అన్వేషించండి

Anasuya Bharadwaj: ఎక్స్‌పోజ్‌ చేయడం అంత ఈజీ కాదు, నెటిజన్‌కు అనసూయ దిమ్మతిరిగే సమాధానం

అందాల నటి అనసూయ ఓ నెటిజన్ కు దిమ్మతిరిగే సమాధానం చెప్పింది. ఎక్స్ పోజింగ్ చేయడం అందరూ అనుకుంటున్నంత ఈజీ కాదని వెల్లడించింది.

బుల్లితెర యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్, ప్రస్తుతం వెండితెరపై సత్తా చాటుతోంది. వరుస సినిమాలో ఫుల్ బిజీగా గడుపుతోంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఆమె చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. “మహానటి సావిత్రిలా నటించడం ఎంత కష్టమో, ఎక్స్‌పోజింగ్ చేయడం కూడా అంతే కష్టం” అంటూ రాసుకొచ్చింది. ఇంతకీ ఆమె ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే?  

అనసూయకు నెటిజన్ కౌంటర్

తాజాగా అనసూయ ఓ తెలుగు ఛానెల్ నిర్వహించిన అవార్డుల వేడుకలో పాల్గొన్నది. ఇందులో ఓ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అలనాటి తారలు సావిత్రి, జమున, శ్రీదేవి, సౌందర్య నటించిన కొన్ని పాటలను ఆమె రీ క్రియేట్‌ చేసింది. వారి మాదిరిగానే గెటప్స్ వేసుకుని అద్భుతంగా డ్యాన్స్ చేసింది. ఈ ఈవెంట్ కు సంబంధించి కొన్ని ఫోటోలను అనసూయ ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. “నా డ్యాన్స్ పెర్ఫామెన్స్‌ తో దిగ్గజ తారలకు నివాళి అర్పించే ఛాన్స్ రావడం అదృష్టంగా భావిస్తున్నాను” అని వెల్లడించారు. చాలా మంది ఆమె పోస్టుకు పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్నారని వెల్లడించారు. అయితే, ఓ నెటిజన్ మాత్రం ఆమెకు కౌంటర్ ఇచ్చాడు. ‘ఎక్స్‌ పోజింగ్ చేసినంత ఈజీ కాదు.. సావిత్రిలా నటించడం అంటే” అంటూ ట్వీట్ చేశారు.  

దిమ్మ తిరిగే సమాధానం చెప్పిన అనసూయ

ఈ ట్వీట్ కు అనసూయ రియాక్ట్ అయ్యింది. సదరు నెటిజన్ కు గట్టి సమాధానం చెప్పింది. “నిజం చెప్పారండీ.. సావిత్రమ్మలా నటించడం చేయటం ఎవరి తరం కాదు. నేను కేవలం వారికి నివాళిగా ప్రదర్శన ఇచ్చాను. అంతేకాదు, ఎక్స్‌ పోజింగ్ చేయడం అనేది కూడా ఈజీ కాదు. ఫిజికల్ గా, ఎమోషనల్ గా చాలా ప్రిపేర్ కావాలి. ఏ పాత్ర చేసినా, ఏ దుస్తులు ధరించినా మన పనిని దృఢ సంకల్పంతో చెయ్యాలి” అని వెల్లడించింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.  

వరుస సినిమాలతో అలరిస్తున్న అనసూయ

అనసూయ రీసెంట్ గా నటించి పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ‘విమానం’, ‘పెదకాపు 1’, ‘ప్రేమ విమానం’ సినిమాల్లో తన అద్భుత నటనతో అందరినీ ఆకట్టుకుంది. ‘విమానం’ సినిమాలో వేశ్య పాత్రలో అద్భుతంగా ఆకట్టుకుంది. ‘ప్రేమ విమానం’ సినిమాలో భర్తను కోల్పోయిన మహిళగా, ఇద్దరు పిల్లల తల్లిగా చక్కగా నటించింది. ఇక ఇప్పటికే ఆమె నటించిన ‘పుష్ప’ సినిమా చక్కటి గుర్తింపు తెచ్చింది. ఇందులో దాక్షాయణిగా అలరించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ‘పుష్ప 2’లో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు మరికొన్ని చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషిస్తోంది. అడపాదడపా బుల్లితెర ఈవెంట్లోనూ పాల్గొంటూ అభిమానులను అలరిస్తోంది.

Read Also: ల‌వ్ ఫెయిల్యూర్​తో మంచే జరిగింది, బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : రెండు ఓటీటీల్లోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
రెండు ఓటీటీల్లోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Romantic Drama OTT : ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ డ్రామా - మూడు నెలల తర్వాత సడన్ స్ట్రీమింగ్
ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ డ్రామా - మూడు నెలల తర్వాత సడన్ స్ట్రీమింగ్
CULT First Day Collections : కల్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ సేన్ కొత్త మూవీ వసూళ్లు ఎంతంటే?
కల్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ సేన్ కొత్త మూవీ వసూళ్లు ఎంతంటే?
Aadarsha Kutumbam First Day Collection : వెంకీ ఆదర్శ కుటుంబం ర్యాంపేజ్ స్టార్ట్ - ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
వెంకీ ఆదర్శ కుటుంబం ర్యాంపేజ్ స్టార్ట్ - ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Daughter Marriage: కుమార్తె వివాహ వేదికను మార్చుతున్నట్లు వైఎస్ షర్మిల వెల్లడి.. ఆవేదనతో పోస్ట్
కుమార్తె వివాహ వేదికను మార్చుతున్నట్లు వైఎస్ షర్మిల వెల్లడి.. ఆవేదనతో పోస్ట్
Hyderabad Farmhouse Party: చేవెళ్లలో అమ్మాయిలతో విద్యార్థులు ఫామ్‌హౌస్ పార్టీ.. సడన్ ఎంట్రీతో షాకిచ్చిన పోలీసులు !
చేవెళ్లలో అమ్మాయిలతో విద్యార్థులు ఫామ్‌హౌస్ పార్టీ.. సడన్ ఎంట్రీతో షాకిచ్చిన పోలీసులు !
ISRO మరో ఘనత.. విజయవంతంగా కక్షలోకి NVS-03 శాటిలైట్.. సరిహద్దులు సేఫ్
ఇస్రో మరో ఘనత.. విజయవంతంగా కక్షలోకి NVS-03 శాటిలైట్.. సరిహద్దులు సేఫ్
GVMC Mayor Election: ఎన్డీయే vs వైఎస్సార్‌సీపీ - విశాఖ మేయర్ పీఠం ఎవరిది?
ఎన్డీయే vs వైఎస్సార్‌సీపీ - విశాఖ మేయర్ పీఠం ఎవరిది?
Miyapur 550 Acres Land Auction: మియాపూర్ భూముల వేలంతో రూ. 50 వేల కోట్లు - రేవంత్ సర్కార్ ప్లాన్‌కు ఉన్న ఆటంకాలేంటి?
మియాపూర్ భూముల వేలంతో రూ. 50 వేల కోట్లు - రేవంత్ సర్కార్ ప్లాన్‌కు ఉన్న ఆటంకాలేంటి?
Gambhir Franchise Hunt: టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోకముందే బిగ్ ట్విస్ట్.. గంభీర్ కోసం నాలుగు ఐపీఎల్ జట్ల మధ్య బిగ్ వార్
టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోకముందే బిగ్ ట్విస్ట్.. గంభీర్ కోసం నాలుగు ఐపీఎల్ జట్ల మధ్య బిగ్ వార్
AP Local Body Elections: ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో పరాకాష్ఠకు సైబర్ దాడి - వ్యక్తిగత జీవితాలపై రాజకీయాలు -వ్యక్తిత్వ హననం ఆయుధమా?
తెలంగాణ రాజకీయాల్లో పరాకాష్ఠకు సైబర్ దాడి - రాజకీయాలు -వ్యక్తిత్వ హననం ఆయుధమా?
Embed widget