అన్వేషించండి

Vanitha Vijaykumar : 43 ఏళ్ల వయసులో నాలుగో పెళ్ళికి రెడీ అయిన ఫైర్ బ్రాండ్.. ముగ్గురు పిల్లలకు తల్లి - మూడు పెళ్ళిళ్ళు పెటాకులు

ఇప్పటికే మూడు పెళ్ళిళ్ళతో వార్తల్లో నిలిచిన ఫైర్ బ్రాండ్ వనిత విజయ్ కుమార్ తాజాగా 4 వ పెళ్ళికి రెడీ అయ్యింది. ఈసారి ఆమె ఎవరిని, ఎప్పుడు పెళ్లాడబోతోందో చూసేద్దాం పదండి.

ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న ప్రముఖ నటి వనిత విజయ్ కుమార్ నాలుగో పెళ్లికి రెడీ కావడం సంచలనంగా మారింది. సోషల్ మీడియా వేదికగా ప్రముఖ కొరియోగ్రాఫర్ తో తాను నాలుగవసారి ఏడడుగులు వేయబోతున్నానంటూ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది వనిత. మరి ఈ బ్యూటీ పెళ్లాడబోయేది ఎవరిని? గతంలో జరిగిన మూడు పెళ్లిళ్ల సంగతేంటి? ఈ నాలుగో పెళ్లి ఎప్పుడు జరగబోతోంది? అనే విషయాలను తెలుసుకుందాం పదండి. 

వనిత విజయ్ కుమార్ సినిమా ఎంట్రీ
తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడైన ప్రముఖ సీనియర్ నటుడు విజయ్ కుమార్ పెద్ద కుమార్తె వనిత. 'చంద్రలేఖ' అనే సినిమాతో 1995లోనే ఈ బ్యూటీ హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించిన ఈ బ్యూటీ తమిళ్ సినిమాలపై ఎక్కువగా ఫోకస్ చేసింది. 'చంద్రలేఖ' సినిమా ప్లాప్ కావడంతో ఆ తర్వాత 'మాణిక్యం' అనే సినిమాలో నటించిన వనిత విజయ్ కుమార్ తెలుగులో 'దేవి'' అనే సినిమాలో మాత్రమే కనిపించింది. ఆ తర్వాత మరో మలయాళ సినిమాలో మెరిసింది. కానీ చేసిన సినిమాలు కంటే ఎక్కువగా ఈ అమ్మడు వ్యక్తిగత అంశాల వల్లనే వార్తల్లో నిలుస్తుంది. 

పెటాకులైన మూడు పెళ్ళిళ్ళు 
2000 సంవత్సరంలో నటుడు ఆకాష్ ను పెళ్లి చేసుకున్న వనిత విజయ్ కుమార్ ఒక కొడుకు, కూతురుకి తల్లి అయింది. ఆ తర్వాత మనస్పర్ధల కారణంగా 2005లో ఆకాష్ తో విడాకులు తీసుకుంది. 2007లో ఆనంద్ జయదర్శన్ అనే వ్యాపారవేత్తని రెండో పెళ్లి చేసుకుంది. మొదటి భర్తతో పుట్టిన ఇద్దరు పిల్లలే కాకుండా రెండో భర్తతో వనితకు మరో కూతురు పుట్టింది. ఆయనతో కూడా ఐదేళ్ల కాపురం చేశాక 2012లో డివోర్స్ తీసుకుంది. అనంతరం కొరియోగ్రాఫర్ రాబర్ట్ తో కొన్నాళ్ళ పాటు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉందని రూమర్లు చక్కర్లు కొట్టాయి. అలాంటి టైంలో ఫోటోగ్రాఫర్ పీటర్ పాల్ ని 2020లో పెళ్ళాడి షాక్ ఇచ్చింది. ఆమె మూడో పెళ్లి చేసుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. 'అవసరమైతే నాలుగో పెళ్లి కూడా చేసుకుంటాను' అంటూ అందరి నోళ్ళు మూయించింది వనిత. కానీ ఈ మూడో పెళ్లి కూడా ఎక్కువ కాలం నిలవలేదు. పెళ్లి చేసుకుని కేవలం నాలుగు నెలల్లోనే మళ్లీ విడాకులు ఇవ్వడంతో మూడో పెళ్లి కూడా పెటాకులైంది. ఆ తర్వాత వనిత ఆయనతో తనకు అసలు పెళ్ళే జరగలేదని, ఎంగేజ్మెంట్ మాత్రమే జరిగిందని వివరణ ఇచ్చి సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. 

Read Also : Poonam Kaur: అప్పుడు పోసానిపై ఎందుకు స్టాండ్ తీసుకోలేదు... టాలీవుడ్‌ను నిలదీసిన పూనమ్ కౌర్

ముచ్చటగా నాలుగో పెళ్లి...
సినిమా ఇండస్ట్రీలో వరుసగా ఇలా నాలుగు పెళ్లిలతో వార్తల్లో నిలిచిన హీరోయిన్ వనిత విజయ్ కుమార్ అనే చెప్పుకోవాలి. గతంలో ఆమె సహజీవనం సాగించింది అంటూ రూమర్లు వచ్చిన కొరియోగ్రాఫర్ రాబర్ట్ నే ఇప్పుడు నాలుగో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యింది వనిత. కానీ ఇప్పుడు ఆమె వయసు 43 ఏళ్లు, ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఆమె పెద్ద కూతురు జోవిక అయితే బిగ్ బాస్ తమిళ్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు హీరోయిన్ గా అడుగు పెట్టడానికి ట్రై చేస్తోంది. ఈ నేపథ్యంలోనే వనిత విజయ్ కుమార్ బిగ్ బాస్ సెలబ్రిటీ రాబర్ట్ మాస్టర్ కి బీచ్ లో బికినీలో మోకరిల్లి మరీ ప్రపోజ్ చేసిన ఫోటోను షేర్ చేస్తూ, అక్టోబర్ 5న తామిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టు వెల్లడించింది. మరి ఈ పెళ్ళినయినా ఆమె నిలబెట్టుకుంటుందా? అనేది చూడాలి.

టాప్ హెడ్ లైన్స్

Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Mahesh Babu : వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
Toxic Trailer : టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్
టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget