అన్వేషించండి

Andhra Pradesh people Grievances: సమస్య పార్టీ ఆఫీసుకొచ్చి చెప్పుకోవాలా? - కింది స్థాయిలో గ్రీవెన్స్ విఫలం - ఏపీలో సామాన్యులకు భరోసా ఏది?

People Grievances: ప్రజలు అన్నాక ఎన్నో సమస్యలు వస్తాయి. సమస్య స్థాయిని బట్టి పరిష్కారం లభించాలి. ప్రతీ దానికి పైస్థాయి వరకూ వెళ్లాలంటే వ్యవస్థ విఫలమైనట్లే.ఏపీలో అదే జరుగుతోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

Andhra Common people problems not being solved: ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం పెరిగేది..తమకు చిన్న సమస్య వచ్చినా సరే స్పందించే యంత్రాంగం ఉన్నప్పుడే. ప్రతిదానికి అర్జీ పట్టుకుని ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ.. పార్టీ కార్యాలయాలు చుట్టూ తిరిగితే వ్యవస్థ విఫలమైనట్లే అవుతుంది. ఇటీవల పార్టీ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ గ్రీవెన్స్ నిర్వహించారు. నాలుగైదు వేల మంది తరలి వచ్చారు. ఇది పాజిటివ్ కాదు.. నెగెటివ్. ఎందుకంటే ఆయనను కలిసి సమస్యలను చెప్పుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చారు. అన్ని సమస్యలూ అంత స్థాయిలో పరిష్కరించాల్సినవి కాదు. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు పరిష్కరించాల్సినవే. అయినా వారు పట్టించుకోకపోవడంతోనే లోకేష్ వరకూ వచ్చారు. 

గ్రీవెన్స్ పరిష్కారం అత్యంత ముఖ్యం

నారా లోకేష్ ఎమ్మెల్యేగా గెలిచిన తరవాత మంగళగిరి ప్రజల కోసం ప్రత్యేకంగా ప్రజాదర్భార్ నిర్వహిస్తున్నారు.అక్కడికి ఇతర ప్రాంతాల వారు కూడా వచ్చి సమస్యలు చెప్పుకునేవారు. వాటి పరిష్కారానికి ఎప్పటికప్పుడు లోకేష్ ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేగా తన నియోజకవర్గ బాధ్యతను ఆయన నిర్వహిస్తున్నారు. కానీ ఇతర నియోజకవర్గాల పరిస్థితి ఏమిటి? ప్రజలు లేదా కార్యకర్తలు ప్రతి సమస్యకు పై స్థాయి వరకూ రావాల్సిన అవసరం లేదు. అలా వచ్చారంటే  సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు కావాల్సిన ఓ ఎకోసిస్టమ్  ఏర్పాటు  కాకపోవడమో..  సరిగ్గా పని చేయడమో జరుగుతోందని అర్థం. ఎందుకంటే పై స్థాయిలో ఉన్నవారు అన్ని సమస్యల్నీ పట్టించుకోలేరు. ఆ స్థాయి దాకా రావాలంటే ఆ సమస్య అంత పెద్దది అయి ఉండాలి. కానీ లోకేష్ కు చెప్పుకునేందుకు వచ్చిన వారి సమస్యలు నియోజకవర్గ స్థాయిలో పరిష్కారం అయ్యేవే.  పోలీసులు, అధికారులతో సమన్వయం చేస్తే అయిపోతాయి.  

నియోజకవర్గ స్థాయిలో పరిష్కారం అయ్యేలా చూడటం ముఖ్యం

సమస్యలు చెప్పుకునేందుకు  సాయం కోసం.. కోసం వచ్చే వారికి ఎక్కువ శ్రమ లేకుండా మొదటి అంచెలోనే పరిష్కారం దొరకడం చాలా ముఖ్యం. పార్టీ కార్యాలయంలో గ్రీవెన్స్ కోసం వచ్చిన వారిని చూసి నారా లోకేష్ కూడా ఆశ్చర్యపోయారు.  సమస్య తీవ్రతను బట్టి ఎస్కలేట్ చేయవచ్చు కానీ.. చిన్న చిన్న సమస్యలకూ పై స్థాయి వరకూ వస్తున్నారంటే.. కింది స్థాయిలో ఎవరూ సరిగ్గా పట్టించుకోవడంలేదని నారాలోకేష్‌ కు అర్థమైపోయింది. అందుకే ఎమ్మెల్యేలపై ఆయన సీరియస్ అయ్యారు.  చాలా నియోజకవర్గాల్లో నేతలు పెడసరంగా ఉంటున్నారని ఫిర్యాదులు ఉన్నాయి. చివరికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా పంపిణీ చేయడం లేదు. ఎంతో కష్టంలో ఉన్న వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు వస్తే ఇవ్వడానికి కూడా తీరిక లేనతంగా ఎమ్మెల్యేలు ఉంటున్నారంటే చిన్న విషయం కాదని భావిస్తున్నారు. అందుకే లోకేష్, చంద్రబాబు ఎమ్మెల్యేలకు టైం టేబుల్ ఇచ్చారు. 

చెబుతున్న మాటలకు .. చేతలకు పొంతన లేదు! 
  
TDP ప్రభుత్వం గ్రీవెన్స్ పరిష్కారానికి మల్టీ-లెవల్ సిస్టమ్ అమలు చేస్తున్నట్లుగా చెబుతోంది.   "ప్రజా వేదిక" ప్రతి వారం జరగాలని చంద్రబాబు చెబుతున్నారు.    మంత్రులు, MLAs, జిల్లా కలెక్టర్లు ప్రజావేదిక నిర్వహిస్తున్నారు.  PGRS పోర్టల్‌లో రోజువారీ 1,000+ ఫిర్యాదులు రిజిస్టర్ అవుతున్నాయని  అధికారవర్గాలుచెబుతున్నాయి.కానీ వాటి పరిష్కారం గురించేస్పష్టత లేదు. అందుకే టీడీపీ నాయకత్వం కొత్త చర్యలు తీసుకుంటోంది.  ప్రతి శుక్రవారం  నియోజకవర్గ స్థాయిలో   గ్రీవెన్స్ మీటింగ్‌లు తప్పనిసరి అని ఆదేశాలుజారీ చేశారు.  PGRS పోర్టల్ ో ఆన్‌లైన్ ఫిర్యాదులు రిజిస్టర్, ట్రాకింగ్. భూమి, విద్యుత్, పెన్షన్ సమస్యలు ప్రధానంగా వస్తున్నాయి.  యాప్ ద్వారా కంప్లైంట్లు. మంత్రులు, కలెక్టర్లు  స్పందించాలని చెబుతున్నారు.  ముఖ్యమంత్రి వీక్లీ పబ్లిక్ ఇంటరాక్షన్. మంత్రులు, MLAsకు మూడు-లెవల్ గ్రీవెన్స్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఇవన్నీ  సమర్థంగా పనిచేస్తే సమస్య ఉండదు. కానీ అలాంటి పరిస్థితి ఉండకపోవడమే సమస్య.

ఎన్ని గొప్ప పనులు అయినా చేయవచ్చు కానీ.. ప్రభుత్వం తరపున పరిష్కరించగలిగే చిన్న సమస్యలను సామాన్యుడికి పరిష్కరించకపోతే వ్యతిరేకత పెరుగుతుంది. ప్రభుత్వాలు ఇలాంటి చిన్న సమస్యలనే సీరియస్ గా తీసుకుని స్పందించాలి. అప్పుడే ప్రభుత్వం మన కోసం ఉందన్నభావనకు సామాన్యుడు వస్తాడు. ఈ విషయం రాజకీయ నేతలు మర్చిపోవడం వల్లనే వ్యతిరేకత పెరుగుతూ వస్తుంది .

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
AP Crime News: పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిని కొడవళ్లతో నరికి దారుణహత్య.. వివాహేతర సంబంధమే కారణమా?
పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిని కొడవళ్లతో నరికి దారుణహత్య.. వివాహేతర సంబంధమే కారణమా?
Donald Trump: 120 దేశాల వలసదారులకు అమెరికా సాయం.. జాబితాలో కనిపించని భారత్, పలు దేశాల్లో గందరగోళం
120 దేశాల వలసదారులకు అమెరికా సాయం.. జాబితాలో కనిపించని భారత్, పలు దేశాల్లో గందరగోళం
Nimmala Rama Naidu: కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు
కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు
Advertisement

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
AP Crime News: పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిని కొడవళ్లతో నరికి దారుణహత్య.. వివాహేతర సంబంధమే కారణమా?
పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిని కొడవళ్లతో నరికి దారుణహత్య.. వివాహేతర సంబంధమే కారణమా?
Donald Trump: 120 దేశాల వలసదారులకు అమెరికా సాయం.. జాబితాలో కనిపించని భారత్, పలు దేశాల్లో గందరగోళం
120 దేశాల వలసదారులకు అమెరికా సాయం.. జాబితాలో కనిపించని భారత్, పలు దేశాల్లో గందరగోళం
Nimmala Rama Naidu: కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు
కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు
Jana Nayagan OTT : 'జన నాయగన్' రిలీజ్‌కు ముందే ట్విస్ట్? - ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా!
'జన నాయగన్' రిలీజ్‌కు ముందే ట్విస్ట్? - ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా!
Ravindra Jadeja: రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజా! వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్ట్
రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజా! వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్ట్
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Jana Nayakudu : విజయ్ 'జన నాయకుడు' ఎఫెక్ట్ - రెండేళ్ల తర్వాత టాప్ ట్రెండింగ్‌లో బాలయ్య మూవీ
విజయ్ 'జన నాయకుడు' ఎఫెక్ట్ - రెండేళ్ల తర్వాత టాప్ ట్రెండింగ్‌లో బాలయ్య మూవీ
Embed widget