Poonam Kaur: అప్పుడు పోసానిపై ఎందుకు స్టాండ్ తీసుకోలేదు... టాలీవుడ్‌ను నిలదీసిన పూనమ్ కౌర్
Konda Surekha Comments Row: మంత్రి కొండా సురేఖ సమంతపై చేసిన కామెంట్స్ ను ఇండస్ట్రీ అంతా కలిసి ఖండిస్తున్న సమయంలో పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
అక్కినేని ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ తో టాలీవుడ్ రగిలిపోతుంది. అక్కినేని ఫ్యామిలీ పరువు ప్రతిష్టలను దిగజార్చేలా, సమంతను కించపరిచేలా కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై అగ్గిమీద గుగ్గిలం అవుతుంది ఇండస్ట్రీ. సీనియర్ హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ తో సహా యంగ్ స్టార్స్ మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇలా ప్రతి ఒక్కరూ సురేఖ వ్యాఖ్యల్ని ఖండిస్తూ సోషల్ మీడియా వేదికగా తమ గళాన్ని వినిపిస్తున్నారు. సామ్ కు ఖుష్బూ, రోజా, అమల లాంటి హీరోయిన్లు అండగా నిలిచారు. మంత్రి పదవిలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడతారా? అంటూ మంత్రి కొండా సురేఖను తీవ్రంగా మందలించారు. దీంతో కొండా సురేఖ తను చేసిన కామెంట్స్ ని వెనక్కి తీసుకుంటూ క్షమాపణలు చెప్పింది. పైగా తనకు ఎలాంటి దుర్దేశం లేదని, మహిళల పట్ల సదరు నాయకుడు వ్యవహరిస్తున్న తీరును బయట పెట్టడమే తన ఉద్దేశం అంటూ సమర్ధించుకుంది. ఏదేమైనా ఆమె చేసిన కామెంట్స్ కరెక్ట్ కాదంటూ ఓవైపు నెటిజన్లు, మరోవైపు సినీ ప్రముఖులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ ఒకటి వైరల్ అవుతుంది. అందులో ఏముందో చూసేద్దాం పదండి.
టాలీవుడ్ ను నిలదీసిన పూనమ్ కౌర్
కొండా సురేఖ వ్యాఖ్యల మీద టాలీవుడ్ అంతా ఏకమై ఏకతాటిపై నిలవడం అన్నది నిజంగా హర్షించదగ్గ విషయం. అయితే గతంలో జరిగిన పలు విషయాలను గుర్తు చేస్తూ తాజాగా పూనమ్ కౌర్ సోషల్ మీడియా వేదికగా నిలదీసింది. అప్పట్లో నందమూరి, మెగా ఫ్యామిలీ ఆడపడుచుల మీద ఇలాంటి కామెంట్లు వచ్చినప్పుడు టాలీవుడ్ ఎందుకు నోరు విప్పలేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తుండగా, తాజాగా పూనం కౌర్ గతంలో పోసాని మురళీకృష్ణ చేసిన కామెంట్స్ పై ఎందుకు ఇండస్ట్రీ నోరు మెదపలేదు అంటూ డైరెక్ట్ గా ప్రశ్నించింది.
Why the industry did not stand up against #posanimuralikrishna comments ?
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) October 3, 2024
పూనమ్ కౌర్ దేని గురించి మాట్లాడుతుంది అంటే...
పవన్ కళ్యాణ్, పూనమ్ కౌర్ గురించిన కాంట్రవర్సీ గురించి అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో పవన్ కళ్యాణ్ మీద పోసాని ఇష్టం వచ్చినట్టుగా కామెంట్స్ చేస్తూ వాళ్ళ ఇంట్లోని ఆడవాళ్ళ గురించి కూడా మాట్లాడాడు. అంతే కాకుండా పరోక్షంగా పూనమ్ పేరును తీస్తూ త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ లను పేర్లు పెట్టి మరీ ఇష్టం వచ్చినట్టుగా కామెంట్స్ చేశారు. అయితే అప్పుడు ఇండస్ట్రీ ఎందుకు స్టాండ్ తీసుకోలేదు అంటూ ఇప్పుడు పూనమ్ కౌర్ ఇప్పుడు ప్రశ్నిస్తోంది.
Also Read: అటెన్షన్ కోసం ఇండస్ట్రీని టార్గెట్ చేయడం సిగ్గుచేటు - కొండా సురేఖ వ్యాఖ్యలపై చిరంజీవి ట్వీట్!
పూనమ్ కౌర్ పై ట్రోలింగ్...
పూనమ్ ఎప్పుడు ఎలా వ్యవహరిస్తుంది అనేది ఎవ్వరికీ అర్థం కాదు. అందరూ పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా మాట్లాడితే, ఆమె ఆపోజిట్ గా మాట్లాడుతుంది. ఆపోజిట్ గా మాట్లాడితే సపోర్ట్ చేస్తుంది. ఇక గురూజీ అంటూ ఏకంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ పై పోస్టుల మీద పోస్టులు పెట్టి టార్గెట్ చేస్తుంది. తాజాగా పవన్ కళ్యాణ్ తన ఇద్దరు కూతుర్లతో కలిసి తిరుమల విజిట్ చేయగా, అందరు తండ్రులకి కూతుర్లు ముఖ్యమే అంటూ ఇండైరెక్టుగా పవన్ పై పంచ్ వేసింది. కానీ ఇప్పుడేమో సమంతకు సపోర్ట్ గా నిలవకుండా అప్పుడు ఎందుకు ఇండస్ట్రీ స్టాండ్ తీసుకోలేదు అంటూ రివర్స్ గేర్ వేసింది. దీంతో పోసాని మాట్లాడేవన్నీ నిజాలే కాబట్టి ఎవ్వరూ నోరు విప్పలేదు, అసలు మీ విషయంలో ఏం జరిగిందో కరెక్ట్ గా బయట పెట్టండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.