Poorna: థియేటర్లు దొరక్క... పదిహేను రోజులు వెనక్కి వెళ్లిన పూర్ణ సినిమా
పూర్ణ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'బ్యాక్ డోర్'. తొలుత ఈ నెల 3న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, థియేటర్లు దొరక్క పదిహేను రోజులు వెనక్కి వెళ్లింది.
హీరోయిన్ పూర్ణ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'బ్యాక్ డోర్'. కర్రి బాలాజీ దర్శకత్వం వహించారు. బి. శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన ఈ ఇసినిమాలో తేజ త్రిపురాన హీరో. ఈ సినిమాను తొలుత 3న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, అనుకున్న సంఖ్యలో థియేటర్లు లభ్యం కానందున సినిమాను ఈ నెల 18కి వాయిదా వేస్తున్నట్టు వెల్లడించారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులను కె.ఆర్.ఫిల్మ్ ఇంటర్నేషనల్ అధినేత, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ కందల కృష్ణారెడ్డి సొంతం చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ "సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. అందుకు తగ్గ సంఖ్యలో థియేటర్లు లభించలేదు. అందుకని, వాయిదా వేశాం. ఈ నెల 15న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నాం" అని అన్నారు.
ఓ సినిమా వాయిదా పడినా... మరో సినిమాతో ఈ వారం పూర్ణ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన హ్యాట్రిక్ సినిమా 'అఖండ'లో ఆమె కీలక పాత్రలో నటించారు. ప్రగ్యా జైస్వాల్ నటించిన ఐఏఎస్ శ్రావణి పాత్రకు మార్గనిర్దేశం చేసే పాత్రలో తాను నటించినట్టు పూర్ణ తెలిపారు.
Also Read: బాలకృష్ణ ముందు డైలాగులు చెప్పడానికి భయపడ్డా! కానీ...
డిసెంబర్ 2న 'అఖండ' విడుదల అవుతుండగా... 3న మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన హిస్టారికల్ ఫిల్మ్ 'మరక్కార్' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆ తర్వాత రోజున, డిసెంబర్ 4న సత్యదేవ్, నిత్యా మీనన్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన 'స్కైలాబ్' విడుదల అవుతోంది. వరుసగా భారీ సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. అందువల్ల, చిన్న సినిమాలకు థియేటర్లు లభించడం కష్టమవుతోందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
View this post on Instagram
Also Read: ‘రాధేశ్యామ్’ సాంగ్.. ‘నన్ను ప్రేమిస్తే చస్తావ్’ ఇదో రొమాంటిక్ వార్నింగ్!
Also Read: 'సిరివెన్నెల' సాహిత్యాన్ని విశ్లేషించడమా!? వినడమా!? ఏం చేద్దాం??
Also Read: భీమ్లా నాయక్ పాట విడుదల చేయడం లేదు... ఆర్ఆర్ఆర్ ట్రైలర్ కూడా
Also Read: తెలుగు అక్షరానికి పాటలతో స్వరాభిషేకం చేసిన సిరివెన్నెలకు ఇదే సిని"మా" నివాళి
Also Read: నా కంటే రెండు నెలలే పెద్దవాడు.. తనికెళ్ల భరణి కన్నీళ్లు.. ఓదార్చడం త్రివిక్రమ్ వల్ల కూడా కాలేదు!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి