Brahmamudi April 18th: రాజ్ ముందు కావ్యని చెడ్డదాన్ని చేసిన స్వప్న- భార్యని శాశ్వతంగా పుట్టింట్లో వదిలేసి వెళ్లిపోతాడా?
రాజ్, కావ్య పెళ్లి జరగడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
ఒక్క రోజులోనే నా కొడుకుని పూర్తిగా మార్చేశారని అపర్ణ బాధపడుతుంది. ఇవాళ ఒక్క రాత్రి నేను కాపలాగా ఉంటే ఆ స్వప్నని పట్టుకోవచ్చని నిన్ను బాధపెట్టి ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. నిన్ను బాధపెట్టిన కావ్యని శాశ్వతంగా పుట్టింట్లోనే వదిలేయాలంటే ఆ స్వప్న దొరకాలి నాకు అని రాజ్ మనసులో అనుకుంటాడు. అప్పుడే స్వప్న మెల్లగా ఇంట్లోకి రావడానికి చూస్తుంటే కృష్ణమూర్తి బయటకి రావడం చూసి కనిపించకుండా దాక్కుంటుంది. స్వప్న ఎంత కాలం అజ్ఞాతంలో ఉంటావ్, నువ్వు ఎదురు పడగానే ప్రశ్నించాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయని అనుకుంటాడు. అమ్మ రాగానే నిజం చెప్పాలని స్వప్న అనుకుంటూ ఉండగా కావ్య బయటకి వస్తుంది. తలుపు వేసేలోపు ఇంట్లోకి వెళ్లాలని అనుకుంటూ ఉండగా కిటికీలో నుంచి స్వప్నని కావ్య చూసేస్తుంది. కానీ మళ్ళీ చూసేసరికి అక్కడ కనిపించదు. కిటికీ దగ్గర వెతికేలోపు స్వప్న దొంగచాటుగా ఇంట్లో దూరిపోతుంది.
Also Read: వావ్.. ఒక్క పాటలోనే యష్ ని నడిపించేసిన వేద- భార్య ప్రేమ తెలుసుకుని మనసు మార్చుకుంటాడా?
కావ్య రాజ్ గదిలోకి వచ్చి గడియ పెట్టి కాసేపు తనని ఆట పట్టిస్తుంది. ఏంటి గడియ పెట్టావ్ అని బిక్క మొహం వేసి అడుగుతాడు. కాసేపు ఇద్దరూ పోట్లాడుకుంటారు. స్వప్న ఇంట్లో ఒక మూలన పడేసి ఉన్న తన ఫోటోస్, బట్టలు చూసి బాధపడుతుంది. నాకు ఇష్టమైనవి పక్కన పడేశారంటే నా మీద కూడా ఇష్టం లేనట్టేగా ఇదంతా కావ్య వల్లే అని చెల్లి మీద కోపం పెంచుకుంటుంది. పాపం మీకు దెబ్బ తగిలిందని తెలిసి ఉండబట్టలేక మా ఇంటికి రావడం ఇష్టం లేకపోయినా వచ్చారు ఎంత బాధపడి ఉంటారోనని కావ్య బాధపడుతుంది. తల్లితో కలిసి ఉన్న ఫోటో చూసుకుంటూ స్వప్న బాధపడుతుంది. మెల్లగా కావ్య కూడా నిద్రపోతుంది. కనకం హాల్లోకి రాగానే వెనుకాలే కృష్ణమూర్తి కూడా వస్తాడు. ఏంటి కనకం బయటకి వచ్చావ్ నిద్ర పట్టలేదా అని అడుగుతాడు.
కనకం: ఆ చచ్చిన దాని స్వప్న ఆత్మ ఇంట్లోకి వచ్చినట్టు కల వచ్చింది. అది ఇల్లు వదిలి పోయి కూడా కలలోకి వచ్చి సాధిస్తుంది
స్వప్న: అంటే నన్ను చచ్చిన దానితో సమానంగా చూస్తుందా అమ్మ
కృష్ణమూర్తి: కలలోనే కదా చీపురు కట్ట తీసుకుని తరిమేయకపోయావా మళ్ళీ రాకుండా ఉండేది ఛీ దాని గురించి ఒక్క నిమిషం ఆలోచించినా మన ఇంటికి దరిద్రం పట్టుకుంటుంది. అది చేసిన తప్పుకి నా కూతురు శిక్ష అనుభవిస్తుంది
అక్కడే ఉన్న స్వప్న వస్తువులు చూసి కృష్ణమూర్తి రగిలిపోతాడు. ఆ దరిద్రపు దాని వస్తువులు ఇంకా ఇక్కడే ఉన్నాయ్ ఏంటి దాన్ని చూస్తే అదే గుర్తుకు వస్తుందని చెప్పి ఆవేశంగా వాటిని తీసుకుని ఇంటి బయటకి తీసుకెళ్ళి విసిరేసి పెట్రోల్ పోసి నిప్పు పెట్టి కాల్చేస్తాడు. పోయి ఇంకా బాగా పోయి సగం కాలితే సగం కాలితే సగం కాలిన సగం శవంలాగా కనిపిస్తుందని కనకం అంటుంది. అమ్మానాన్న నన్ను ఇంత ద్వేషిస్తారని అనుకోలేదు ఇలా అయితే ఇద్దరూ నన్ను క్షమించరని అది చూసి స్వప్న బాధపడుతుంది. ఈ దరిద్రం ఇంట్లో కనిపించకూడదని అంటాడు. నాన్న క్షమించకపోయిన అమ్మ అయినా క్షమిస్తుందని అనుకున్నా కానీ అది జరిగేలా కనిపించడం లేదు ఇక ఏ మొహం పెట్టుకుని వాళ్ళకి ఎదురు పడాలని ఏడుస్తుంది.
Also Read: మండపంలో తులసి, లాస్య గొడవ - చివరి నిమిషంలో పెళ్లి చేసుకోనని చెప్పిన దివ్య, రాజ్యలక్ష్మి షాక్
రాజ్, కావ్య ముందు అవమానాలు పడే కంటే వెళ్లిపోవడమే మంచిది. కానీ అమ్మకి కావ్య గురించి నిజం చెప్పేసి వెళ్లిపోవాలని మళ్ళీ ఇంట్లోకి వెళ్తుంది. రాజ్ కళావతి గాలి ఆడటం లేదు విసురు అని నిద్రలోనే పిలుస్తాడు. నిద్రలేచి చూసేసరికి కావ్య నేల మీద పడుకుని ఉంటుంది. ఉన్న ఒక్క దుప్పటి నాకు ఇచ్చేసి నువ్వు చాప మీద పడుకున్నావ్ అసలు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావ్ అని రాజ్ మనసులో అనుకుంటాడు.