అన్వేషించండి

Bigg Boss 5 Telugu: ఆ ముగ్గురు సేఫ్.. మరి ఎవరు ఎలిమినేట్ అవుతారో.. 

ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ లో నామినేషన్ లో ఉన్న ఎనిమిది మందిలో ముగ్గురికి సేవ్ చేశారు బిగ్ బాస్. 

శుక్రవారం హైలైట్స్.. 

సిరికి సారీ చెప్పి ఆమెని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు షణ్ముఖ్. కానీ ఆమె వినలేదు. ఆ తరువాత ప్రియాంక బెడ్ పై పడుకొని 'దేవుడు నాకు కూడా మంచి లైఫ్ ఇచ్చి ఉంటే బాగుండేది' అంటూ వెక్కి వెక్కి ఏడ్చేసింది. మానస్ ఊరుకోబెట్టడానికి ట్రై చేస్తున్నా.. ఆమె ఏడుస్తూనే ఉంది. 

తెల్లవారుజామునే కాజల్-షణ్ముఖ్ కూర్చొని మాట్లాడుకున్నారు. 'నేను ఆడకపోతే.. వరల్డ్ వార్ జరుగుతున్నా యాపిల్ తింటున్నా అంటారు.. నేను ఆడితే వీళ్లు వరల్డ్ వార్ చేస్తారు' అంటూ సిరి-జెస్సీలను ఉద్దేశించి కామెంట్ చేశాడు. ఆ తరువాత మళ్లీ సిరి దగ్గరకు వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేశాడు షణ్ముఖ్. ఆమెకి ఎన్నిసార్లు సారీ చెప్పినా వినిపించుకోలేదు. 

''నువ్ కావాలని.. నువ్ ఏదో అనుకొని నాతో మాట్లాడుతున్నావ్.. ఇంకొకసారి అలా చేయకు. నేను చిన్నపిల్లోడ్ని కాదు.. నాకు తెలియదు అనుకోకు..'' అంటూ ప్రియాంకతో అన్నాడు మానస్. దానికి ప్రియాంక నాకు అర్ధం కాలేదని చెప్పింది. 'అదే చెప్తున్నా.. నీకు అర్ధంకాకపోతే అర్ధం కానట్లే ఉండు.. అర్ధంకాని విషయాల్లోకి దూరకు.. ఇంకొకసారి నేను రిపీట్ చేయను. నువ్వు కూడా సాగదీయకు' అంటూ చెప్పాడు మానస్. 

షణ్ముఖ్ ని పొగిడిన నాగార్జున.. 

ఆ తరువాత హౌస్ మేట్స్ తో మాట్లాడారు నాగార్జున. ముందుగా.. యానీ మాస్టర్ కి కెప్టెన్ అయినందుకు శుభాకాంక్షలు చెప్పారు. కెప్టెన్ గా షణ్ముఖ్ పెర్ఫార్మన్స్ కి తొమ్మిది మార్కులిచ్చారు నాగార్జున. కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ లో బిగ్ బాస్ కి కూడా ముడులు వేయాలనే ఆలోచన రాలేదని.. షన్ను ఆలోచనలను మెచ్చుకున్నారు నాగ్. ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా.. గేమ్ ఆడినందుకు జెస్సీని అప్రిషియేట్ చేశారు నాగార్జున. 

ఆ తరువాత ధోతీ వేసుకున్న రవిని ధోతీవాలా రవి అని పిలిచారు నాగ్. రవి లేచి నుంచోగానే నాగ్ అలా చూస్తూ ఉన్నారు. దీంతో రవిలో టెన్షన్ మొదలైంది. కానీ హౌస్ మేట్స్ అందరూ నవ్వుతూ కనిపించారు. వెంటనే నాగార్జున చప్పట్లు కొట్టారు. ''నిన్ను నరకం పెట్టారు చూడూ.. అదేం నరకం.. ఇట్ ఈజ్ పేబ్యాక్ టైమ్'' అంటూ రవికి ఓ ఛాన్స్ ఇచ్చారు. కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ లో రవికి చితవిచిత్రమైన డ్రింక్స్ ఇచ్చి తాగమన్నారు. 

ఇప్పుడు రవికి రివెంజ్ తీర్చుకునే ఛాన్స్ రావడంతో.. షణ్ముఖ్ ని పిలిచి తన చేతులతో చేసిన వెరైటీ డ్రింక్ ని ఇచ్చి తాగమన్నారు. షణ్ముఖ్ నానా ఇబ్బందులు పడుతూ డ్రింక్ తాగాడు. ఆ తరువాత యానీ మాస్టర్ కి ఛాన్స్ ఇవ్వగా.. కాజల్ ని పిలిచి సోయాసాస్, ఎగ్ తో కూడిన డ్రింక్ ను తాగించింది. నెక్స్ట్ ప్రియాంకకు ఛాన్స్ రావడంతో.. రవితో ఎగ్ తాగించింది. శ్రీరామచంద్రకి కూడా ఛాన్స్ రావడంతో.. అతడు సన్నీని సెలెక్ట్ చేసుకున్నాడు. ఎగ్, సోయా సాస్ ఇలా రకరకాల ఇంగ్రేడియంట్స్ తో డ్రింక్ తయారు చేసి ఇచ్చాడు. అది సన్నీ తాగలేకపోవడంతో ఉల్లిపాయ చేతిలో పెట్టి ఒక ముక్క తిని తాగేయ్ అని అన్నాడు శ్రీరామ్. దానికి సన్నీ.. 'మగడా.. ఆగరా.. ఏదో జన్మలో నా మొగుడివి నువ్' అంటూ కష్టపడి డ్రింక్ తాగేశాడు.

మానస్ ని పిలిచిన నాగార్జున.. ప్రియాంకతో ఎందుకు గొడవలు జరుగుతున్నాయని ప్రశ్నించాడు. కొన్ని కొన్ని మాటలు విసిరేస్తుందని.. మానస్ చెప్పగా.. నీకు నచ్చని పనులు ఆమె చేయదు కదా అని అన్నారు నాగార్జున. గేమ్ లో జోష్ తగ్గిందని బాగా ఆడాలని చెప్పారు. సన్నీని టెంపర్ బాగా కంట్రోల్ చేసుకుంటున్నావ్ అని నాగార్జున కాంప్లిమెంట్ ఇచ్చారు. 

రవి సేఫ్.. 

నామినేషన్ లో ఉన్న ఎనిమిది మంది చేతుల్లో ఫోమ్ ప్లేట్స్ పెట్టారు. ఆ ప్లేట్ లో సేఫా..? కాదా..? అనేది రాసి ఉంటుంది. ఈ టాస్క్ లో రవికి సేఫ్ అని వచ్చింది. 

హీరో-విలన్ గేమ్..

హౌస్ మేట్స్ ని ఈ హౌస్ లో సూపర్ హీరో, సూపర్ విలన్ ఎవరో చెప్పమని అడిగారు నాగార్జున. హీరోకి స్టార్ ఇవ్వాలని.. విలన్ కి రెడ్ కలర్ స్టాంప్ వేయాలని చెప్పారు.

  • సిరి - షణ్ముఖ్ కి హీరో ఇచ్చి.. ప్రియాంక గేమ్ లో తోసేసిందని ఆమెకి విలన్ ఇచ్చింది.
  • ప్రియాంక - కావాలని తోయలేదని.. తప్పుగా అర్ధం చేసుకుందని సిరికి విలన్ ఇచ్చింది. హౌస్ లో తనకు బాగా సపోర్ట్ చేస్తాడని మానస్ కి హీరో ఇచ్చింది. 'యువర్ ఆల్వేస్ మై హీరో' అంటూ డైలాగ్ వేసింది.
  • శ్రీరామ్ - టాస్క్ లో తన బెస్ట్ ఇస్తాడని.. విశ్వకి హీరో ఇచ్చాడు. టాస్క్ లో సిరితో ఆడడం టఫ్ అవుతుందని ఆమెకి విలన్ ఇచ్చాడు.
  • కాజల్ - తనను విలన్ అనుకుంటున్నారని.. యానీ మాస్టర్ కి విలన్ ఇచ్చింది. మానస్ కి హీరో ఇచ్చింది.
  • సన్నీ - జెస్సీకి హీరో ఇచ్చాడు.. ప్రియాంకకు విలన్ ఇచ్చాడు. 

సిరి సేఫ్..

నామినేషన్ లో మిగిలిన ఏడుగురి చేతుల్లో బ్యాగ్స్ పెట్టారు. ఆ బ్యాగ్ లో రెడ్ బాల్ ఉంటే అన్ సేఫ్.. గ్రీన్ బాల్ ఉంటే సేఫ్ అని చెప్పారు. సిరి బ్యాగ్ లో గ్రీన్ కలర్ బాల్ ఉండడంతో ఆమె సేవ్ అయింది.

  • రవి - టాస్క్ లో హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడని.. విశ్వకి హీరో ఇచ్చాడు. షణ్ముఖ్ కి విలన్ ఇచ్చాడు.
  • షణ్ముఖ్ - ఈ విలన్ లేకపోతే నేను హీరో అవ్వలేను అంటూ రవికి విలన్ ఇచ్చాడు. అబ్బాయిలకంటే దారుణంగా గేమ్ ఆడతాదని రికి హీరో ఇచ్చాడు.
  • యానీ మాస్టర్ - ఫస్ట్ వీక్ నుంచి కంఫర్ట్ గా లేనని.. కాజల్ కి విలన్ ఇచ్చింది. విశ్వకి హీరో ఇచ్చింది.
  • విశ్వ - గేమ్ ఛేంజర్ అంటూ శ్రీరామ్ కి హీరో ఇచ్చాడు. ప్రియాంక కారణంగా హర్ట్ అవుతున్నా అంటూ ఆమెకి విలన్ ఇచ్చాడు.
  • జెస్సీ - తనకు చాలా సపోర్ట్ చేస్తుందని.. సిరికి హీరో ఇచ్చాడు. కాజల్ రెండు వారాలుగా గేమ్ లో డల్ అయిపోయిందని కాజల్ కి విలన్ ఇచ్చాడు.
  • మానస్ - ప్రియాంకకు హీరో ఇచ్చాడు. రవికి విలన్ ఇచ్చాడు. 
    ఓవరాల్ గా.. హీరో ఆఫ్ ది హౌస్ గా విశ్వ, విలన్ ఆఫ్ ది హౌస్ గా ప్రియాంక నిలిచారు. 

సన్నీ సేఫ్..

నామినేషన్ లో ఉన్న ఆరుగురి చేతుల్లో బాక్సులు పెట్టారు. ఆ బాక్స్ లో బ్లాక్ కలర్ రోజ్ వస్తే అన్ సేఫ్.. వైట్ రోజ్ వస్తే సేఫ్ అని చెప్పారు. సన్నీకి వైట్ రోజ్ రావడంతో అతడు సేఫ్ అని ప్రకటించారు. '

Also Read: మెగా 154 లాంఛింగ్ లో టాలీవుడ్ సెలబ్రిటీలు..

Also Read: మాస్ లుక్కులో మెగాస్టార్... అన్నయ్య అరాచకం ఆరంభం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Cyclone Fengal: ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
Mulugu Encounter: ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌, ఏడుగురు మావోయిస్టుల హతం
ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌, ఏడుగురు మావోయిస్టుల హతం
Bougainvillea OTT: థియేటర్లలోకి ‘పుష్ప 2’తో... ఓటీటీలోకి ‘బోగన్ విల్లా’తో... డిసెంబర్‌లో ఫహాద్ ఫాజిల్ డబుల్ ధమాకా
థియేటర్లలోకి ‘పుష్ప 2’తో... ఓటీటీలోకి ‘బోగన్ విల్లా’తో... డిసెంబర్‌లో ఫహాద్ ఫాజిల్ డబుల్ ధమాకా
Gautam Adani: ఎన్ని దాడులు జరిగితే అంత రాటుదేలతాం - ఆరోపణలపై తొలిసారి స్పందించిన అదానీ
ఎన్ని దాడులు జరిగితే అంత రాటుదేలతాం - ఆరోపణలపై తొలిసారి స్పందించిన అదానీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Guest House History Tour | బొబ్బిలి రాజుల గెస్ట్ హౌస్ ఎందుకంత ఫేమస్ | ABP DesamRishiteswari Case: Guntur Court Final Verdict | 9 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు ఏంటి? | ABP DesamPawan Kalyan Seize the Ship | డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అంతర్జాతీయ నౌకను సీజ్ చేయగలరా? | ABPPushpa 2 Ticket Booking Rates | అల్లు అర్జున్ సినిమా చూడాలంటే ఆ మాత్రం ఉండాలి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cyclone Fengal: ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
Mulugu Encounter: ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌, ఏడుగురు మావోయిస్టుల హతం
ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌, ఏడుగురు మావోయిస్టుల హతం
Bougainvillea OTT: థియేటర్లలోకి ‘పుష్ప 2’తో... ఓటీటీలోకి ‘బోగన్ విల్లా’తో... డిసెంబర్‌లో ఫహాద్ ఫాజిల్ డబుల్ ధమాకా
థియేటర్లలోకి ‘పుష్ప 2’తో... ఓటీటీలోకి ‘బోగన్ విల్లా’తో... డిసెంబర్‌లో ఫహాద్ ఫాజిల్ డబుల్ ధమాకా
Gautam Adani: ఎన్ని దాడులు జరిగితే అంత రాటుదేలతాం - ఆరోపణలపై తొలిసారి స్పందించిన అదానీ
ఎన్ని దాడులు జరిగితే అంత రాటుదేలతాం - ఆరోపణలపై తొలిసారి స్పందించిన అదానీ
Jigra OTT: యాక్షన్ అదరగొట్టిన ఆలియా భట్... బాలీవుడ్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడు, ఎందులోనో తెలుసా?
యాక్షన్ అదరగొట్టిన ఆలియా భట్... బాలీవుడ్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడు, ఎందులోనో తెలుసా?
Aravind Kejriwal: కాంగ్రెస్ తో దోస్తీకి స్వస్తి, ఢిల్లీలో ఒంటరిగా పోటీ చేయనున్న ఆప్- స్పష్టం చేసిన కేజ్రీవాల్
కాంగ్రెస్ తో దోస్తీకి స్వస్తి, ఢిల్లీలో ఒంటరిగా పోటీ చేయనున్న ఆప్- స్పష్టం చేసిన కేజ్రీవాల్
Viral Video: చెన్నై ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన ముప్పు, ల్యాండింగ్ సమయంలో భయానక పరిస్థితులు
చెన్నై ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన ముప్పు, ల్యాండింగ్ సమయంలో భయానక పరిస్థితులు
Allu Arjun - Chiranjeevi: అల్లు అర్జున్ హీరో కావడం వెనుక 'చిరు' కథ - మెగా మల్టీస్టారర్ ఆగితే తెరపైకి వచ్చిన 'గంగోత్రి'
అల్లు అర్జున్ హీరో కావడం వెనుక 'చిరు' కథ - మెగా మల్టీస్టారర్ ఆగితే తెరపైకి వచ్చిన 'గంగోత్రి'
Embed widget