AP Secretariat employee transfers: ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - అంతర్ జిల్లా బదిలీలకు జీవో రిలీజ్
Employees Transfers: గ్రామ వార్డు సచివాలయ (GSWS) ఉద్యోగుల అంతర్ జిల్లాల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే స్పౌజ్ గ్రౌండ్స్ పైనే బదిలీలుచేస్తారు.

Good news for AP village and ward secretariat employees: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ (GSWS) ఉద్యోగులకు స్పౌస్ గ్రౌండ్స్‌పై అంతర్ జిల్లా ట్రాన్స్‌ఫర్‌లకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి జారీ చేసిన GO Ms. No. 145 ప్రకారం, భర్త/భార్యలు కలిసి పని చేయాలనే రిక్వెస్ట్ బేసిస్‌పై ఆన్‌లైన్ అప్లికేషన్‌ల ద్వారా ట్రాన్స్‌ఫర్‌లు అమలు చేయనున్నారు. పూర్తి ప్రక్రియను 30 నవంబర్ 2025 లోపు పూర్తి చేసుకోవాలని, మెరిట్ ర్యాంక్, సీనియారిటీ ఆధారంగా ట్రాన్స్‌ఫర్‌లు జరుగుతాయని అధికారులు తెలిపారు.
గ్రామ వార్డు సచివాలయాల స్థాపన తర్వాత 2019-2020లో నియమితులైన 1.5 లక్షల మంది ఉద్యోగులు, తమ స్థానిక జిల్లాలకు ట్రాన్స్‌ఫర్‌ల కోసం డిమాండ్ చేస్తున్నారు. వీరిలో 25% మంది తమ స్వస్థలాలకు 200 కి.మీ. దూరంలో పని చేస్తున్నారు. ఇది మానసిక ఒత్తిడి, కుటుంబానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితులకు కారణమవుతోంది. పంచాయతీ రాజ్ శాఖ డైరెక్టర్ GVNVV&VSNVS విజయవాడ, ఉద్యోగుల అభ్యర్థనల ఆధారంగా ప్రభుత్వానికి లేఖ రాశారు. గతంలో 2023లో GO Ms. No. 5 ప్రకారం స్పౌస్, మ్యూచువల్ గ్రౌండ్స్‌పై ట్రాన్స్‌ఫర్‌లు అనుమతించినప్పటికీ, 2024లో రేషనలైజేషన్ GO No.1లో ఇంటర్-డిస్ట్రిక్ట్ స్పౌస్ ట్రాన్స్‌ఫర్‌లు మరింత స్పష్టత కల్పించారు.
కొత్త మార్గదర్శకాల ప్రకారం, ట్రాన్స్‌ఫర్‌లు రిక్వెస్ట్ బేసిస్‌పై మాత్రమే జరుగుతాయి. ఆన్‌లైన్ అప్లికేషన్ ద్వారా మాత్రమే స్వీకరిస్తారు. భర్త/భార్యల్లో ఒకరు ప్రభుత్వ ఉద్యోగి అయితే మాత్రమే అయి ఉండాలి. ప్రైవేట్ ఉద్యోగులకు ఇది వర్తించదు. ట్రాన్స్‌ఫర్ యూనిట్‌గా ఉమ్మడి జిల్లాలను పరిగణిస్తారు. డిసిప్లినరీ/ACB కేసులు ఉన్నవారికి అర్హత లేదు. No Dues Certificate తప్పనిసరి. మెరిట్ ర్యాంక్ ఆధారంగా సీనియారిటీ లిస్టులు తయారు చేస్తారు.
ట్రాన్స్‌ఫర్‌లు క్లియర్ వేకెన్సీ ఉన్నప్పుడు మాత్రమే జరుగుతాయి. కొత్త జిల్లాలో చివరి ర్యాంక్ కేటాయింపు జరుగుతుంది. టై వచ్చినప్పుడు సీనియారిటీ మొదట, తర్వాత DOB (తేదీ ఆధారంగా) ప్రాధాన్యత పొందుతాయి. మెడికల్ గ్రౌండ్స్ (క్యాన్సర్, హార్ట్ డిసీజ్, న్యూరో-సర్జరీ, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్, బోన్ TB) ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు. స్టేట్/డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డ్ సర్టిఫికేట్ తప్పనిసరి.
పూర్తి ప్రక్రియ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా జరుగుతుంది. అప్లై చేసిన తర్వాత ప్రొవిజనల్ సీనియారిటీ లిస్టు విడుదల అవుతుంది, ఆబ్జెక్షన్స్ స్వీకరణ తర్వాత ఫైనల్ లిస్టు తయారవుతుంది. శాఖా సెక్రటరీలు ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్‌ఫర్ ఆర్డర్లు ఇస్తారు. మండల్/ULB అలాట్‌మెంట్ పోర్టల్‌లోనే జరుగుతుంది, తర్వాత కౌన్సిలింగ్‌లో సెక్రటేరియట్ అలాట్ చేస్తారు. ట్రాన్స్‌ఫర్ స్వయంకృత రిక్వెస్ట్ కావడంతో TTA/DA లేదు. పూర్తి ప్రక్రియ 30 నవంబర్ 2025 లోపు పూర్తి చేసుకోవాలి. జిల్లా కలెక్టర్లు, అపాయింటింగ్ అథారిటీలు వెకెన్సీలు ప్రకటించి, కౌన్సిలింగ్ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.





















