Bigg Boss 8 Telugu Day 32 : మెగా చీఫ్ గా నబిల్ అఫ్రిది - మిడ్ నైట్ ఎలిమినేషన్ లో ఆదిత్య అవుట్ - ప్రేరణపై యష్మి గౌడ ఏడుపు
బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మిడ్ వీక్ ఎలిమినేషన్ తాజాగా జరిగింది. మరి ఈ తాజా ఎపిసోడ్ లో జరిగిన విశేషాలు ఏంటో తెలుసుకుందాం పదండి.
బిగ్ బాస్ సీజన్ 8 డే 32కు సంబంధించిన ఎపిసోడ్ తాజాగా స్ట్రీమింగ్ అయింది. ఈ ఎపిసోడ్లో మెగా చీఫ్ గా నబిల్ సెలెక్ట్ కావడంతో పాటు బిగ్ బాస్ సడన్ ట్విస్ట్ ఇచ్చి, మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా ఆదిత్య ఓంను బయటకు పంపారు.
కంటతడి పెట్టుకున్న ప్రేరణ
హౌస్ లో కొత్త చీఫ్ కంటెండర్ కోసం బిగ్ బాస్ పెట్టిన పప్పీ టాస్క్ ని ఈరోజు కూడా కంటిన్యూ చేశారు.. అబ్బాయిలతో సమానంగా చివరి వరకూ పోరాడిన ప్రేరణ చీఫ్ కంటెండర్ కావాలని గట్టిగానే ఆశపడింది. కానీ హౌస్ మేట్స్ అందరూ కలిసి ఆమె ఆశలపై నీళ్లు చల్లారు. ఈ టాస్క్ లో చివరకు నబిల్, ప్రేరణ మిగలగా హౌస్ మేట్స్ అందరూ ఇద్దరినీ కంపేర్ చేసి, నబిల్ చీఫ్ కంటెండర్ అయితే బాగుంటుంది అని ఫిక్స్ చేశారు. ఆరోగ్యం బాగాలేకపోయినా ఆడి, చివరి వరకు వచ్చిన ప్రేరణ ఈ విషయంలో కంటతడి పెట్టుకోగా, ఆ తర్వాత హౌస్ మేట్స్ అందరూ కలిసి ఆమెను క్వీన్ అంటూ బుజ్జగించారు.
మెగా చీఫ్ గా నబిల్.. చిన్న పొరపాటుతో తప్పుకున్న పృథ్వీ
ఈ వారం ఎక్కువ టాస్క్ లలో విన్ అయిన శక్తి టీం నుంచి చీఫ్ కంటెండర్ గా పృథ్వి సెలెక్ట్ అయిన విషయం తెలిసిందే. ఇక తాజాగా పప్పీ టాస్క్ లో నబిల్ ను హౌస్ మేట్స్ చీఫ్ కంటెండర్ గా మరో పోటీదారుని సెలెక్ట్ చేశారు. ఇద్దరి మధ్య 'రాజయ్యేది ఎవరు?' అనే టాస్క్ ను పెట్టారు. ఈ టాస్క్ ను గెలిచినవారు మెగా చీఫ్ అవుతారని ప్రకటించిన బిగ్ బాస్.. 'దాన్ని గెలవాలంటే బ్లాక్స్ ని సరైన సెంటెన్స్ లో ఫామ్ అయ్యేలా అరెంజ్ చేయాలని చెప్పారు. ఆ బ్లాక్స్ సంపాదించడానికి ముందుగా పాకుతూ వెళ్లి, శాండ్ బాక్స్ లో కొన్ని బ్లాక్స్, స్క్రూని తిప్పి దాని కింద ఉన్న మరికొన్ని బ్లాక్స్, చివరగా న్యారో జిగ్జాగ్ దగ్గరికి వెళ్లి, దానిపై నడుచుకుంటూ బ్లాక్స్ ని సంపాదించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాటిని సరైన క్రమంలో అమర్చిన వారే విజేత' అని బిగ్ బాస్ ప్రకటించారు. ఈ టాస్క్ లో పృథ్వీ చాలా వేగంగా ఆడాడు. నబిల్ కాస్త తడబడినప్పటికీ స్లోగా ఆడి విన్ అయ్యాడు.
ప్రేరణ నిర్ణయంపై యష్మి గౌడ ఏడుపు
అయితే ఈ టాస్క్ కు సంచాలక్ గా ప్రేరణ ఉండగా, ఒక చిన్న మిస్టేక్ వల్ల పృథ్వీని కాకుండా నబిల్ ను మెగా చీఫ్ గా సెలెక్ట్ చేసింది ప్రేరణ. ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ పదేపదే 'ఆ చిన్న మిస్టేక్ ను చెప్పొచ్చు కదా, వాడు ఆడిన స్పీడ్ కైనా ఇచ్చి ఉండొచ్చు కదా' అంటూ తెగ ఏడ్చేసింది యష్మి. ప్రేరణ ఎంత వివరించినా కూడా ఆమె ఒప్పుకోలేదు. మొత్తానికి బిగ్ బాస్ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ మధ్య ఈ టాస్క్ తో గొడవపెట్టారు.
మిడ్ నైట్ ట్విస్ట్ లో ఆదిత్య అవుట్
హౌస్ మేట్స్ అందరూ ఇప్పుడు ఓకే టీం అనుకుంటూ ఉంటే మరోవైపు పృథ్వీతో పాటు అతను ఓడిపోయినందుకు కొందరు హౌస్ మేట్స్ బాధపడ్డారు. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ అందరిని గార్డెన్ ఏరియాలో నిలబెట్టి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని ప్రకటించారు. అందులో భాగంగా ఆదిత్య ఓం, నైనిక, విష్ణు ప్రియ ఓటింగ్ పరంగా డేంజర్ జోన్ లో ఉన్నారని ప్రకటించారు. ఈ ముగ్గురిలో ఎవరు హౌస్ లో ఉండడానికి అనర్హులో రీజన్స్ తో సహా చెప్పి, వారిని డేంజర్ లైన్ పై ఒక అడుగు ముందుకు వేయించాలని బిగ్ బాస్ సూచించారు. అలా ఎక్కువ మంది హౌస్ మేట్స్ ఆదిత్య ఓంనే బయటకు పంపాలని నిర్ణయించారు. ఇక చివరకు బిగ్ బాస్ 'వీళ్ళు తమ అభిప్రాయాన్ని మాత్రమే చెప్పారు. ఓటింగ్ పరంగా చూసుకుంటే ప్రస్తుతానికి ఆదిత్య ఓం లీస్ట్ లో ఉన్నారు' అని చెప్పడంతో ఆయన సైలెంట్ గా 'ఓకే బిగ్ బాస్' అంటూ వెళ్లిపోయాడు. కానీ ఇదంతా చూస్తుంటే హౌస్ లో ఫేవరెటిజం ఎక్కువగా వాడుతున్నారు అనిపించకమానదు. ఒక్కరు కూడా ఆదిత్య వెళ్లిపోయినందుకు బాధ పడినట్టు కన్పించలేదు. ఇక ఇప్పుడు హౌస్ లో ఉన్న వారంతా ఒకే టీం కాబట్టి కొత్తగా వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్నది ఎవరో చూడాలి.