Bigg Boss Telugu Day 72 Promo : బిగ్‌బాస్ ఫ్యామిలీ వీక్ మొదలైపోయింది.. తనూజ కూతురు, చెల్లి వచ్చేశారుగా
Bigg Boss Telugu Today Promo : బిగ్‌బాస్ సీజన్ 9 తెలుగు ఫ్యామిలీ వీక్ ప్రారంభమైంది. మరి బిగ్‌బాస్ ఇంట్లోకి ఎవరు వచ్చారు? ప్రోమో హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

Bigg Boss 9 Thanuja Sister Promo : బిగ్‌బాస్ సీజన్ 9 తెలుగు పదకొండవ వారానికి వచ్చేసింది. అందుకే ఈ స్పెషల్ వీక్‌ని ఫ్యామిలీ వీక్‌గా మార్చేశాడు బిగ్‌బాస్. దాని గురించి హింట్స్ ఇస్తూనే ఉన్నాడు. పైగా ఆదివారం రోజూ సంజనకు ఫ్యామిలీ వీక్ లేదని చెప్పి.. మిగిలినవారికి ఉంటుందనే హింట్స్ ఇచ్చేశారు. దానిలో భాగంగానే ముందుగానే బిగ్‌బాస్ నామినేషన్స్ ముగించేశాడు. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్‌ని ఇంట్లోకి పంపిస్తున్నాడు. మరి ఇంట్లోకి ఎవరు వచ్చారు. తాజా ప్రోమో హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
బిగ్‌బాస్ ప్రోమో హైలెట్స్
బిగ్‌బాస్ ఇంట్లో మీ ప్రయాణం చివరి అంకానికి చేరువలో ఉందంటూ బిగ్‌బాస్ వాయిస్‌తో ప్రోమో మొదలైంది. దీంతో కంటెస్టెంట్లు అందరూ ఎమోషనల్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ సాగిన మీ ప్రయాణం.. మిమ్మల్ని ఎన్నో భావోద్వేగాలకు గురి చేసింది. కుటుంబం మన తోడు ఉంటే.. ప్రపంచాన్ని గెలిచే శక్తి వచ్చినట్లే. ఇది ఆ శక్తిని పొందే సమయం అంటూ బిగ్‌బాస్ ఇంటి సభ్యులకు చెప్పాడు. ఇంటి సభ్యులంతా అప్పటికే ఎమోషనల్ అయిపోయారు. మరి ఇంట్లోకి ఎవరు వచ్చారంటే..
తనూజ కూతురు, చెల్లె వచ్చేశారుగా..
బిగ్‌బాస్ కన్ఫెషన్ రూమ్‌కి తనూజను రమ్మన్నాడు. అయితే అక్కడ తనూజ అక్క పూజ కూతురును అక్కడ ఉంచాడు. తనని చూసిన తనూజ ఎమోషనల్ అయిపోయింది. అమ్మ ఎక్కుడుంది అంటూ కన్నడలో అడిగి.. పాపను ఎత్తుకుని బయటకు నవ్వుకుంటూ పరుగెత్తుకుంటూ వెళ్లింది. అందరికీ నా కూతురు వచ్చిందని చెప్పింది తనూజ. అనూజని పిలవడం స్టార్ట్ చేసింది. పాపని అమ్మని పిలువు అంటే క్యూట్‌గా పిలిచింది. అక్కడితో తనూజ వాళ్ల చెల్లి అనూజ లోపలికి వచ్చింది.
చెల్లిని చూసి ఏడ్చేసిన తనూజ..
పాపని చూసి ఎమోషనల్ కంట్రోల్ చేసుకున్న తనూజ.. చెల్లిని చూసి మాత్రం ఏడ్చేసింది. తనే పెళ్లికూతురు అంటూ అందరికీ చెప్పింది. కొన్ని రోజుల్లో నా పెళ్లి ఉంది. ఇక్కడ హ్యాండిల్ చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. అమ్మ, పెళ్లిపనులు చూసుకుంటున్నాము. మేము కోరుకునేది ఒక్కటే. నువ్వు ఏడ్వకుండా ఉంటే చాలు అని చెప్తుంది. తర్వాత తనూజతో అనూజను పెళ్లికూతురును చేయించేందుకు బిగ్‌బాస్ కొన్ని అరేంజ్మెంట్స్ చేశాడు. తనూజ పేరును పెళ్లి పత్రికలో వేయించినట్లు చెప్పింది. తర్వాత ఆమెకు శారీ ఇచ్చి.. అక్షింతలు చల్లి.. బొట్టు పెట్టి తన సంతోషాన్ని తీర్చుకుంది తనూజ. తనూజ కూతురుతో సంజన, రీతూ కూడా బాగా ఎంజాయ్ చేసినట్లు ప్రోమోలో కనిపించింది. మరి ఈరోజు ఎపిసోడ్లో ఎవరెవరు రాబోతున్నారో పూర్తి ఎపిసోడ్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.






















