Salman Khan: ఇప్పుడు చిరంజీవితో సినిమా... తర్వాత దగ్గుబాటి హీరోతోనూ ఓ సినిమా! - సల్మాన్ ఖాన్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ బుధవారం భాగ్యనగరంలో సందడి చేశారు. 'అంతిమ్' సినిమాకు లభిస్తున్న స్పందన పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తెలుగు హీరోలతో చేస్తున్న, చేయబోతున్న ప్రాజెక్టుల గురించి మాట్లాడారు.
మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్నట్టు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కన్ఫర్మ్ చేశారు. మోహన్ రాజా దర్శకత్వంలో మోహన్ లాల్ హిట్ సినిమా 'లూసిఫర్'ను తెలుగులో 'గాడ్ ఫాథర్' పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో చిరంజీవి హీరో. సల్మాన్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. చిరంజీవి, సల్మాన్ కలిసి ఓ పాటకు స్టెప్పులు వేస్తారని సంగీత దర్శకుడు తమన్ వెల్లడించారు. ఇప్పుడు సల్మాన్ కూడా సినిమాలో నటిస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు.
మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే... దగ్గుబాటి హీరోతోనూ సినిమా చేయనున్నట్టు చెప్పారు సల్మాన్. వెంకటేశ్‌తో చేయబోతున్నాని ఆయన చెప్పారు. సల్మాన్ ఖాన్ నటించిన 'అంతిమ్' ఇటీవల విడుదలైంది. ఆ సినిమా ప్రచారం నిమిత్తం హైదరాబాద్ వచ్చిన సల్మాన్... చిరంజీవి, వెంకటేశ్‌తో సినిమాల గురించి చెప్పారు.
సాధారణంగా ప్రతి సినిమా విడుదలకు ముందు ఇండియాలో మెయిన్ సిటీలకు వెళ్లడం తనకు అలవాటు అని, ఇప్పుడు 'టైగర్ 3' సినిమా షూటింగ్ కారణంగా ఈసారి టైమ్ కుదరలేదన్నారు సల్మాన్ ఖాన్. 'దబాంగ్'ను తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేశామని, 'అంతిమ్'కు కారణంగా అంత టైమ్ లేని కారణంగా డబ్బింగ్‌పై దృష్టి పెట్టలేదని, హిందీలో సినిమా పూర్తి చేశామని ఆయన అన్నారు. 'అంతిమ్' సినిమా థియేటర్లలో అభిమానులు టపాసులు కాల్చడం, పాలాభిషేకాలు చేయడం గురించీ సల్మాన్ స్పందించారు. సోషల్ మీడియాలో అటువంటి పనులు వద్దని అభిమానుల్ని వారించడంతో వారు మంచి పనులు చేస్తున్నారని తెలిసి చాలా సంతోషం వేసిందని సల్మాన్ చెప్పారు.
Also Read: సైలెంట్‌గా ఫ్యాన్స్‌కు క్లాస్ పీకుతున్న సల్మాన్ ఖాన్... మిగతా స్టార్స్ ఏం చేస్తారో?
'అంతిమ్: ద ఫైనల్ ట్రూత్' సినిమాలో సల్మాన్ ఖాన్‌తో పాటు ఆయన బావ ఆయుష్ శర్మ హీరోగా నటించారు. ఆయన కూడా హైదరాబాద్ వచ్చారు. 'అంతిమ్' దర్శకుడు, నటుడు మహేష్ మంజ్రేకర్‌తో కలిసి నగరంలోని ఫోరమ్ మాల్‌లో సందడి చేశారు.
Also Read: ‘మనీ హీస్ట్’ సీజన్ 5 To ‘డోన్ట్ లుక్ అప్’.. డిసెంబర్‌లో విడుదలయ్యే ఓటీటీ వెబ్‌సీరిస్‌లు ఇవే..
Also Read: 'సిరివెన్నెల' కుటుంబానికి అండగా ఉంటామన్న తెలంగాణ ప్రభుత్వం... కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పిన కుటుంబ సభ్యులు
Also Read: ఏపీలో వరద బాధితులకు టాలీవుడ్ స్టార్స్ సాయం... చిరంజీవి, మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్ తర్వాత ఎవరు?
Also Read: శిల్పా చౌదరి చేతిలో మోసపోయిన మహేష్ బాబు సోదరి... ఆమె దగ్గర ఎంత కొట్టేశారంటే?
Also Read: వెండితెరపైనే కాదు.. ఓటీటీలో కూడా బాలయ్య రికార్డులు.. 'దబిడి దిబిడే'
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి