అన్వేషించండి
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Bigg Boss 5 Telugu: 'ఫోకస్' టాస్క్ ఫన్నీ టాస్క్ గా మారిపోయిందే..
ఈరోజు ఎపిసోడ్ లో రెండో ఛాలెంజ్ గా ఏ విధమైన ఛాలెంజ్ ని ఎంచుకుంటారో చెప్పమని అడిగారు బిగ్ బాస్. దానికి హౌస్ మేట్స్ అందరూ కలిసి 'ఫోకస్' ఛాలెంజ్ ను ఎన్నుకున్నారు.
టికెట్ టు ఫినాలే టాస్క్ లో గెలవడానికి బిగ్ బాస్ కొన్ని ఛాలెంజ్ లను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు. ఇందులో భాగంగా నిన్న హౌస్ మేట్స్ 'ఎండ్యూరెన్స్' ఛాలెంజ్ సెలెక్ట్ చేసుకోగా.. ఐస్ టబ్ లో ఎక్కువసేపు నుంచొని ఆడే గేమ్ వచ్చింది. ఈరోజు ఎపిసోడ్ లో ఆ గేమ్ పూర్తి కానుంది.
అందుకే రెండో ఛాలెంజ్ గా ఏ విధమైన ఛాలెంజ్ ని ఎంచుకుంటారో చెప్పమని అడిగారు బిగ్ బాస్. దానికి హౌస్ మేట్స్ అందరూ కలిసి 'ఫోకస్' ఛాలెంజ్ ను ఎన్నుకున్నారు. ఈ ఛాలెంజ్ లో భాగంగా బిగ్ బాస్ సమయానుసారం ఇంటి సభ్యుల పేర్లు పిలిచినప్పుడు గార్డెన్ ఏరియాలో ఉన్న చైర్స్ పై కూర్చొని 29 నిమిషాలు లెక్కించడం మొదలుపెట్టాల్సి ఉంటుంది. సరిగ్గా 29 నిమిషాలు పూర్తయ్యాయి అనుకున్నప్పుడు గార్డెన్ ఏరియాలో బెల్ ని మోగించాల్సి ఉంటుంది. ఎవరైతే 29 నిమిషాలకు సరిగ్గా.. లేదా అందరికన్నా దగ్గరగా బెల్ మోగిస్తారో.. వారు ఈ ఛాలెంజ్ లో మొదటి స్థానంలో నిలుస్తారని చెప్పారు బిగ్ బాస్.
ముందుగా కాజల్, సన్నీలు గార్డెన్ ఏరియాలో చైర్స్ లో కూర్చొని బజర్ మోగిన వెంటనే 29 నిమిషాలను కౌంట్ చేయడం మొదలుపెట్టారు. షణ్ముఖ్-సిరి.. కాజల్ ని డిస్టర్బ్ చేస్తూ.. కామెడీ చేశారు. ప్రియాంక వెళ్లి సన్నీను డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నించింది. ఆ తరువాత మానస్-ప్రియాంక చైర్స్ లో కూర్చోగా.. కాజల్.. పింకీని ఆటపట్టించింది. మానస్ ఎప్పుడైతే గంట కొడతాడో.. అప్పుడు కొట్టడానికి రెడీగా ఉన్నావ్ కదా అని కామెడీ చేసింది. సిరి-షణ్ముఖ్ కూడా ప్రియాంకను బాగా ఆడుకున్నారు.
Focus'ed ga numbers evaru count chestaru?#BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/p4G4KKi975
— starmaa (@StarMaa) December 1, 2021
Also Read:'పావుగంటకొక పెక్.. రాత్రికొక పెగ్'.. బ్రహ్మానందంతో బాలయ్య అల్లరి..
Also Read:వరద బాధితులకు ఎన్టీఆర్ సాయం.. ఫ్యూచర్ సీఎం అంటూ కామెంట్స్..
Also Read: 'ఆషికీ' సాంగ్ లో ఫేక్ షాట్స్.. ఇదేంటి రాధా..? అంటూ ట్రోల్స్..
Also Read: థియేటర్లు దొరక్క... పదిహేను రోజులు వెనక్కి వెళ్లిన పూర్ణ సినిమా
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
హైదరాబాద్
విశాఖపట్నం
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement