Shiva Shankar Master: నందమూరి కుటుంబంలో మూడు తరాలతో పని చేసిన మాస్టర్!
నందమూరి కుటుంబంలో మూడు తరాల హీరోలతో పని చేసిన కొరియోగ్రాఫర్లలో శివ శంకర్ మాస్టర్ ఒకరు. ఆయన ఎవరెవరితో చేశారు? ఏయే సినిమాలు చేశారు? అంటే...
సినిమా ఇండస్ట్రీలో శివ శంకర్ మాస్టర్‌ది నాలుగున్నర దశాబ్దాల ప్రయాణం. తెలుగు, తమిళ భాషల్లో ఈ కాలంలో ఆయన స్టార్ హీరోలతో పని చేశారు. అందులో విశేషం ఏంటంటే... ఒకే కుటుంబంలోని మూడు తరాల హీరోలతో ఆయన పని చేశారు. సినీ పరిశ్రమలో నందమూరి ఫ్యామిలీకి మూల పురుషుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావుతో పని చేశారు. ఆ తర్వాత ఆయన కుమారుడు బాలకృష్ణ సినిమాల్లో పాటలకు కోరియోగ్రఫీ చేశారు. అలాగే, బాలకృష్ణతో స్క్రీన్ కూడా షేర్ చేసుకున్నారు. నందమూరి ఫ్యామిలీలో మూడో తరం... జూనియర్ ఎన్టీఆర్‌తోనూ పని చేశారు.
సీనియర్ ఎన్టీఆర్ నటించిన పలు సినిమాలకు సలీం మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. సలీం దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేసిన శివ శంకర్ మాస్టర్‌కు, కెరీర్ స్టార్ట్ చేసిన తొలినాళ్లలో ఎన్టీఆర్‌తో పని చేసే అవకాశం లభించింది. సలీం బిజీగా ఉన్నప్పుడు... ఎన్టీఆర్ చేత శివ శంకర్ మాస్టర్ కొన్ని స్టెప్పులు వేయించారు. సలీం నేతృత్వంలో ఆయన కొరియోగ్రఫీ చేశారు. అందులో 'అడవి రాముడు' వంటి హిట్ సినిమాలు ఉన్నాయి. ఇక, శివ శంకర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ అయిన తర్వాత బాలకృష్ణ నటించిన పలు సినిమాల్లో పాటలకు నృత్య రీతులు సమకూర్చారు. ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటించిన బయోపిక్ 'యన్.టి.ఆర్: కథానాయకుడు'లో ఓ పాత్ర చేశారు. అలా ఎన్టీఆర్ కుమారుడితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన సోషియో ఫాంటసీ సినిమా 'యమదొంగ'లో పాటకు కొరియోగ్రఫీ చేశారు. ఇలా ఒకే ఫ్యామిలీలో మూడు తరాల హీరోలతో పని చేసిన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు శివ శంకర్ మాస్టర్.
Also Read: అవకాశాలు రాక... నృత్య ప్రదర్శనలకు డబ్బుల్లేక... సినిమాల్లోకి! ఇదీ శివ శంకర్ మాస్టర్ జర్నీ!
మెగా ఫ్యామిలీలో మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు కొరియోగ్రఫీ చేసిన శివ శంకర్ మాస్టర్, చిరు తనయుడు రామ్ చరణ్ 'మగధీర'లో 'ధీర... ధీర' పాటకు గాను జాతీయ అవార్డు అందుకున్నారు. అల్లు అర్జున్ 'వరుడు' సినిమాలో ఓ పాటకూ కొరియోగ్రఫీ చేశారు. క్లాసికల్ డాన్స్ అయినా, మాస్ డాన్స్ అయినా... ఎటువంటి పాట అయినా చేయగల శివ శంకర్ మాస్టర్ తిరిగి రాని లోకాలకు వెళ్లడం సినిమా ఇండస్ట్రీకి లోటు అని పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: పాయల్ బోల్డ్ వీడియో.. వెంటనే డిలీట్ చేసేసింది..
Also Read: 'రాధే శ్యామ్'లో రెండో సాంగ్ టీజర్ వచ్చింది... చూశారా?
Also Read: అమిత్ షా మీద జోక్ వేశాడని... ఎక్కడా ఏ జోక్ వేయడానికి వీలు లేకుండా!
Also Read: పుష్ప సెట్‌కు వచ్చిన సమంత... అల్లు అర్జున్‌తో స్పెషల్ సాంగ్ షురూ!
Also Read: 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్... గెస్ట్ కూడా! ఎప్పుడు? ఎక్కడ? అంటే...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి