Bheemla Nayak & RRR: భీమ్లా నాయక్ పాట విడుదల చేయడం లేదు... ఆర్ఆర్ఆర్ ట్రైలర్ కూడా
సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం చిత్ర పరిశ్రమ ప్రముఖులనే కాదు, ప్రేక్షకులను శోక సంద్రంలో పడేసింది. ఈ నేపథ్యంలో విడుదలకు సిద్ధమైన కొత్త పాటలు, ప్రచార చిత్రాలు వాయిదా పడుతున్నాయి.
పవన్ కల్యాణ్, రానా హీరోలుగా రూపొందుతోన్న సినిమా 'భీమ్లా నాయక్'. ఇందులోని 'అడవి తల్లి...' పాటను నేడు (డిసెంబర్ 1, బుధవారం) విడుదల చేయాలని అనుకున్నారు. అయితే, ఇప్పుడు విడుదల చేయడం లేదు. సిరివెన్నెల మరణంతో వాయిదా వేశారు. అనివార్య కారణాల వల్ల పాట విడుదలను వాయిదా వేస్తున్నామని ప్రకటించారు. సినిమాకు స్క్రీన్ ప్లే, సంభాషణలు సమకూర్చిన త్రివిక్రమ్‌కు సిరివెన్నెల దగ్గర బంధువు. మరణం తర్వాత కార్యక్రమాలను త్రవిక్రమే దగ్గరుండి చూస్తున్నారు. అలాగే, 'భీమ్లా నాయక్' చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు సిరివెన్నెల అంటే అభిమానం. అందుకని, పాట విడుదలను వాయిదా వేసింది.
Due to unforeseen circumstances, #AdaviThalliMaata song will not be coming out tomorrow! #BheemlaNayak
— Sithara Entertainments (@SitharaEnts) November 30, 2021
భీమ్లా నాయక్ పాటతో పాటు 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ విడుదల కూడా వాయిదా పడింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డి.వి.వి. దానయ్య నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ను తొలుత డిసెంబర్ 3న విడుదల చేయాలనుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వాయిదా వేశారు. రెండు మూడు రోజుల్లో ట్రైలర్ ఎప్పడు విడుదల చేసేదీ చెబుతామన్నారు. పైకి, చెప్పకున్నా... సిరివెన్నెల మరణంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Due to unforeseen circumstances we aren’t releasing the #RRRTrailer on December 3rd.
— RRR Movie (@RRRMovie) December 1, 2021
We will announce the new date very soon.
సిరివెన్నెల సాహిత్యం తనను ఏ విధంగా ప్రభావితం చేసినదీ రాజమౌళి ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయమే ఫిల్మ్ ఛాంబర్‌కు వెళ్లిన ఆయన, సీతారామశాస్త్రి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. త్రివిక్రమ్, ఇతర కుటుంబ కుటుంబ సభ్యలను ఓదార్చారు. పలువురు సినీ ప్రముఖులు ఫిల్మ్ ఛాంబర్‌కు క్యూ కట్టారు.
— rajamouli ss (@ssrajamouli) November 30, 2021
Also Read: 'సిరివెన్నెల' సాహిత్యాన్ని విశ్లేషించడమా!? వినడమా!? ఏం చేద్దాం??
Also Read: నా కంటే రెండు నెలలే పెద్దవాడు.. తనికెళ్ల భరణి కన్నీళ్లు.. ఓదార్చడం త్రివిక్రమ్ వల్ల కూడా కాలేదు!
Also Read: 'సిరివెన్నెల' కోసం అయ్యప్పమాల తీసి మరీ వచ్చిన చిరంజీవి... ఆస్పత్రిలో చేరడానికి ముందు ఫోనులో మాట్లాడగా!