X

Unstoppable With NBK: వెండితెరపైనే కాదు.. ఓటీటీలో కూడా బాలయ్య రికార్డులు.. 'దబిడి దిబిడే'

నందమూరి బాలకృష్ణ.. వెండితెర పై మాత్రమే కాదు ఓటీటీలో కూడా రికార్డ్స్ బ్రేక్ చేస్తాడని 'అన్ స్టాపబుల్' షోతో ప్రూవ్ అయింది.

FOLLOW US: 
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తెలుగులో మొదటి ఓటీటీ సంస్థను మొదలుపెట్టారు. అదే 'ఆహా'. మొదట్లో కొన్ని ఒరిజినల్ సినిమాలు, డబ్బింగ్ సినిమాలతో ఈ యాప్ ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. కానీ వర్కవుట్ అవ్వలేదు. దీంతో సమంత, రానా, మంచు లక్ష్మీ ఇలా పేరున్న సెలబ్రిటీలను తీసుకొచ్చి కొన్ని షోలను ప్లాన్ చేశారు. ఇవి కొంతవరకు కలిసొచ్చినా.. సబ్ స్క్రిప్షన్స్ మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. దీంతో అల్లు అరవింద్ తన మాస్టర్ బ్రెయిన్ తో బాలయ్యను రంగంలోకి దింపారు. 'Unstoppable' అనే షోని మొదలుపెట్టారు.
 
తొలిసారి బాలయ్య హోస్ట్ గా షో అనేసరికి జనాల్లో ఎగ్జైట్మెంట్ పెరిగిపోయింది. పైగా సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేయడమనేసరికి.. ఆయన ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో తెలుసుకోవాలనే కుతూహలం ప్రేక్షకుల్లో కలిగింది. దానికి తగ్గట్లుగానే పేరున్న తారలను గెస్ట్ లుగా తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేస్తున్నారు. తొలి ఎపిసోడ్‌కు కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో పాటు ఆయన పిల్లలు లక్ష్మీ మంచు, విష్ణు మంచు వచ్చారు. రెండో ఎపిసోడ్‌కు నేచురల్ స్టార్ నాని గెస్టుగా వచ్చారు. ఇప్పుడో మూడో ఎపిసోడ్ కి అతిథులుగా బ్రహ్మానందం, అనీల్ రావిపూడి ఇద్దరూ వచ్చారు.

ఈ షోతో అల్లు అరవింద్ వేసిన ప్లాన్ బాగానే వర్కవుట్ అవుతోంది. నందమూరి బాలకృష్ణ.. వెండితెర పై మాత్రమే కాదు ఓటీటీలో కూడా రికార్డ్స్ బ్రేక్ చేస్తాడని ఈ షోతో ప్రూవ్ అయింది. ప్రస్తుతం బాలయ్య ఆహా అనే డిజిటల్ ప్లాట్ ఫామ్ లో 'అన్ స్టాపబుల్ విత్ NBK' షో చేస్తున్నారు. తాజాగా ఈ షో OTT ప్లాట్ ఫామ్ లో 4 మిలియన్లకు పైగా లైక్ లతో రికార్డ్ సృష్టించింది. బాలకృష్ణ టాక్ షో 'అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె 4' మిలియన్లకు పైగా వీడియో ప్లేతో చార్ట్ లో టాప్ లోకి వెళ్లిందని ఆహా అధికారిక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు తెలుగు OTT స్పేస్ లో ఏ టాక్ షోకి రాని అత్యధిక వ్యూస్ సాధించిన షోగా వార్తల్లో నిలిచింది 

Also Read:'పావుగంటకొక పెక్.. రాత్రికొక పెగ్'.. బ్రహ్మానందంతో బాలయ్య అల్లరి..

Also Read: 'ఫోకస్' టాస్క్ ఫన్నీ టాస్క్ గా మారిపోయిందే..

Also Read: థియేటర్లు దొరక్క... పదిహేను రోజులు వెనక్కి వెళ్లిన పూర్ణ సినిమా
 
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 
Tags: Balakrishna NBK Unstoppable Show Unstoppable ott records balayya ott records

సంబంధిత కథనాలు

Shweta Tiwari: 'దేవుడు నా బ్రా కొలతలు తీసుకుంటున్నాడు'... సీరియల్ నటి వ్యాఖ్యలపై మంత్రి సీరియస్... విచారణకు ఆదేశం

Shweta Tiwari: 'దేవుడు నా బ్రా కొలతలు తీసుకుంటున్నాడు'... సీరియల్ నటి వ్యాఖ్యలపై మంత్రి సీరియస్... విచారణకు ఆదేశం

Dil Raju & Harish Shankar - ATM: హరీష్ శంకర్... 'దిల్' రాజు... ఎటిఎం దోపిడీ పక్కా!

Dil Raju & Harish Shankar - ATM: హరీష్ శంకర్... 'దిల్' రాజు... ఎటిఎం దోపిడీ పక్కా!

Mango Ram - Sunitha: సింగర్ సునీత భర్త, మ్యాంగో ఛానల్ అధినేత రామ్ ఆఫీసుపై గౌడ కుల సంఘాల దాడి

Mango Ram - Sunitha: సింగర్ సునీత భర్త, మ్యాంగో ఛానల్ అధినేత రామ్ ఆఫీసుపై గౌడ కుల సంఘాల దాడి

Bigg Boss: బిగ్ బాస్ 'జాతిరత్నాలు'.. ఓటీటీ వెర్షన్ కోసం ప్రమోషన్..

Bigg Boss: బిగ్ బాస్ 'జాతిరత్నాలు'.. ఓటీటీ వెర్షన్ కోసం ప్రమోషన్..

Baahubali Web Series: బాహుబలికే షాక్ ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్.. రూ.150 కోట్లు ఖర్చు పెట్టాక అలా!

Baahubali Web Series: బాహుబలికే షాక్ ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్.. రూ.150 కోట్లు ఖర్చు పెట్టాక అలా!
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Tata Taken Air India: ఇక టాటా వారీ 'ఎయిర్‌ ఇండియా'! ప్రభుత్వం నుంచి వాటాలు అధికారికంగా బదిలీ

Tata Taken Air India: ఇక టాటా వారీ 'ఎయిర్‌ ఇండియా'! ప్రభుత్వం నుంచి వాటాలు అధికారికంగా బదిలీ

Redmi Smart Band Pro: రెడ్‌మీ కొత్త స్మార్ట్ బ్యాండ్ వచ్చేస్తుంది.. ధర రూ.రెండు వేలలోపే.. లాంచ్ ఎప్పుడంటే?

Redmi Smart Band Pro: రెడ్‌మీ కొత్త స్మార్ట్ బ్యాండ్ వచ్చేస్తుంది.. ధర రూ.రెండు వేలలోపే.. లాంచ్ ఎప్పుడంటే?

Covid Vaccine Update: మార్కెట్ విక్రయానికి కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు.. కానీ అక్కడ మాత్రం దొరకవు!

Covid Vaccine Update: మార్కెట్ విక్రయానికి కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు.. కానీ అక్కడ మాత్రం దొరకవు!

Stars Social Talk: దుబాయ్‌లో బన్నీ... బికినీలో దిశా, మాళవిక... రష్యాలో రాశీ ఖన్నా!

Stars Social Talk: దుబాయ్‌లో బన్నీ... బికినీలో దిశా, మాళవిక... రష్యాలో రాశీ ఖన్నా!