South Africa Captain Temba Bavuma Record | తెంబా బవుమా సరికొత్త రికార్డ్ !
చాలా కాలం తర్వాత సఫారీలు టీమ్ ఇండియాను సొంత గడ్డపై ఓడించి రికార్డు సృష్టించారు. తెంబా బవుమా నేతృత్వంలో సౌతాఫ్రికా ఘన విజయం సాదించింది. ఈ క్రమంలోనే సౌత్ ఆఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా టెస్ట్ క్రికెట్ హిస్టరీలోనే సరికొత్త రికార్డు సృష్టించాడు. భారత్‌పై భారత్‌లో.. 15 ఏళ్ల తర్వాత సౌతాఫ్రికా టెస్ట్ మ్యాచ్‌లో గెలవడం మాత్రమే కాకుండా మరో రికార్డును కూడా సృష్టించాడు.
టెస్ట్ క్రికెట్ హిస్టరీలోనే 148 ఏళ్లలో ఎవరికీ సాధ్యం కాని రికార్డును కెప్టెన్‌గా బవుమా సాధించాడు. కెప్టెన్‌గా.. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అత్యంత వేగంగా 10 టెస్ట్ విజయాలు సాధించిన తొలి కెప్టెన్‌గా అరుదైన ఘనత సాధించాడు. ఇప్పటివరకు సౌతాఫ్రికా తరఫున 11 టెస్ట్ మ్యాచ్‌ల్లో కెప్టెన్ గా వ్యవహరించి 10 మ్యాచ్‌ల్లో గెలిపించాడు. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. తన టెస్ట్ కెరీర్‌లో కెప్టెన్ గా ఒక్క ఓటమి కూడా లేకపోవడం విశేషం. కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన తర్వాత తెంబా బవుమా సౌత్ ఆఫ్రికా టీమ్ దశనే మార్చేశాడు.





















