అన్వేషించండి

Bigg Boss 8 Telugu Episode 35 Day 34: నాగ్ చురకలకు మాడిపోయిన మణికంఠ మొహం... ఒక్కొక్కరి గురించి ఆదిత్య ఏం చెప్పాడంటే?

Bigg Boss 8 Telugu Episode 35 Day: ఈ రోజు ఎపిసోడ్ లో నాగ్ చేత మణికంఠకు స్వీట్ వార్నింగ్ ఇప్పించాడు బిగ్ బాస్. ఇంకెంత ఏడ్వాలని అనుకుంటున్నావో.. ఏడ్చేసేయ్.. అంటూ మణికంఠను కన్ఫెషన్ రూంలో దులిపేశాడు.

Nagarjuna Counters to Manikanta Cries And Aditya Journey Video: మణికంఠ ఏడ్పులతో ఈ వారం అంతా ఆడియెన్స్ విసుగెత్తి పోయారన్న సంగతి తెలిసిందే. మణికంఠ ఏడ్పులకు అడ్డు కట్ట వేయాలని నాగార్జున ఫిక్స్ అయ్యాడు. ఆడియెన్స్ నుంచి వచ్చిన కంప్లైంట్‌ను బిగ్ బాస్ టీం కన్సిడర్ చేసినట్టుగా ఉంది. అందుకే నాగ్ చేత మణికంఠకు స్వీట్ వార్నింగ్ ఇప్పించాడు. ఎప్పుడూ ఎందుకు ఏడుస్తున్నావ్? ఏడ్వడమే నీ స్ట్రాటజీనా? అని నిలదీశాడు. ఇంకెంత ఏడ్వాలని అనుకుంటున్నావో.. ఏడ్చేసేయ్.. అంటూ మణికంఠను కన్ఫెషన్ రూంలో దులిపేశాడు. నీ భార్య ఆ ఫుడ్ పంపలేదు.. అని చెప్పడంతోనే మణికంఠ ఏడ్చేశాడు. ఫుడ్ పంపలేదు కానీ.. మెసెజ్ పంపింది అని చెప్పి కూల్ చేశాడు.

'అందరికీ ఎమోషన్స్ ఉంటాయి. అందరికీ ఏడుపు వస్తుంది.. కానీ వాటిని కంట్రోల్ చేసుకునేవాడే ముందుకు వెళ్తాడు. ఎప్పుడూ ఏడ్వొద్దు. కన్నీరు కాదు.. కసిగా ఆడు' అంటూ సలహా ఇచ్చాడు. ఆ తరువాత ఇంటి సభ్యులతో నాగ్ ఆట ఆడించాడు. ప్రేరణతో ఆట ఆరంభించాడు నాగ్. చిరాకు పుట్టించే వ్యక్తి మణికంఠ అని ప్రేరణ చెప్పింది. 'వేరే వాళ్ల గురించి ఆలోచించడు.. ఎప్పుడూ అతని గురించే పట్టించుకోవాలని అనుకుంటాడు.. అందరినీ విసిగిస్తుంటాడు.. వేరే వాళ్ల గురించి ఆలోచించడు.. అవతలి వాళ్ల పరిస్థితిని అర్థం చేసుకోడు' అంటూ ప్రేరణ చెప్పింది. ఇక సీతకు జెలసీ ట్యాగ్ ఇచ్చింది. టాస్కులో మణిని కాకుండా సీతను తీసేయడంతో జెలసీగా ఫీల్ అయినట్టుగా అనిపించిందని ప్రేరణ తెలిపింది.

'బెడ్రూంలోనే పడుకుంటోందని, ఏం ఆటలు ఆడటం లేదని నైనికను అన్నావ్.. మరి నువ్వు చేస్తున్నది ఏంటి?' అంటూ మణికంఠ పరువు తీసేశాడు నాగ్. 'ఒకరిని అనే ముందు మనం ఏం చేస్తున్నామో కూడా చూసుకోవాలి' అంటూ కౌంటర్లు వేశాడు. 'సీత బాడీ లాంగ్వేజ్‌లో నీకు కనిపించిన ప్రాబ్లం ఏంటి?' అని మణిని నిలదీశాడు. ఆమె నన్ను కావాలని ఇమిటేట్ చేసినట్టుగా అనిపించిందంటూ నాగ్ ముందు మణి తన బాధను బయట పెట్టుకున్నాడు. నబిల్ కూడా సీతదే తప్పు అన్నట్టుగా చెప్పాడు. కానీ తన ఉద్దేశం అది కాదు అని సీత చెప్పింది. 'ప్రతీ దానికి ఇలానే మా అందరినీ కార్నర్ చేస్తాడు.. చివరకు మేమే అతడ్ని కార్నర్ చేశామని ఏడుస్తాడు' అంటూ సీత చెప్పింది.

'మణికంఠలో చాలా ఉంది ఉన్నారనిపిస్తుంది' అంటూ విష్ణు ప్రియ అనడంతో.. మణి కాదు మెనీ అని నాగార్జున ఓ నిక్ నేమ్ పెట్టేశాడు.  మెనీ కంఠ.. ఈ ఇంట్లో నీకు ఇష్టమైన వాళ్లు ఎవరో చెప్పు అని నాగ్ అడుగుతాడు. నబిల్, విష్ణు ప్రియ అంటూ తన ఫ్రెండ్స్ పేరు మణికంఠ చెబుతాడు. దీంతో విష్ణు ప్రియని లేపి.. హౌస్ అంతా కూడా మణిని కార్నర్ చేస్తుందా? అని అడిగాడు. లేదు సర్.. ఎవ్వరూ కార్నర్ చేయడం లేదు.. మణికంఠే.. అందరూ తనగురించి ఆలోచించాలని, తన గురించే ఉండాలని, తన వైపు చూడాలని అనుకుంటాడు.. నేనే.. నేనే అన్నట్టుగా ఉంటాడు అని సెల్ఫీష్ అనే ట్యాగ్ ఇచ్చింది. నిఖిల్ ముందు వారాల్లో పట్టించుకోలేదు.. చీఫ్ బాధ్యత నుంచి బయటకు వచ్చాక నా కంటే చిన్న పిల్లాడు అయ్యాడు అని విష్ణు ప్రియ చెబుతుంది. చీఫ్ నుంచి దిగిన తరువాతా? సోనియా వెళ్లిపోయిన తరువాతా? అంటూ కౌంటర్ వేశాడు

ఇక ఇంటి సభ్యుల్లో అందరూ మణికి టాక్సిక్, చిరాకు పుట్టించే వ్యక్తి, సెల్ఫీష్ అనే ట్యాగులు ఇస్తూనే వెళ్లారు. దీంతో మణికంఠ మళ్లీ ఏడ్పు పురాణం అందుకున్నాడు. తన వంతు వచ్చే సరికి మణి అసలు ఆటే ఆడనని అన్నాడు. తానే సరిగ్గా లేనని, ఇంకో వ్యక్తి గురించి తానేం చెబుతాను అని ఆట ఆడను అంటూ నాగ్ ముందు మొండికేశాడు. అసలు నేను ఎందుకు ఇలా ఉన్నాను? అని నాకు నేనే బాధపడుతున్నాను అంటూ మణికంఠ మళ్లీ సింపతీ ఏడ్పులు ఏడ్చినట్టుగా అనిపిస్తుంది. ఇలా మణికంఠ పదే పదే ఏడుస్తూ ఉంటే.. ప్రేక్షకులు కచ్చితంగా భరించరు. ఇదే విషయాన్ని నాగార్జున కూడా హింట్ ఇచ్చాడు. కానీ మణి మాత్రం ఇంకా తన పద్దతిని మార్చుకోవడం లేదనిపిస్తుంది.

నైనిక బాగా ఆడటం లేదని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. చీఫ్‌గా సీత సరైన నిర్ణయం తీసుకోలేదని కౌంటర్ వేశాడు. ప్రేరణ టాస్కులు బాగా ఆడిందని, సంచాలక్‌గా సరైన నిర్ణయం తీసుకుందని పొగిడాడు. పృథ్వీ టాస్కులు బాగా ఆడుతున్నాడని, ఎమోషన్స్‌ను కంట్రోల్ చేసుకుంటున్నాడని ప్రశంసించాడు. మెగా ఛీప్ అయిన నబిల్‌ను నాగ్ ప్రశంసించాడు. ఇక నిఖిల్, నబిల్‌లను సేఫ్ అయినట్టుగా శనివారం ఎపిసోడ్‌లో నాగ్ ప్రకటించాడు.

Also Read:బిగ్ బాస్ తెలుగు 8 డే 33 రివ్యూ... విసిగిస్తున్న బిగ్ బాస్ టీం... కంటెస్టెంట్ల ఏడ్పులు ఆడియెన్స్ నిట్టూర్పులు

మిడ్ వీక్‌లో ఎలిమినేట్ అయిన ఆదిత్యని స్టేజ్ మీదకు నాగ్ తీసుకొచ్చాడు. జర్నీ చూసి ఆదిత్య ఎమోషనల్ అయ్యాడు. హగ్, పంచ్ అనే టాస్కుని ఆదిత్యకు ఇచ్చాడు. నాలుగు పంచ్‌లు, ఐదు హగ్గులు.. చెప్పాలని నాగ్ అన్నాడు. దీంతో నబిల్‌కి హగ్ అని చెబుతూ.. నబిల్ గెలిస్తే నేను గెలిచినట్టే అని అన్నాడు.. పృథ్వీకి కూడా హగ్ అని.. అతను నిజంగా వారియర్.. ఆట బాగా ఆడుతున్నాడు.. అన్నీ మంచి క్వాలిటీస్ ఉన్నాయ్.. ఇంప్రూవ్ మెంట్ బాగుంది.. జెన్యూన్ పర్సన్.. అని అన్నాడు. విష్ణుకి కూడా హగ్. ఆమె చాలా మంచి వ్యక్తి. ప్యూర్ హార్ట్ అని అన్నాడు. ప్రేరణకి కూడా హగ్ అని అన్నాడు. ఆమె చాలా కష్టపడుతుంది.. ఆమెలో గెలవాలన్న కసి ఉంటుంది అని చెప్పాడు. నిఖిల్‌కి హగ్ అని.. ఓ 20 ఏళ్ల క్రితం ఆదిత్య ఎలా ఉండేవాడో నిఖిల్ అలా ఉన్నాడని అన్నాడు.

యష్మీకి పంచ్.. పక్షపాతం చూపిస్తుంది.. నామినేషన్స్‌లో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంది. సీతకి కూడా పంచ్.. రియల్ సీతను మళ్లీ పైకి తీసుకురా అని సలహా ఇచ్చాడు. నైనికకి ఎనర్జీ ఫోకస్ ఉంది.. సొంతంగా ఆలోచించు.. బాగా ఆడు అని సలహా ఇచ్చాడు. మణికి లాస్ట్ పంచ్.. ఆడియెన్స్‌కి నువ్వంటే ఇష్టం.. నాకు కూడా ఇష్టం.. ఇంట్లో గొడవలు లేకుండా.. ఆటలు ఆడు.. ఇంట్లో ఉన్న వాళ్లు కూడా సపోర్ట్ చేస్తుంటారు. అందరితో కలిసి బాగా ఆడు.. అని మంచి సలహా ఇచ్చాడు.

Also Readబిగ్ బాస్ 32 రివ్యూ... మెగా చీఫ్ గా నబిల్ అఫ్రిది, మిడ్ నైట్ ఎలిమినేషన్ లో ఆదిత్య అవుట్ - ప్రేరణపై యష్మి గౌడ ఏడుపు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget