Poorna: బాలకృష్ణ ముందు డైలాగులు చెప్పడానికి భయపడ్డా! కానీ...

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'అఖండ'లో పూర్ణ కీలక పాత్రలో నటించారు. డిసెంబర్ 2న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో మీడియాతో ముచ్చటించిన పూర్ణ చెప్పిన విశేషాలు ఇవీ!

FOLLOW US: 

"దర్శకుడు బోయపాటి శ్రీనుగారు నా క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడే... డామినేటింగ్ రోల్ అని చెప్పారు. అయితే... బాలా సార్ (బాలకృష్ణ) ముందు నిలబడి డామినేటింగ్ డైలాగ్స్ చెప్పాలంటే భయపడ్డాను. అయితే... ఆయన ఎంతో హెల్ప్ చేశారు. సెట్‌లో కంఫ‌ర్ట‌బుల్‌గా ఉండే వాతావరణం క్రియేట్ చేశారు" అని పూర్ణ అన్నారు. నట సింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన లేటెస్ట్ సినిమా 'అఖండ'. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. డిసెంబర్ 2న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో పూర్ణ మీడియాతో ముచ్చటించారు.

సినిమాలో తాను పరిణితి చెందిన పాత్రలో కనిపిస్తానని పూర్ణ తెలిపారు. హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఐఏఎస్ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఆమెకు మార్గదర్శిగా, ఆరోగ్య శాఖ మంత్రి తరహా పాత్రలో తన పాత్ర ఉంటుందని పూర్ణ చెప్పారు. తన పాత్ర పేరు పద్మావతి అని అన్నారు. తొలుత ఈ పాత్రకు వేరే నటిని అనుకున్నారట. అదృష్టం కొద్దీ తనకు వచ్చిందని పూర్ణ సంతోషం వ్యక్తం చేశారు. బోయపాటి శ్రీను సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్ మాత్రమే కాకుండా, మిగతా పాత్రలూ బలంగా ఉంటాయని... తన పాత్ర కూడా అదే విధంగా ఉంటుందని ఆమె అన్నారు. ఇందులోని సన్నివేశాల్లో తన నటన గురించి అందరూ మాట్లాడుకుంటారని, ఈ సినిమా తర్వాత తనకు మంచి అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నట్టు పూర్ణ తెలిపారు.
Also Read: బాలకృష్ణకు గాయం అవ్వడానికి కారణం ఏంటో చెప్పిన బోయపాటి శ్రీను! 'జై బాలయ్య' సాంగ్ తీసేటప్పుడు...
బాలకృష్ణ ఫొటోను తన ఫోనులో వాల్ పేపర్ కింద పెట్టుకుంటానని, ఆయన ఎనర్జీ తనకూ రావాలని కోరుకుంటానని పూర్ణ వ్యాఖ్యానించారు. బాలకృష్ణ గురించి ఆమె మాట్లాడుతూ "బాలకృష్ణగారి ఎనర్జీ మామూలుగా ఉండదు. సినిమాలో ఒక్కో ఫైట్ దాదాపు 17 రోజులు షూటింగ్ చేశారు. మేం ఫైట్ చివర్లో జాయిన్ అయ్యేవాళ్లం. కానీ, ఆయన ముందు నుంచీ చేసేవారు. సెట్‌లో అందరూ అలిసిపోయినా... ఆయన మాత్రం అలసిపోయేవారు కాదు. ఎంతో హుషారుగా ఉండేవారు" అని అన్నారు. అఘోర పాత్రలో బాలకృష్ణను చూస్తే... దేవుడిని చూసినట్టు అనిపించిందన్నారు. 

Also Read: బాలకృష్ణ అభిమానులకు బంపర్ న్యూస్... బెనిఫిట్ షోస్‌కు అంతా రెడీ!
Also Read: నందమూరి కుటుంబంలో మూడు తరాలతో పని చేసిన మాస్టర్!
Also Read: అమిత్ షా మీద జోక్ వేశాడని... ఎక్కడా ఏ జోక్ వేయడానికి వీలు లేకుండా!
Also Read: పుష్ప సెట్‌కు వ‌చ్చిన స‌మంత‌... అల్లు అర్జున్‌తో స్పెష‌ల్ సాంగ్ షురూ!
Also Read: 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్... గెస్ట్ కూడా! ఎప్పుడు? ఎక్కడ? అంటే...
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Published at : 29 Nov 2021 04:11 PM (IST) Tags: Tollywood Balakrishna Boyapati Srinu Akhanda Movie Poorna Shamna Kasim

సంబంధిత కథనాలు

NTR: మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను - ఎన్టీఆర్ థాంక్యూ లెటర్

NTR: మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను - ఎన్టీఆర్ థాంక్యూ లెటర్

Vikram Trailer: 'విక్రమ్' తెలుగు ట్రైలర్ వచ్చేసింది - ఫ్యాన్స్ కు యాక్షన్ ట్రీట్

Vikram Trailer: 'విక్రమ్' తెలుగు ట్రైలర్ వచ్చేసింది - ఫ్యాన్స్ కు యాక్షన్ ట్రీట్

Bindu Madhavi: ‘నువ్వు టైటిల్‌కు అర్హురాలివి’ ఆడపులికి సపోర్ట్ చేస్తున్న పాయల్

Bindu Madhavi: ‘నువ్వు టైటిల్‌కు  అర్హురాలివి’ ఆడపులికి సపోర్ట్ చేస్తున్న పాయల్

F3 Movie: 'ఎఫ్3' సెన్సార్ టాక్ - క్లీన్ ఎంటర్టైనర్

F3 Movie: 'ఎఫ్3' సెన్సార్ టాక్ - క్లీన్ ఎంటర్టైనర్

Sanjanaa Galrani: మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ సంజన గల్రానీ

Sanjanaa Galrani: మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ సంజన గల్రానీ
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Sirpurkar Commission Report: దిశ నిందితుల ఎన్ కౌంటర్ బూటకమా - కేసుపై సంచలన విషయాలు వెల్లడించిన సిర్పూర్కర్ రిపోర్ట్‌లో ఏముందంటే !

Sirpurkar Commission Report: దిశ నిందితుల ఎన్ కౌంటర్ బూటకమా - కేసుపై సంచలన విషయాలు వెల్లడించిన సిర్పూర్కర్ రిపోర్ట్‌లో ఏముందంటే !

RR Vs CSK Toss: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై - ఈ మ్యాచ్ రాజస్తాన్‌కే కీలకం

RR Vs CSK Toss: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై - ఈ మ్యాచ్ రాజస్తాన్‌కే కీలకం

Mathura Krishna Janmabhoomi: శ్రీకృష్ణ జన్మభూమి వివాదమేంటి? హిందూ- ముస్లింల ఒప్పందంలో ఏముంది?

Mathura Krishna Janmabhoomi: శ్రీకృష్ణ జన్మభూమి వివాదమేంటి? హిందూ- ముస్లింల ఒప్పందంలో ఏముంది?

Poorna Photos: కుందనపు బొమ్మా నిను చూస్తే మనసుకి వెలుగమ్మా

Poorna Photos: కుందనపు బొమ్మా నిను చూస్తే మనసుకి వెలుగమ్మా