అన్వేషించండి

Bobby Deol: ‘రానా నాయుడు’ చూసి బాధపడ్డా, బాబీ డియోల్ సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాబీ డియోల్ ‘రానా నాయుడు’పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సిరీస్ చూసి చాలా బాధ పడినట్లు వెల్లడించారు. మేకర్స్ ఈ సిరీస్ ను అందరూ చూసేలా తెరకెక్కించలేదన్నారు.

బాలీవుడ్ దిగ్గజన నటుడు బాబీ డియోల్ వరుస సినిమాలో దుమ్మురేపుతున్నారు. తాజాగా ఆయన ‘యానిమల్’  సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. రణబీర్ కపూర్, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి  సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రణబీర్ ని ఊర మాస్ లెవెల్లో చూపిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ మరింత క్యూరియాసిటీ పెంచాయి. తాజాగా 'యానిమల్'లో నెగెటివ్ రోల్ పోషిస్తున్న బాబీ డియోల్ పోస్టర్ ని విడుదల చేశారు. 'యానిమల్ కా విలన్' అనే క్యాప్షన్ తో పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో బాబీ డియల్ వైలెంట్ మెన్ గా కనిపించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది.

‘రానా నాయుడు’పై బాబీ డియోల్ అసంతృప్తి

ఇక ‘యానిమల్’ సినిమా ప్రమోషన్ లో భాగంగా  బాబీ డియోల్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన తెలుగు స్టార్లు వెంకటేష్, రానా నటించిన ‘రానా నాయుడు’ సిరీస్ పై సంచనల వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి కాలంలో భారీ అంచనాల నడుమ విడుదలై, ప్రేక్షకులను ఆకట్టుకోని చిత్రం ఏంటిని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆయన ‘రానా నాయుడు’ అని చెప్పారు. ‘రే డోనోవన్’ రీమేక్ గా తెరకెక్కించిన ‘రానా నాయుడు’ చూసి నిజంగా బాధపడినట్లు చెప్పారు. వాస్తవానికి ‘రే డోనోవన్’ అద్భుతంగా ఉంటుందని చెప్పారు. అయితే, రీమేక్ విషయానికి వచ్చే సరికి అసలు కథ పక్కదోవ పట్టిందన్నారు. తాను ఈ సిరీస్ చూసే ముందు చాలా అంచనాలు పెట్టుకున్నట్లు చెప్పారు. అయితే, ఈ సిరీస్ ను మేకర్స్ అనుకున్న విధంగా తెరకెక్కించడంలో విఫలం అయ్యారని చెప్పారు. ‘రానా నాయుడు‘ సిరీస్ అమెరికన్ పాపులర్ వెబ్ సిరీస్ ‘రే డోనోవర్’కు ఇండియన్ వెర్షన్ గా రూపొందించారు. నెట్ ఫ్లిక్స్ ఈ వెబ్ సిరీస్ ను నిర్మించగా, సుపర్ణ్ వర్మ, కరణ్ అన్షుమన్ తెరకెక్కించారు.  బాలీవుడ్ హాట్ బ్యూటి సుర్విన్ చావ్లా ఇందులో చక్కటి నటన కనబర్చింది. ఆశిష్ విద్యార్థి, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, ఆదిత్య మీనన్, ముకుల్ చద్దా కీలక పాత్రల్లో నటించారు.

డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల

ఇక ‘యానిమల్’ సినిమాలో రణబీర్ సరసన రష్మిక మందన్న గీతాంజలి అనే పాత్రలో కనిపించబోతోంది.  బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ ఇందులో రణబీర్ తండ్రిగా నటిస్తున్నారు. టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా హిందీ తో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీగా అంచనాలు నెలకొన్నాయి.

Read Also: రోమ్ లో బన్నీ, స్నేహ రొమాన్స్ - సోషల్ మీడియాలో చక్కర్లు కొడుకున్న ఫోటోలు

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Anasuya Bharadwaj : భర్త చనిపోతే బొట్టు, గాజులు తీసేయాలా? - అనసూయ ఎమోషనల్ వీడియో
భర్త చనిపోతే బొట్టు, గాజులు తీసేయాలా? - అనసూయ ఎమోషనల్ వీడియో
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
NBK111 Release Date : NBK111 రిలీజ్ డేట్ ఫిక్స్! - బాలయ్య మూవీ షూటింగ్ మళ్లీ ఎప్పుడంటే?
NBK111 రిలీజ్ డేట్ ఫిక్స్! - బాలయ్య మూవీ షూటింగ్ మళ్లీ ఎప్పుడంటే?
Miss Apoorva: బోల్డ్ & బ్యూటిఫుల్ మిస్ అపూర్వ.. బిగ్ బాస్ అగ్నిపరీక్షలో దుమ్మురేపుతోన్న కామనర్.. మోడలింగ్ నుంచి గ్లామర్ హౌస్ వరకు!
బోల్డ్ & బ్యూటిఫుల్ మిస్ అపూర్వ.. బిగ్ బాస్ అగ్నిపరీక్షలో దుమ్మురేపుతోన్న కామనర్

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karumuri Nageswara Rao Arrest: హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
NITI Aayog Report: 8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Gill Historic Milestone: గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
Embed widget