X

‘మనీ హీస్ట్’ సీజన్ 5 To ‘డోన్ట్ లుక్ అప్’.. డిసెంబర్‌లో విడుదలయ్యే ఓటీటీ వె‌బ్‌సీరిస్‌లు ఇవే..

డిసెంబర్‌లో ఓటీటీ చిత్రాలు సందడి చేయనున్నాయి. ఏయే వెబ్ సీరిస్, సినిమాలు ఎప్పుడెప్పుడు విడుదల కానున్నాయో చూడండి.

FOLLOW US: 

డిసెంబర్ నెల వచ్చేసింది. వెండితెరతోపాటు బుల్లితెరలు సైతం కళకల్లాడే సమయం వచ్చేసింది. కరోనా థర్డ్ వేవ్ పొంచివున్న నేపథ్యంలో ప్రజలు కూడా ఇంట్లో ఉండి ఓటీటీల్లో వచ్చే వెబ్‌సీరిస్‌లు, సినిమాలు చూడటమే బెటర్ అనే ఆలోచనలో ఉన్నారు. అంతేకాదు.. ఈ నెలల్లో ప్రేక్షకులు మెచ్చిన పలు వెబ్‌సీరిస్‌ల కొత్త సీజన్లు కూడా రిలీజ్ కానున్నాయి. మరి అవేంటో చూసేద్దామా. 

Money Heist Season 5 Vol 2 (మనీ హీస్ట్.. సీజన్ 5, వాల్యూమ్ 2): ప్రపంచంలో అత్యధిక ప్రేక్షకులు మెచ్చిన వెబ్‌సీరిస్ ‘మనీహీస్ట్’ ఇప్పటికే విడుదలైన ఈ వెబ్‌సీరిస్ సీజన్లు ప్రేక్షకులకు భలే నచ్చేశాయి. ఎంతో ఉత్కంఠభరితంగా సాగే ఈ వెబ్‌సీరిస్‌ల్లో పాత్రలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉందంటే.. ఇది ఎంత పాపులారిటీ సంపాదించిందో అర్థం చేసుకోవచ్చు. గత సీజన్లో బ్యాంకులోకి చొరబడి బంగారాన్ని కరిగిస్తున్న ప్రొఫెసర్ టీమ్‌ను ఎదుర్కొనేందుకు సైన్యాన్ని రంగంలోకి దించుతారు. ఈ సందర్భంగా టోక్యో ఆత్మహుతి చేసుకుని సైనికులను చంపేస్తుంది. తన టీమ్ కోసం ప్రాణాలు అర్పిస్తుంది. ఈ దోపిడీకి ఈ సీజన్‌లో ముగింపు పలకనున్నారు. డిసెంబర్ 3 నుంచి ‘నెట్ ఫ్లిక్స్’లో ఈ సీజన్ స్ట్రీమింగ్ కానుంది. దీన్ని తెలుగులో కూడా చూడవచ్చు.

Inside Edge Season 3 (ఇన్‌సైడ్ ఎడ్జ్ సీజన్ 3): ‘ఇన్‌సైడ్ ఎడ్జ్’ వెబ్ సీరిస్‌కు మాంచి హిట్ కొట్టింది. ఇప్పటికే రెండు సీజన్లు విజయవంతంగా కొనసాగాయి. అయితే, మూడో సీజన్ విడుదలకు చాలా గ్యాప్ తీసుకున్నారు. ఎట్టకేలకు డిసెంబరు 3 నుంచి ఈ సీజన్‌ స్ట్రీమింగ్ కానుంది. క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ వెబ్‌సీరిస్‌ మరింత గ్రిప్పింగ్‌గా సాగనుందని తెలుస్తోంది. వివేక్ ఒబేరాయ్, రిచ చద్దా, అక్షయ్ ఒబేరాయ్, తనుజ విర్వాని, అమీర్ బషీర్, సయనీ గుప్తా, సప్నా పబ్బీ, సిద్ధాంత్ గుప్తా, అమిత్ సియాల్ తదితరులు నటించారు. ఇది అమేజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. 

Minnal Murali (మిన్నల్ మురళి): ఓ వ్యక్తికి సూపర్ పవర్స్ వస్తే ఎలా ఉంటాడనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ఇది. టొవినో థామస్ ఇందులో సూపర్ హీరోగా కనిపించనున్నాడు. మెరుపు మీద పడిన తర్వాత అతడికి వచ్చే సూపర్ పవర్స్‌తో ఏం చేశాడు? పోలీసులు అతడి కోసం ఎందుకు వెతుకుతారు? అనేది ఓటీటీలోనే చూడాలి. డిసెంబరు 24 నుంచి ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రిమింగ్ కానుంది. ఇది తెలుగులో కూడా విడుదలవుతుంది.

Oh My Dog (ఓ మై డాగ్): హీరో సూర్య నిర్మాతగా 2డీ ఎంటర్‌టైన్మెంట్ పతాకంతో తెరకెక్కిన ‘ఓ మై డాగ్’ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఊటీలో తెరకెక్కిన ఈ ఫీల్ గుడ్ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఓ పెంపుడు కుక్క, బాలుడికి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ చిత్రం డిసెంబర్ 24న ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో విడుదల కానుంది.

Atrangi Re (అత్రంగీ రే): అక్షయ్ కుమార్, ధనుష్ తొలిసారి కలిసి నటించిన ఈ బాలీవుడ్ చిత్రం హిందీ, తమిళ భాషల్లో ఓటీటీ వేదికగా విడుదల కానుంది. ఓ వ్యక్తి(అక్షయ్ కుమార్) ప్రేమలో పడిన అమ్మాయికి పెద్దలు బలవంతంగా మరో వ్యక్తి (ధనుష్)తో పెళ్లి చేస్తారు. అయితే, పెళ్లి తర్వాత భర్తను కూడా ప్రేమిస్తుంది. ఆ ఇద్దరిని వీడలేక గందరగోళానికి గురయ్యే యువతి పాత్రలో సారా అలీఖాన్ నటించింది. ఇది ఈ నెల 24 నుంచి ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’లో విడుదల కానుంది.

Bob Biswas (బాబ్ బిశ్వాస్): అభిషేక్ బచ్చన్, చిత్రాంగద సింగ్ నటించిన ‘బాబ్ బిశ్వాస్’ చిత్రం డిసెంబరు 3న విడుదల కానుంది. విద్యాబాలన్ నటించిన ‘కహాని’ సినిమాలోని ‘బాబ్ విశ్వాస్’ పాత్ర స్ఫూర్తితో ఈ థ్రిల్లర్‌ను తెరకెక్కించారు. ఇందులో అభిషేక్ బచ్చన్ బాబ్ బిశ్వాస్‌గా భిన్నంగా కనిపిస్తాడు. గతాన్ని మరిచిపోయిన వ్యక్తిలా కనిపిస్తాడు. అయితే, అతడు నటిస్తున్నాడా? లేక నిజంగానే గతాన్ని మరిచిపోయాడా అనేది ఓటీటీ తెరపైనే చూడాలి. ఇది ‘జీ 5’లో స్ట్రీమింగ్ కానుంది.

The Witcher, Season 2 (ది విచర్): ఓటీటీ ప్రేక్షకుల ఫేవరెట్ వెబ్ సీరిస్ ‘ది విచర్’ సీజన్ 2 కూడా విడుదలకు సిద్ధమైపోయింది. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత విడుదలవుతున్న ఈ వెబ్ సీరిస్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. డిసెంబరు 17 నుంచి ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

Aarya 2 (ఆర్య 2): సుశ్మితా సేన్ నటించిన ఈ యాక్షన్ డ్రామా.. రెండో సీజన్ కూడా మరింత ఉత్కంఠభరితంగా ఉంటుందని దర్శక నిర్మాతలు ఇటీవలే తెలిపారు. ఫస్ట్ సీజన్‌కు పాజిటివ్ రివ్యూస్ లభించడంతో సెకండ్ సీజన్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇందులో సుశ్మిత తన భర్త హంతుకులపై ప్రతీకారం తీర్చుకొనే పాత్రలో కనిపించనుంది. ఇది డిసెంబరు 10 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.

Aranyak (అరన్యాక్): ఓ అడవిలో జరిగే అంతుచిక్కని ఘటన ఆధారంగా తిరిగే మిస్టరీ వెబ్ సీరిస్ ఇది. రవీనా టాండన్ తొలిసారి నటిస్తున్న వెబ్ సీరిస్ ఇది.  రాయ్ కపూర్ ఫిల్మ్స్, రమేష్ సిప్పీ ఎంటర్‌టైన్మెంట్ పథకంపై తెరకెక్కిన ఈ థ్రిల్లర్ డిసెంబరు 10 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

Emily in Paris, Season 2 (ఎమిలీ ఇన్ పారీస్): యూత్‌కు ఎంతో ఇష్టమైన ఈ రొమాంటిక్.. లవ్ స్టోరీ.. సెకండ్ సిజన్ విడుదలకు సిద్ధమైంది. ఈ ఫీల్ గుడ్ వెబ్‌సీరిస్‌ నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబరు 22 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Don’t Look Up (డోన్ట్ లుక్ అప్): ఓటీటీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ చిత్రాల్లో ఇదీ ఒకటి. లియనార్డో డికప్రియో, జెన్నిఫర్ లారెన్స్ నటించిన ఈ చిత్రం డిసెంబరు 10న సెలెక్టెడ్ థియేటర్లలో మాత్రమే రిలీజ్ కానుంది. డిసెంబరు 24 నుంచి నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. గ్రహశకలం నుంచి భూమిని కాపాడేందుకు ఇద్దరు శాస్త్రవేత్తల చేసే ప్రయత్నాన్ని కామెడీగా తెరకెక్కించారు.

Also Read: ఇప్పుడు చిరంజీవితో సినిమా... తర్వాత దగ్గుబాటి హీరోతోనూ ఓ సినిమా: వెంకటేష్
Also Read: వెండితెరపైనే కాదు.. ఓటీటీలో కూడా బాలయ్య రికార్డులు.. ‘దబిడి దిబిడే’

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Tags: OTT Movies Money Heist Season 5 మనీ హీస్ట్ OTT Releases in December OTT Web Series Aarya Season 2

సంబంధిత కథనాలు

Priyanka Chopra Child: పన్నెండు వారాల ముందుగానే... ప్రియాంకా చోప్రా పాప గురించి ఈ సంగతులు తెలుసా?

Priyanka Chopra Child: పన్నెండు వారాల ముందుగానే... ప్రియాంకా చోప్రా పాప గురించి ఈ సంగతులు తెలుసా?

HBD Namrata Ghattamaneni: నమ్రతకి ఆ రోజంటే నచ్చదన్న మహేశ్ బాబు.. ఎందుకంటే..

HBD Namrata Ghattamaneni: నమ్రతకి ఆ రోజంటే నచ్చదన్న మహేశ్ బాబు.. ఎందుకంటే..

Shyam SinghaRoy: నానిని పెళ్లి చేసుకోమని అడిగిన వేశ్య.. వీడియో చూశారా..? 

Shyam SinghaRoy: నానిని పెళ్లి చేసుకోమని అడిగిన వేశ్య.. వీడియో చూశారా..? 

Naga Shaurya: సరికొత్త టైటిల్ తో యంగ్ హీరో.. బ్రాహ్మణ గెటప్ లో ఫస్ట్ లుక్..

Naga Shaurya: సరికొత్త టైటిల్ తో యంగ్ హీరో.. బ్రాహ్మణ గెటప్ లో ఫస్ట్ లుక్..

Nani Dasara: నాని సినిమాలో మలయాళ హీరోకి ఛాన్స్.. 

Nani Dasara: నాని సినిమాలో మలయాళ హీరోకి ఛాన్స్.. 
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Moto Tab G70 LTE Sale: మోటొరోలా బడ్జెట్ ట్యాబ్లెట్ సేల్ నేడే.. ధర తక్కువే!

Moto Tab G70 LTE Sale: మోటొరోలా బడ్జెట్ ట్యాబ్లెట్ సేల్ నేడే.. ధర తక్కువే!

HBD Namrata Mahesh Ghattamaneni: నమ్రతా శిరోద్కర్ గురించి ఈ విషయాలు తెలుసా..

HBD Namrata Mahesh Ghattamaneni: నమ్రతా శిరోద్కర్ గురించి ఈ విషయాలు తెలుసా..

Groom Slaps Bride: వధువును కొట్టిన వరుడు.. అదే ముహూర్తానికి కజిన్‌ను పెళ్లాడిన యువతి

Groom Slaps Bride: వధువును కొట్టిన వరుడు.. అదే ముహూర్తానికి కజిన్‌ను పెళ్లాడిన యువతి

New Covid Omicron Variant BA.2 : ఉఫ్.. ఒమిక్రానూ పిల్లల్ని పుట్టించేస్తోంది.. బ్రిటన్, డెన్మార్క్‌ను గడగడలాడిస్తున్న కొత్త వేరియంట్ BA.2 !

New Covid Omicron Variant BA.2 :  ఉఫ్.. ఒమిక్రానూ పిల్లల్ని పుట్టించేస్తోంది.. బ్రిటన్, డెన్మార్క్‌ను గడగడలాడిస్తున్న కొత్త వేరియంట్ BA.2 !