Annadata sukhibhava: బుధవారమే రైతుల ఖాతాల్లోకి ఏడు వేలు - కమలాపురంలో విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు
Andhra Pradesh: అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాల్లో మరో ఏడువేలను బుధవారం జమ చేయనున్నారు.మొత్తం మూడు వేల కోట్లకుపైగా జమ చేస్తారు.

Annadata Sukhibhava PM Kisan: ఆంధ్రప్రదేశ్‌లోని 46.62 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ పథకం రెండో విడత నిధులు ఈ నెల 19న ఖాతాల్లోకి జమ కానున్నాయి. మొత్తం రూ.7,000 ప్రతి రైతుకు (రాష్ట్ర వాటా రూ.5,000, కేంద్ర వాటా రూ.2,000 మొత్తం రూ.3,077.77 కోట్లు విడుదల చేయనున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించి, అమలు మార్గదర్శకాలు జారీ చేశారు. "రైతులకు ప్రయోజనం చేకూరాలంటే అర్హతలు, నమోదు విధానాలు సులభతరం చేయాలి. చనిపోయిన రైతుల వారసులకు మ్యూటేషన్ చేసి, ఇన్‌యాక్టివ్ ఖాతాలను యాక్టివేట్ చేయాలి" అని మంత్రి స్పష్టం చేశారు. వైయస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి 19న నిధులు జమ చేస్తారు.
అన్నదాత సుఖీభవ పథకం, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రధాన ఫథకాల్లో ఒకటి. ఈ పథకం పీఎం కిసాన్ పథకంతో ముడిపడి ఉంది, ఇది రైతులకు సంవత్సరానికి రూ.6,000 రూ.2,000 x 3 విడతలు) కేంద్ర సహాయంతో ప్రారంభమైంది. రాష్ట్రం దీన్ని పెంచి, ప్రతి విడతకు రూ.5,000 అదనంగా ఇస్తోంది ఈ కార్యక్రమం రైతులు పంటలు పండించేలా ప్రోత్సహిస్తూ, వారి ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది.
వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్, అన్ని జిల్లా జoint డైరెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడు కీలక దిశానిర్దేశాలు జారీ చేశారు. ప్రధాన మార్గదర్శకాలు: అర్హులైన రైతులు చనిపోయినప్పుడు వారి వారసులకు 'డెత్ మ్యూటేషన్' చేసి, పథకం ప్రయోజనాలు అందించాలి. ఇందుకోసం వెంటనే చర్యలు తీసుకోవాలి. NPCI (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)లో ఇన్‌యాక్టివ్‌గా ఉన్న ఖాతాలను యాక్టివేట్ చేయాలి. ఇది డబ్బు జమ కాకుండా చూడకుండా ఉండకూడదు. రైతులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే విధానాన్ని మరింత సరళీకరించాలి. మొబైల్ యాప్, వెబ్ పోర్టల్‌ల ద్వారా సులభంగా అప్లై చేసేలా చేయాలి. 19న కమలాపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటూ, రాష్ట్రవ్యాప్తంగా నిధులు జమ చేయాలి. జిల్లా స్థాయిలో అధికారులు రైతులతో సమావేశాలు నిర్వహించి, ప్రయోజనాలు చేరేలా చూడాలని ఆదేశించారు.
ఈ మార్గదర్శకాలు అమలు చేయకపోతే జిల్లా అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. రెండో విడతలో 46,62,904 మంది రైతులకు మొత్తం రూ.3,077.77 కోట్లు జమ చేయనున్నారు. అధికారిక వెబ్‌సైట్ (meebhoomi.ap.gov.in) లేదా పీఎం కిసాన్ పోర్టల్ (pmkisan.gov.in)లో ఆన్‌లైన్ నమోదు చేసుకోవాలి. గ్రామ/వార్డు సచివాలయాల్లో హెల్ప్ డెస్క్‌ల ద్వారా సహాయం తీసుకోవచ్చు. వెరిఫికేషన్ తర్వాత 6-7 రోజుల్లోగా డబ్బు జమ అవుతుంది. ఇప్పటికే నమోదు చేసుకున్న వారికి బుధవారం జమ అవుతుంది.




















