IND vs SA 3rd ODI : టీమిండియా టాస్ గెలిచిందోచ్! 20 మ్యాచ్‌ల తర్వాత కేఎల్ రాహుల్ వ్యూహంతో దశ తిరిగింది!
IND vs SA 3rd ODI : భారత క్రికెట్ జట్టు 21వ ODIలో టాస్ గెలిచింది. 20 మ్యాచ్‌లలో టాస్ ఓడిపోయింది. వైజాగ్ వన్డేలో రాహుల్ చేసిన ఓ పని భారత్ టాస్ గెలిచేలా చేసింది.

India wins first ODI toss after 20 matches: భారత క్రికెట్ జట్టు చివరకు 20 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో వరుసగా టాస్ ఓడిపోయిన తర్వాత 21వ మ్యాచ్‌లో టాస్ గెలిచింది. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. డిసెంబర్ 6న విశాఖపట్నంలో దక్షిణాఫ్రికాతో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డే మ్యాచ్‌లో టీమ్ ఇండియా బరిలోకి దిగింది. ఇది సిరీస్‌లో చివరి మ్యాచ్ కావడంతో టాస్ గెలవడం భారత్‌కు చాలా ముఖ్యం, టాస్‌కు ముందు కెఎల్ రాహుల్ చేసిన ఒక చిన్న పని అద్భుతం చేసింది. భారత క్రికెట్ జట్టు 21వ ODIలో టాస్ గెలిచింది. 20 మ్యాచ్‌లలో టాస్ ఓడిపోయింది.
🚨 Toss 🚨#TeamIndia have won the toss and elected to field first.
— BCCI (@BCCI) December 6, 2025
Updates ▶️ https://t.co/HM6zm9o7bm#INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/vYNPSa1iKF
కెఎల్ రాహుల్ ఏం చేశాడు?
మూడో వన్డేలో కెఎల్ రాహుల్ ఎప్పటిలాగే కుడి చేత్తో కాకుండా ఎడమ చేత్తో టాస్ వేశాడు. అతని ఈ ట్రిక్ విజయవంతమైంది. టాస్ భారత్ వైపు పడింది. టాస్ గెలిచిన తర్వాత రాహుల్ ముఖంలో ఆనందం స్పష్టంగా కనిపించింది. అతను 'కమ్ ఆన్' అని సైగ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. టాస్ గెలిచిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో కూడా ఆనందం కనిపించింది. హర్షిత్ రాణా ఆనందంతో గెంతులు వేస్తూ రిషబ్ పంత్‌ను కౌగిలించుకున్నాడు.
🚨 THE HISTORIC MOMENT 🚨
— Johns. (@CricCrazyJohns) December 6, 2025
- INDIA HAS WON A TOSS IN ODIs AFTER 2 YEARS. 🤯 pic.twitter.com/1vjmZVjCuU
20 మ్యాచ్‌ల తర్వాత టాస్ గెలిచింది
భారత్ చివరిసారిగా 2023 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌లో టాస్ గెలిచింది. దాదాపు రెండేళ్ల తర్వాత, అదృష్టం భారత జట్టు వైపు మొగ్గు చూపింది. టాస్ వైపు మారింది. భారత్ జట్టులో మార్పులు చేర్పులు జరుగుతాయని విశ్లేషణలు వినిపించినా అది జరగలేదు. గత టీంతోనే బరిలోకి దిగింది.
భారత జట్టు ప్లేయింగ్-11: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, కెఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ.
Here's a look at #TeamIndia's Playing XI for the series decider 🙌
— BCCI (@BCCI) December 6, 2025
Updates ▶️ https://t.co/HM6zm9o7bm#INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/SAeo0okUT8
దక్షిణాఫ్రికా జట్టు ప్లేయింగ్-11: రయాన్ రికెల్టన్, క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), టెంబా బావుమా (కెప్టెన్), మాథ్యూ బ్రిట్జ్‌కే, ఐడెన్ మార్క్‌రామ్, డెవాల్డ్ బ్రెవిస్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్, లుంగి ఎంగిడి, ఓటినిల్ బార్ట్‌మన్.
THE HAPPINESS FROM KL RAHUL WHEN HE WON THE TOSS. 😄❤️ pic.twitter.com/eG0GMHzejc
— Johns. (@CricCrazyJohns) December 6, 2025




















