Encounter In AP: అల్లూరి జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్.. మోస్ట్ వాంటెడ్ హిడ్మా సహా ఆరుగురు మావోయిస్టులు మృతి!
Encounter In Alluri Sitharamaraju district | ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసుల ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు.

Encounter in Alluri District | మారేడుమిల్లి: ఏపీలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై సమాచారంతో పోలీసులు కొన్ని టీంలుగా ఏర్పడి కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో ఓ చోట పోలీసులు ఎదురుపడటంతో మావోయిస్టులు కాల్పులు జరిపారు. వెంటనే అప్రమైత్తమైన పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు అగ్రనేత సహా ఆరుగురు మావోయిస్టులు మృతిచెందినట్లు సమాచారం. టైగర్ జోన్లో ప్రస్తుతం కూంబింగ్ కొనసాగుతోంది. మరికొందరు మావోయిస్టులు అటవీ ప్రాంతంలో ఉన్నారని మారేడుమిల్లి ప్రాంతాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు.
పోలీసుల ఎదురుకాల్పుల్లో మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు, మోస్ట్ వాంటెడ్ హిడ్మా మృతిచెందినట్లు సమాచారం. ఈ ఎన్‌కౌంటర్లో హిడ్మాతో పాటు ఆయన భార్య అనుచరులు కూడా మృతిచెందినట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ఎదురు కాల్పులు జరిగాయని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గడ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోలస్టుల కదిలికపై సమాచారం అందడంతో పోలీసు బృందాలు పలు ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. భారీ దాడుల్లో స్వయంగా పాల్గొంటూ కేంద్ర బలగాలకు మోస్ట్ వాంటెడ్‌గా మారిన హిడ్మాపై ₹ 1 కోటికి పైగా రివార్డ్, హిడ్మా భార్య హేమపై ₹ 50 లక్షల రివార్డ్ ఉంది.
ఎవరీ హడ్మా..
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దక్షిణ సుక్మాలోని పూర్వతి గ్రామంలో హిడ్మా జన్మించాడు. 10వ తరగతి పూర్తి చేసిన తర్వాత, మావోయిస్టు పార్టీలో చేరాడు. సైనిక ఆపరేషన్, గెరిల్లా యుద్ధతంత్రంలో ప్రధాన వ్యూహకర్తగామారాడు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ నంబర్ 1 యొక్క ఏరియా కమాండర్ గా ఎదిగాడు. సుక్మా, దంతేవాడ, బీజాపూర్ ప్రాంతాల్లో పనిచేసే CPI (మావోయిస్ట్) దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో క్రియాశీల సభ్యుడిగా వ్యవహరించాడు. 2017లో సుక్వా దాడితో పాటు 2021లో సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడిలో ప్రధాన నిందితుడు హిడ్మా. దాదాపు ఇరవై ఆరు వేర్వేరు దాడులకు హిడ్మా బాధ్యుడని పోలీసుల సమాచారం. గెరిల్లా దాడుల్లో స్పెషలిస్ట్. 2021 ఏప్రిల్ 3న కమాండో బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్ (CoBRA), సాధారణ బెటాలియన్లతో కలిపి.. ఛత్తీస్‌గఢ్ పోలీసుల డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG) యూనిట్లతో కూడిన సుమారు 2,000 మంది భద్రతా దళాల దాడిలో దాదాపు 400 మంది గెరిల్లా మెరుపుదాడి చేశారు. దాదాపు ఐదారు గంటలపాటు జరిగిన ఈ కాల్పులు, దాడుల్లో 23 మంది పోలీసులు, స్పెషల్ టీం సభ్యులు చనిపోయారు.






















