అన్వేషించండి
Advertisement
Radhe Shyam: 'ఆషికీ' సాంగ్ లో ఫేక్ షాట్స్.. ఇదేంటి రాధా..? అంటూ ట్రోల్స్..
తాజాగా 'రాధేశ్యామ్' సినిమా నుంచి రెండో పాటను వదిలారు. ముందుగా హిందీ వెర్షన్ 'ఆషికీ ఆ గయీ' పాటను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న సినిమా 'రాధేశ్యామ్'. రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రబృందం ప్రమోషనల్ కార్యక్రమాలు షురూ చేశారు. ఇప్పటికే సినిమా నుంచి టీజర్, ఓ పాటను విడుదల చేశారు. తాజాగా సినిమా నుంచి రెండో పాటను వదిలారు. ముందుగా హిందీ వెర్షన్ 'ఆషికీ ఆ గయీ' పాటను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన ఈ పాట అభిమానులకు ఒక విజువల్ ఫీస్ట్ అనే చెప్పాలి.
ఈ పాటలో కొన్ని షాట్స్ సినిమా కథ ఎలా ఉండబోతుందో చెప్పేశాయి. చివరి షాట్ చూస్తే పూజాహెగ్డే క్యారెక్టర్ ని చంపేశారేమో అనే సందేహం కలగక మానదు. ఇక ఈ విషయం పక్కన పెడితే.. ఏ సినిమా షూటింగ్ లోనైనా ఫేక్ షాట్స్ అనేవి తీస్తుంటారు. సందర్భానుసారం వాటిని ఉపయోగిస్తుంటారు. 'ఆషికీ' సాంగ్ కోసం కూడా ఇలాంటి ఫేక్ షాట్స్ ను తీశారు. కానీ సాంగ్ ని ఎడిటింగ్ చేసేప్పుడు చూసుకోలేదో.. ఏమో కానీ ఈ ఫేక్ షాట్ అనేది చాలా క్లియర్ కనిపించేసింది.
పూజాహెగ్డే.. ప్రభాస్ బైక్ పై రైడ్ కి వెళ్తూ.. ఎంజాయ్ చేస్తూ కనిపించే షాట్ ను డూప్స్ తో చేయించిందే ఉంచేశారు. అసలే ప్రతి విషయాన్ని పట్టిపట్టి చూసే యాంటీ ఫ్యాన్స్ దీన్ని చాలా ఈజీగా కనిపెట్టేశారు. సోషల్ మీడియా వేదికగా దర్శకుడు రాధాకృష్ణకుమార్ ను ట్రోల్ చేస్తున్నారు. కనీసం తెలుగు వెర్షన్ లోనైనా ఈ మిస్టేక్ రిపీట్ కాకుండా చూసుకుంటారేమో చూడాలి.
(Troll Credit: Nela Ticket Batch)
Love like there's no tomorrow. Presenting the first from #MusicalOfAges #Radheshyam, #AashiquiAaGayi by @mithoon11 & @arijitsinghhttps://t.co/lApuOeh2H5
— T-Series (@TSeries) December 1, 2021
Starring #Prabhas & @hegdepooja
Also Read: థియేటర్లు దొరక్క... పదిహేను రోజులు వెనక్కి వెళ్లిన పూర్ణ సినిమా
Also Read: ‘రాధేశ్యామ్’ సాంగ్.. ‘నన్ను ప్రేమిస్తే చస్తావ్’ ఇదో రొమాంటిక్ వార్నింగ్!
Also Read: 'సిరివెన్నెల' సాహిత్యాన్ని విశ్లేషించడమా!? వినడమా!? ఏం చేద్దాం??
Also Read: భీమ్లా నాయక్ పాట విడుదల చేయడం లేదు... ఆర్ఆర్ఆర్ ట్రైలర్ కూడా
Also Read: నా కంటే రెండు నెలలే పెద్దవాడు.. తనికెళ్ల భరణి కన్నీళ్లు.. ఓదార్చడం త్రివిక్రమ్ వల్ల కూడా కాలేదు!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
హైదరాబాద్
ఆటో
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion