అన్వేషించండి

Allu Arjun: రోమ్ లో బన్నీ, స్నేహ రొమాన్స్ - సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫోటోలు

అల్లు అర్జున్ తన సతీమణి స్నేహతో కలిసి రోమ్ లో హాలీడేని ఎంజాయ్ చేస్తున్నారు. వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి కోసం వెళ్లిన అల్లు ఫ్యామిలీ, చారిత్రక ప్రాంతాలను చూస్తూ సరదాగా గడుపుతున్నారు.

అల్లు ఫ్యామిలీ ఇటలీకి వెళ్లింది. వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి కోసం వెళ్లిన అల్లు అర్జున్, స్నేహ వారి పిల్లలు అయాన్, అర్హ ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఇటలీకి బయల్దేరారు. బన్నీ ఫ్యామిలీ ఇవాళ పెళ్లి జరిగే టుస్కానికి వెళ్తుంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీతో పాటు అల్లు, కామినేని కుటుంబాలు కూడా పెళ్లి కోసం ఇటలీకి చేరుకున్నాయి.  

రోమ్ లో బన్నీ, స్నేహా రొమాన్స్ 

అల్లు అర్జున్, స్నేహ తరుచుగా అభిమానులతో చక్కటి ఫోటోలు షేర్ చేసుకుంటారు. ఇద్దరూ అన్యోన్యంగా కనిపిస్తూ రొమాంటిక్ ఫోటోలతో అలరిస్తారు. తమ ఫోటోలతో పాటు తమ పిల్లల ఫోటోల, వీడియోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. తాజాగా రోమ్ పర్యటనకు సంబంధించిన ఫోటోలను కూడా స్నేహ పంచుకున్నారు. చక్కటి ఫోటోలను ఇన్ స్టా స్టోరీగా పెట్టింది. వీటిలోని చారిత్రక నిర్మాణాల ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక అల్లు అర్జున్, స్నేహను ప్రేమగా కౌగిలించుకున్న ఫోటో హైలెట్ గా ఉంది. పెళ్లికి సమయం ఉండటంతో బన్నీ తన భార్య, పిల్లలతో కలిసి పర్యాటక ప్రదేశాలకు వెళ్లారు. ఈ చిన్న వెకేషన్ ను కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు.  ఇక ఈ ఫోటోల్లో స్నేహ జిమ్ కు వెళ్లడంతో పాటు ఇష్టమైన ఐస్ క్రీమ్ తింటూ ఆహ్లాదంగా గడుపుతున్నట్లు అర్థం అవుతోంది. కొన్ని స్థానిక రుచికరమైన వంటకాలను కూడా ఆస్వాదించింది.

ఒకే ఫ్రేమ్ లో కొణిదెల, కామినేని కుటుంబాలు

ఈ వివాహ వేడుకల కోసం కొణిదెల, కామినేని కుటుంబాలు కూడా ఇటలీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇటలీలోని పలు పర్యాటక ప్రాంతాల్లో హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు. రామ్‌ చరణ్, ఉపాసన, చిరంజీవి, ఆయన సతీమణితో పాటు ఇతర కుటుంబ సభ్యులు అందమైన ప్రదేశాల్లో విహరిస్తున్నారు. తాజాగా అందరూ కలిసి టుస్కానీలో ఓ గ్రూప్ ఫోటో తీసుకున్నారు. ఈ ఫోటోను ఉపాసన తన ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.  

వరుణ్ తేజ్- లావణ్య  వివాహం

ఇక నవంబర్ 1న ఇటలీ టుస్కానిలోని అత్యంత అద్భుతమైన బోర్గో శాన్ ఫెలిస్ రిసార్ట్‌ లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహం జరగనుంది. ఈ రోజు కాక్‌ టెయిల్ పార్టీతో పెళ్లి వేడుకలు మొదలుకానున్నాయి. అటు మెహందీ, హల్దీ వేడుకలు అక్టోబర్ 31న జరుగుతాయి. సినీ ఇండస్ట్రీ, ప్రముఖుల కోసం నవంబర్‌ 5న హైదరాబాద్‌లో రిసెప్షన్‌ నిర్వహించనున్నారు. మాదాపూర్‌ ఎన్‌ కన్వెన్షన్‌ లో ఈ వేడుక జరగనుంది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం గత జూన్ లో జరిగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించారు.

Read Also: ఎక్స్‌పోజ్‌ చేయడం అంత ఈజీ కాదు, నెటిజన్‌కు అనసూయ దిమ్మతిరిగే సమాధానం

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ramani Kalyanam Review - 'రమణీ కళ్యాణం' రివ్యూ: ఆనందంలో అంతులేని బాధలు... సినిమా హిట్టా? ఫట్టా?
'రమణీ కళ్యాణం' రివ్యూ: ఆనందంలో అంతులేని బాధలు... సినిమా హిట్టా? ఫట్టా?
Nindu Manasulu Serial Today Episode: సిద్ధూ తండ్రి శరత్‌ ఫొటో చూసి షాకైన ప్రేరణ... విజయానంద్‌ అసలు రంగు బయటపడుతుందా?
నిండు మనసులు: సిద్ధూ తండ్రి శరత్‌ ఫొటో చూసి షాకైన ప్రేరణ... విజయానంద్‌ అసలు రంగు బయటపడుతుందా?
Friday OTT Movies : ఓటీటీలోకి ఒకే రోజు 16 సినిమాలు - ఈ మూవీస్ డోంట్ మిస్
ఓటీటీలోకి ఒకే రోజు 16 సినిమాలు - ఈ మూవీస్ డోంట్ మిస్
Gunde Ninda Gudi Gantalu May 22 Episode: బాలు మీనాకి రోహిణి వార్నింగ్, గుణతో డీల్ సెట్ చేసుకున్న పార్లలమ్మ - గుండెనిండా గుడిగంటలు మే 22 ఎపిసోడ్!
బాలు మీనాకి రోహిణి వార్నింగ్, గుణతో డీల్ సెట్ చేసుకున్న పార్లలమ్మ - గుండెనిండా గుడిగంటలు మే 22 ఎపిసోడ్!

వీడియోలు

MI vs KKR IPL 2026 Highlights | ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ ఊచకోత
KKR Bowlers Destroy MI Batting IPL 2026 | ముంబైకు చుక్కలు చూపించిన నరైన్, గ్రీన్
Sanju Samson vs Heinrich Klaasen | క్లాసెన్‌తో గొడవకు ఎండ్ కార్డ్ వేసిన సంజూ
Virat Kohli Comments On Captaincy Stress | ద్రవిడ్ చేసిన సాయంపై కోహ్లీ సంచలన వ్యాఖ్యలు
Hardik Pandya Shocking Comments IPL 2026 | కేకేఆర్ చేతిలో ఓటమిపై హార్దిక్ పాండ్యా అసంతృప్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nowhera Shaik Arrested: హీరా గోల్డ్ స్కామ్‌ నౌహీరా షేక్ అరెస్టు! గురుగ్రామ్‌లో చిక్కిన డాన్!
ఖురాన్ టీచర్ నుంచి కుబేరురాలి వరకు... హీరా గోల్డ్ కుంభకోణంలో అరెస్టైన నౌహీరా షేక్‌ బ్యాక్‌గ్రౌండ్!
Heatwave in Andhra Pradesh and Telangana:తెలుగు రాష్ట్రాల్లో హీట్‌వేవ్‌ దెబ్బ! పిడుగురాళ్లలో 48.1 డిగ్రీలు! పలు జిల్లాలకు రెడ్ అలర్ట్!
తెలుగు రాష్ట్రాల్లో హీట్‌వేవ్‌ దెబ్బ! పిడుగురాళ్లలో 48.1 డిగ్రీలు! పలు జిల్లాలకు రెడ్ అలర్ట్!
Transfer Trimurthulu Teaser : ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు వెరీ స్ట్రిక్ట్ - పదేళ్ల తర్వాత హీరోగా వడ్డే నవీన్ రీఎంట్రీ
ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు వెరీ స్ట్రిక్ట్ - పదేళ్ల తర్వాత హీరోగా వడ్డే నవీన్ రీఎంట్రీ
IPL 2026 GT VS CSK Result Update: చెన్నై ఇంటికి.. జీటీ చేతిలో ఘోర ప‌రాజ‌యం.. రాణించిన సుద‌ర్శ‌న్, గిల్, సిరాజ్, రాబ‌డ‌
చెన్నై ఇంటికి.. జీటీ చేతిలో ఘోర ప‌రాజ‌యం.. రాణించిన సుద‌ర్శ‌న్, గిల్, సిరాజ్, రాబ‌డ‌
Hardik Pandya Fined: MI కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు జరిమానా - KKR మ్యాచ్ లో ప్రవర్తనపై సీరియస్ యాక్షన్
MI కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు జరిమానా - KKR మ్యాచ్ లో ప్రవర్తనపై సీరియస్ యాక్షన్
Numerology: మీ పుట్టిన తేదీ 2,11,20 లేదా 29 అయితే మిమ్మల్ని అందరూ ఎందుకు ఇష్టపడతారో తెలుసా?
మీ పుట్టిన తేదీ 2,11,20 లేదా 29 అయితే మిమ్మల్ని అందరూ ఎందుకు ఇష్టపడతారో తెలుసా?
Chennai Super Kings  Knock Out: చెన్నై సూపర్ కింగ్స్ ఓట‌మితో ఫ్లే ఆఫ్స్ రేసులో నిలిచిన నాలుగు జట్లు.. హోరాహోరీ పోరు
చెన్నై సూపర్ కింగ్స్ ఓట‌మితో ఫ్లే ఆఫ్స్ రేసులో నిలిచిన నాలుగు జట్లు.. హోరాహోరీ పోరు
ఈ రోజు రాశిఫలాలు 22 మే 2026: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఫలితాలు
ఈ రోజు రాశిఫలాలు 22 మే 2026: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఫలితాలు
Embed widget