Shamshabad Airport Bomb Threat:శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులను టెన్షన్ పెడుతున్న మెయిల్స్
Shamshabad Airport Bomb Threat:శంషాబాద్ వచ్చే విమానంలో బాంబు ఉందని చెప్పి గత నెల రోజుల్లో నాలుగు సార్లు అధికారులకు మెయిల్స్ వచ్చాయి. దీంతో అధికారులు పరుగులు పెట్టాల్సి వస్తోంది.

Shamshabad Airport Bomb Threat:శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు వస్తున్న మరో రెండు విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకొని వాటిని సురక్షితంగా ల్యాండ్ చేసి ప్రయాణికులను ఐసోలేషన్‌కు తరలించారు. గత నెలలో కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. ఇప్పుడు రెండు రోజుల వ్యవధిలోనే ఇది రెండో బెదిరంపు మెయిల్. ఇలా వరుసు పెట్టి వస్తున్న మెయిల్స్ కారణంగా అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
కోవైట్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వస్తున్న (KU-373) విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో విమానాన్ని మస్కట్ ఎయిర్ పోర్ట్ కు దారి మళ్లించారు. అదే టైంలో లండన్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వస్తున్న బ్రిటిష్ ఎయిర్ లైన్స్ (BA- 277) విమానానికి కూడా ఆగంతకులు బాంబు బెదిరింపు మెయిల్ పెట్టారు.
ఇలా ఒకే టైంలో రెండు విమానాలకు బాంబు బెదిరింపులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లండన్ విమానాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో సెఫ్‌గా ల్యాండ్ చేశారు. అనంతరం ప్రయాణికులను సురక్షితంగా ఐసోలేషన్‌కు పంపించి విమానంలో తనిఖీ చేపట్టారు. మరో కువైట్ విమానంలో కూడా అక్కడి అధికారులు తనిఖీలు చేపట్టారు.
శంషాబాద్ విమానానికి ఇలాంటి బాంబు బెదిరింపులు కొత్త కాదు. ఈ మధ్య కాలంలో ఇలాంటి థ్రెట్నింగ్ కాల్స్ ఎక్కువైపోయాయి. గత నెల అంటే నవంబర్‌లో మూడు సార్లు దుండగులు మెయిల్స్ పెట్టారు. నవంబర్ ఒకటో తేదీన ఇండిగో విమానంలో పపేలుడు పదార్థాలు ఉంచామని ఉదయం ఐదున్నరకు మెయిల్ వచ్చింది. దీంతో ఇండిగో 68 ఫ్లైట్‌ను డైవర్ట్ చేశారు. అనంతరం విమానంలో తనిఖీలు చేసి అది ఫేక్ అని తేల్చారు. అక్కడికి పది రోజులు పోయిన తర్వాత నవంబర్ 12న మరో మెయిల్ వచ్చింది.
రెడ్‌ఫోర్ట్ మెట్రో ఘటన తర్వాత ఈ బెదిరింపులమెయిల్ వచ్చింది. దేశంలోని చాలా విమానాశ్రయాలను ప్రమాదంలో ఉందని హెచ్చరించారు. నవంబర్ 21 సాయంత్రం ఇలాంటి బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో సెక్యూరిటీ టైట్ చేశారు. తనిఖీలు చేపట్టారు. ఇలా తరచూ మెయిల్స్ రావడం అధికారులు అప్రమత్తమై తనిఖీలు చేయం సర్వసాధారణంగా మారుతోంది.





















