అన్వేషించండి

Bigg Boss 8 Telugu Episode 34 Day 33: విసిగిస్తున్న బిగ్ బాస్ టీం... కంటెస్టెంట్ల ఏడ్పులు ఆడియెన్స్ నిట్టూర్పులు

Bigg Boss 8 Telugu Episode 34:బిగ్ బాస్ ఇంట్లో కంటెస్టెంట్లను ఎమోషన్స్‌ను చూస్తే ఆడియెన్స్‌ ఎమోషనల్ అవ్వాలి అంతే కానీ తల పట్టుకునేలా ఉండకూడదు అన్న లాజిక్ ఈసారి మిస్సయినట్టు అనిపిస్తోంది ఈసారి.

Bigg Boss 8 Telugu Contestants Feels Home Food and Family Messages: బిగ్ బాస్ ఇంట్లో కంటెస్టెంట్ల ఎమోషన్స్‌ను చూస్తే ఆడియెన్స్‌కి కూడా ఎమోషనల్ అనిపించాలి. కానీ బిగ్ బాస్ ఇంట్లో ఇప్పుడు కంటెస్టెంట్ల ఏడ్పులు చూస్తుంటే మాత్రం ప్రేక్షకుల తల పట్టుకునేలా ఉంటుంది. శుక్రవారం నాటి ఎపిసోడ్ చూస్తే ఒక్కొక్కరి ఓవర్ యాక్షన్ మామూలుగా లేదనిపిస్తోంది. బిగ్ బాస్ షో ఎండింగ్‌లో పెట్టాల్సిన ఎమోషనల్ టాస్కులన్నీ ఇప్పుడే పెట్టేస్తున్నాడు. దీంతో వారి ఎమోషన్స్ అన్నీ అసహజంగానే అనిపిస్తున్నాయి. ఇంటి నుంచి ఫుడ్, మెసెజ్ వస్తుందని, రావడం లేదని కంటెస్టెంట్ల ఏడ్పులు చూస్తుంటే ఆడియెన్స్‌కి తలనొప్పి వచ్చేస్తుంది.

శుక్రవారం నాటి ఎపిసోడ్ ఎలా సాగిందంటే... మణికంఠకు ఎలా ఓట్లు పడుతన్నాయో అర్థం కావడం లేదని ఇంటి సభ్యులు అనుకున్నారు. 'అటెన్షన్ సీకర్, సింపతీ గేమ్ ఆడుతున్నాడు.. చేసేదంతా చేస్తాడు.. చివరకు మనల్ని విలన్లను చేస్తున్నాడం'టూ మణికంఠ గురించి సీత చెప్పింది. 'నీకు మాత్రమే ఎమోషన్స్ ఉంటాయా? మాకు ఏడ్పు రాదా?' అంటూ మణికంఠతో సీత వాగ్వాదానికి దిగింది. ఇంటి సభ్యులంతా మణికంఠను ఏదో ఒకటి అంటూనే వచ్చారు. చివరకు నబిల్ మాత్రం మణికంఠకు పాజిటివ్‌గా మాట్లాడాడు.

'మణికంఠ నిజంగానే నటిస్తే ఎంత సేపు నటించగలడు' అంటూ సీతతో నబిల్ అన్నాడు. ఇక ఆ తరువాత నిఖిల్, పృథ్వీ, విష్ణు, యష్మీ, నబిల్ ఇలా అందరూ కలిసి ముచ్చట్లు పెట్టుకున్నారు. పాట పాడమని నబిల్‌ను అడిగితే.. బిగ్ బాస్ రూల్స్ బ్రేక్ చేయను అని, లైట్లు బంద్ అయ్యాయ్.. వెళ్లి పడుకుందాం అని నబిల్ అంటాడు. దీంతో 'నువ్వు చేంజ్ అయ్యావ్.. అధికారం, పవర్ వచ్చాక మార్పులు కనిపిస్తున్నాయ్' అని నబిల్‌ను పృథ్వీ ఆటపట్టిస్తాడు.

మార్నింగ్ మస్తీ ఓ క్రింజ్ టాస్క్ పెట్టాడు. మణికంఠ చేత్తో ఇంటి సభ్యులకు జాతకం చెప్పించాడు. కానీ అది అంతగా ఆడియెన్స్‌ను ఆకట్టుకోలేదు. అసలు బిగ్ బాస్ టీంకు ఏ టాస్కులు పెట్టాలి.. ఎలా ఆడించాలి.. ఆడియెన్స్‌ ఎంటర్టైన్ చేయాలనే ఆలోచనే లేనట్టుగా కనిపిస్తోంది. ఇంటి సభ్యుల్ని ఇంట్లో టైం పాస్‌గా అలా వదిలేసినట్టుగా కనిపిస్తోంది. ఈ జాతకం చెప్పే టాస్కులో విష్ణు ప్రియ చేసిన అతి, ఆమె క్రింజ్ చేష్టలు కంపరంగా అనిపిస్తాయి. పృథ్వీ, విష్ణు ప్రియల ఆర్టిఫీషియల్ ట్రాక్‌ను ఆడియెన్స్ ఏ మాత్రం యాక్సెప్ట్ చేయడం లేదనిపిస్తోంది.

ఇక యష్మీని చూస్తుంటే మరో సోనియా అయ్యేలా ఉంది. నిఖిల్, పృథ్వీలతో సోనియా ఎలా ఉండేదో.. యష్మీ కూడా అట్లే ఉంటోందనిపిస్తోంది. సోనియా ఉన్నంత వరకు నిఖిల్, పృథ్వీ వద్దకు లేడీ కంటెస్టెంట్లు ఎక్కువగా వెళ్లలేదు. ఆమె బయటకు వెళ్లాక వారిద్దరి చుట్టూ యష్మీ, విష్ణు ప్రియలు ఎక్కువగానే ఉంటున్నారు. యష్మీని కన్ ఫెషన్ రూంకి పిలిచాడు బిగ్ బాస్. 'నీకు ఈ ఇంట్లో ఎవరంటే ఇష్టమ'ని బిగ్ బాస్ అడిగితే.. నిఖిల్, పృథ్వీల పేర్లను చెప్పింది. మణికంఠకు దూరంగా ఉండాలని అనుకుంటున్నట్టుగా చెప్పింది.

ఇక యష్మీ ముందు.. నిఖిల్ అమ్మ వంటకం, మణికంఠ భార్య ప్రియా వంటకాలను పెట్టాడు. ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో. దాంతో పాటు ఇంటి నుంచి వచ్చిన మెసెజ్ కూడా వస్తుందని అన్నాడు. అయినా సరే యష్మీ మాత్రం నిఖిల్‌కే ఫుడ్‌ను, మెసెజ్‌ను ఇవ్వాలని ఫిక్స్ అయింది. దీంతో బయట ఉన్న మణికంఠ ఫైర్ అయ్యాడు. నాకు ఆ మెసెజ్ చాలా ఇంపార్టెంట్ అంటూ మణికంఠ ఓవర్ ఎమోషనల్ అయ్యాడు. ఇలా ప్రతీ సారి మణికంఠ కంట్రోల్ తప్పుతూ, ఏడుస్తూ ఆడియెన్స్‌కు చిరాకు వచ్చేలా చేస్తున్నాడు.

Also Read: బిగ్ బాస్ 32 రివ్యూ... మెగా చీఫ్ గా నబిల్ అఫ్రిది, మిడ్ నైట్ ఎలిమినేషన్ లో ఆదిత్య అవుట్ - ప్రేరణపై యష్మి గౌడ ఏడుపు

ఆ తరువాత పృథ్వీ కన్‌ఫెషన్ రూంకి వెళ్లి.. నైనికకు అమ్మ చేసిన ఇడ్లీ సాంబార్‌ను పట్టుకొచ్చాడు. విష్ణు ప్రియ కోసం వచ్చిన వంటకాన్ని వదిలేశాడు. పృథ్వీ వెళ్లే ముందు కూడా విష్ణు ప్రియ సలహా ఇచ్చింది. ఒక వేళ ఆప్షన్స్‌లో తన పేరు ఉంటే.. తనను మాత్రం సెలెక్ట్ చేసుకోకు అని త్యాగం చేసింది. దీంతో నైనిక కోసం పృథ్వీ ఫుడ్‌, మెసెజ్‌ను పట్టుకొచ్చాడు. మణికంఠ లోపలకు వెళ్లి యష్మీకి వచ్చిన ఫుడ్ వదిలేసి.. పృథ్వీ కోసం వచ్చిన వంటకాన్ని పట్టుకొచ్చాడు. ఇక యష్మీ తన తండ్రి నుంచి వచ్చిన సందేశాన్ని చూడలేకపోయానని ఏడ్చింది. 

బిగ్ బాస్ టీం మిస్టేక్‌లో యష్మీకి వచ్చిన మెసెజ్‌లా అలా వేసి తప్పించేసింది. దీంతో చదవలేకపోయాను అని యష్మీ తెగ ఏడ్చేసింది. ఇలా ఇంటి సభ్యులంతా కూడా చాలా ఓవర్ ఎమోషనల్ అయ్యారు. కానీ ఆడియెన్స్‌‌కు ఇదెక్కడి సంత రా బాబు అని అనుకునేలా ఉంటుంది. కంటెస్టెంట్ల ఎమోషన‌ను ఆడియెన్స్ మాత్రం ఫీల్ అయ్యేలానే కనిపించడం లేదు. ఒక్కరైనా స్ట్రాంగ్‌గా, ఏడ్పులు పెడబొబ్బులు లేకుండా ఉంటారనుకుంటే ఒక్కరూ అలా కనిపించలేదు. ఇలా ఓవర్ ఎమోషన్స్‌తో ఆడియెన్స్‌కు విరక్తి పుట్టించేలా చేస్తున్నారు. వైల్డ్ కార్డులు వచ్చాక అయినా బిగ్ బాస్ రూట్ మారుస్తాడా? లేదా? అన్నది చూడాలి.

Also Readబిగ్‌ బాస్ ఎపిసోడ్ 30 రివ్యూ... పోయే వరకు నామినేట్ చేస్తా, రివేంజ్ అనుకో - మణికంఠపై యష్మీ మండిపాటు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget