసి ఉంటారు, సమయానికి నువ్వు లేకపోతే అక్క పరిస్థితి ఏంటని కావ్య కంగారుగా వెళ్ళిపోతుంది. రాజ్ తనకి గిఫ్ట్ తెచ్చానని చెప్పి ఓపెన్ చేసి చూడమని చెప్తాడు. అందులో డైమండ్ నెక్లెస్ ఉంటుందని అనుకుంటూ ఓపెన్ చేస్తుంది.. అందులో రాధా, కృష్ణుల బొమ్మ, చాక్లెట్ బాక్స్ ఉంటుంది. రాహుల్ డైమండ్ రింగ్ ఇస్తే ఇతను ఇంకాస్త బెటర్ గిఫ్ట్ ఇస్తాడని అనుకుంటే ఇలా చేశాడే అని స్వప్న బిత్తరపోతుంది. ఆర్డర్ చేయమని స్వప్న అనేసరికి రాజ్ కాఫీ తెమ్మని చెప్తాడు. ప్రేమ గురించి మీ అభిప్రాయం ఏంటని స్వప్న అడుగుతుంది. దీంతో రాజ్ ఒక పెద్ద ఫిలాసఫీ మొదలుపెడతాడు. రొమాంటిక్ పర్సన్ అనుకుంటే ఇంత రసహీన పక్షి అనుకోలేదని బిక్కమొహం వేస్తుంది.

Published at : 11 Feb 2023 10:43 AM (IST) Tags: manas Brahmamudi Serial Brahmamudi Serial Today Episode Brahmamudi Serial Written Update Brahmamudi Serial February 11th Episode

సంబంధిత కథనాలు

Actress Samantha:వాళ్లంతట వాళ్లే ఇవ్వాలి గానీ, అడుక్కోకూడదు: సమంత

Actress Samantha:వాళ్లంతట వాళ్లే ఇవ్వాలి గానీ, అడుక్కోకూడదు: సమంత

Jaya Janaki Nayaka Hindi Dubbed: బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాకు హిందీలో రికార్డు స్థాయిలో వ్యూస్, అందుకే ‘ఛత్రపతి’ రిమేక్ చేస్తున్నారా?

Jaya Janaki Nayaka Hindi Dubbed: బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాకు హిందీలో రికార్డు స్థాయిలో వ్యూస్, అందుకే ‘ఛత్రపతి’ రిమేక్ చేస్తున్నారా?

Shah Rukh Khan Rolls Royce: ఖరీదైన లగ్జరీ కారు కొన్న షారుఖ్ ఖాన్ - ఆ డబ్బుతో నాలుగైదు విల్లాలు కొనేయోచ్చేమో!

Shah Rukh Khan  Rolls Royce: ఖరీదైన లగ్జరీ కారు కొన్న షారుఖ్ ఖాన్ - ఆ డబ్బుతో నాలుగైదు విల్లాలు కొనేయోచ్చేమో!

Ravanasura Trailer : వాడు లా చదివిన క్రిమినల్ - రవితేజ 'రావణాసుర' ట్రైలర్ వచ్చిందోచ్

Ravanasura Trailer : వాడు లా చదివిన క్రిమినల్ - రవితేజ 'రావణాసుర' ట్రైలర్ వచ్చిందోచ్

Nidhi Agarwal: నిధి అగర్వాల్ పూజలు - అవకాశాల కోసమేనా?

Nidhi Agarwal: నిధి అగర్వాల్ పూజలు - అవకాశాల కోసమేనా?

టాప్ స్టోరీస్

Revanth Reddy : కేటీఆర్ కనుసన్నల్లో సిట్ విచారణ, ఆయన పీఏ ఒక పావు మాత్రమే- రేవంత్ రెడ్డి

Revanth Reddy : కేటీఆర్ కనుసన్నల్లో సిట్ విచారణ, ఆయన పీఏ ఒక పావు మాత్రమే- రేవంత్ రెడ్డి

PAN-Aadhaar: పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు - జూన్‌ 30 వరకు ఛాన్స్‌

PAN-Aadhaar: పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు - జూన్‌ 30 వరకు ఛాన్స్‌

Mekapati vs Anilkumar: మాజీ మంత్రి అనిల్ వర్సెస్ ఎమ్మెల్యే మేకపాటి - సెటైర్లు మామూలుగా లేవు!

Mekapati vs Anilkumar: మాజీ మంత్రి అనిల్ వర్సెస్ ఎమ్మెల్యే మేకపాటి - సెటైర్లు మామూలుగా లేవు!

Group 1 Mains Postponed : ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?

Group 1 Mains Postponed :  ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?