అన్వేషించండి

Bigg Boss 5 Telugu: నామినేషన్ లో తొమ్మిదిమంది.. శ్రీరామ్ తో షణ్ముఖ్,సిరి, జెస్సీల గొడవ.. 

సోమవారం నాడు నామినేషన్ ప్రక్రియ కావడంతో ఎవరు ఎవరిని నామినేట్ చేస్తారా..? అనే ఆసక్తి ఏర్పడింది.

బిగ్ బాస్ సీజన్ 5 ఐదో వారంలోకి ఎంటర్ అయింది. సోమవారం నాడు నామినేషన్ ప్రక్రియ కావడంతో ఎవరు ఎవరిని నామినేట్ చేస్తారా..? అనే ఆసక్తి ఏర్పడింది. షో మొదలవ్వగానే.. కిచెన్ రూమ్ లో వంట చేస్తుంది ప్రియాంక. ఆమె దగ్గరకు వెళ్లి మటన్ పీస్ లు ఎన్ని ఉన్నాయో లెక్కపెట్టు అంటూ హమీద చెప్పింది. 'ఎలా లెక్కబెడతారు.. నేను వడ్డిస్తానులే' అని ప్రియాంక చెప్పింది. అయినా.. హమీద ఫోర్స్ చేసింది.  దీంతో ప్రియాంక కోపంగా అక్కడనుంచి వెళ్లిపోయింది. ''మటన్ కొట్టువాడు నా హస్బెండా.. మటన్ ముక్కను నన్ను లెక్కపెట్టమంటాది.. పదేళ్లుగా వంట చేస్తున్నా.. నాకు తెలియదా ఏం చేయాలో.. పక్కనే ఉంటూ టీచ్ చేస్తున్నారు. ఇంతకాలం తిన్నది ఏంటో..?'' అంటూ కాజల్ కి చెబుతూ హమీదపై మండిపడింది. 

నామినేషన్ ప్రక్రియ..

నామినేషన్ ప్రక్రియ షురూ చేశారు బిగ్ బాస్. హౌస్ మేట్స్ ని ఒక్కొక్కరిగా కన్ఫెషన్ రూమ్ లోకి పిలుస్తూ.. నామినేట్‌ చేయాలనుకుంటున్న ఇద్దరి ఇంటిసభ్యుల పేర్లు, అందుకు తగిన కారణాలు చెప్పమని బిగ్‌బాస్‌ అడిగారు. 

  1. జెస్సీ- రవిని నామినేట్ చేస్తూ.. 'నేను ఆడే గేమ్ కరెక్ట్ కాదని, నన్ను మానిప్యులేట్ చేస్తున్నారని' రీజన్ చెప్పారు. లోబోని నామినేట్ చేస్తూ 'కెప్టెన్సీ టాస్క్ లో నాకు శిక్ష పడడానికి అతడే కారణం. హౌస్ లో నువ్ చాలా వీక్ అని తక్కువ చేస్తున్నాడని' కారణం చెప్పాడు.  
  2. సన్నీ-షణ్ముఖ్ ని నామినేట్ చేస్తూ.. అతడితో ఎలాంటి కనెక్షన్ రావడం లేదని రీజన్ చెప్పాడు. ప్రియాని నామినేట్ చేస్తూ.. షణ్ముఖ్ కి చెప్పిన కారణమే చెప్పాడు.
  3. విశ్వ-జెస్సీని నామినేట్ చేస్తూ.. 'కెప్టెన్ గా ట్రిప్ అయ్యాడు.. నోరు జారి చాలా మాటలు అన్నాడు' అని రీజన్ చెప్పాడు. షణ్ముఖ్ రేషన్ మ్యానేజర్ అయ్యాక మొత్తం బిహేవియర్ మారిపోయిందని.. చాలా పొగరుగా బిహేవ్ చేశాడని అతడిని నామినేట్ చేశాడు.
  4. కాజల్-రవి, సన్నీని నామినేట్ చేస్తూ.. నన్ను నామినేట్ చేసిన వారిని నామినేట్  చేస్తా అని తన స్ట్రాటజీ చెప్పింది.
  5. లోబో-మానస్, షణ్ముఖ్ లను నామినేట్ చేశాడు.
  6. ప్రియాంక-హమీదను నామినేట్ చేస్తూ.. 'సరదాగా మాట్లాడినా సీరియస్ గా తీసుకుంటుంది.. రేషన్ మ్యానేజర్ అయ్యాక చాలా డిమాండింగా ప్రవర్తిస్తుంది' అని రీజన్ చెప్పింది. లోబోని నామినేట్ చేస్తూ.. 'టాస్క్ లో ఇంకొంచెం స్ట్రాంగ్ గా ఉండాలని' చెప్పింది.
  7. సిరి- రవిని నామినేట్ చేస్తూ.. 'తన గేమ్ కంటే పక్కవాళ్ళ గేమ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని' రీజెన్ చెప్పింది. హమీదకి మొదటి రెండు వారాలలో ఉన్న ఫైర్ ఇప్పుడు తగ్గిపోయిందని.. రేషన్ మ్యానేజర్ అయ్యాక డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుందని ఆమెని నామినేట్ చేసింది.
  8. రవి-జెస్సీని నామినేట్ చేస్తూ ఇమ్మెచ్యూర్డ్ బిహేవియర్, అతడి చుట్టూ చాలా నెగెటివిటీ అనిపిస్తుందని రీజన్ చెప్పాడు. షణ్ముఖ్ ని నామినేట్ చేస్తూ.. 'ఎలాంటి రీజన్ లేకుండా లాస్ట్ వీక్ నన్ను నామినేట్ చేశాడని' కారణం చెప్పాడు.
  9. యానీ మాస్టర్- తనకంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అని రవి, విశ్వలను నామినేట్ చేసింది.
  10. షణ్ముఖ్- విశ్వని నామినేట్ చేస్తూ.. 'సెకండ్ వీక్ నుంచి తగ్గిపోతున్నాడు.. ఇండిపెండెంట్ గేమ్ మర్చిపోయాడనిపించింది' అంటూ రీజన్ చెప్పాడు. ఆ తరువాత మానస్ ని నామినేట్ చేశాడు.
  11. హమీద-ప్రియాని నామినేట్ చేస్తూ.. తనతో సరిగా మాట్లాడరని కారణం చెప్పింది. షణ్ముఖ్ ని సెకండ్ వీక్ బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నా.. కానీ ఇప్పుడు సరిగ్గా ఉండడం లేదని కారణం చెప్పింది.
  12. శ్వేతా-కాజల్, మానస్ ని నామినేట్ చేసింది. కెప్టెన్సీ టాస్క్ లో తనను సపోర్ట్ చేయలేదని రీజన్ చెప్పింది.
  13. ప్రియా- షణ్ముఖ్ ని నామినేట్ చేస్తూ.. 'ఎవరి గేమ్ వాళ్లు ఆడాలని చెప్తాడు.. కానీ తన విషయంలోనే పాటించడం లేదని' రీజన్ చెప్పాడు. సన్నీను నామినేట్ చేస్తూ.. ప్రతీసారి నన్ను టార్గెట్ చేస్తున్నాడనిపిస్తుందని రీజన్ చెప్పాడు.
  14. మానస్-జెస్సీ, షణ్ముఖ్ లను నామినేట్ చేశాడు.
  15. శ్రీరామచంద్ర- జెస్సీ చాలా హైపర్ ఉంటున్నాడని.. షణ్ముఖ్ వేరే ప్రపంచంలో ఉంటుంటారని కారణాలు చెప్పి ఇద్దరినీ నామినేట్ చేశాడు. 

ఎవరు ఎవరిని నామినేట్ చేశారో.. బిగ్ బాస్ టీవీలో వేసి చూపించగా హౌస్ మేట్స్ అంతా షాకయ్యారు. ఈ వారం నామినేట్ అయిన సభ్యులు లోబో, జెస్సీ, షణ్ముఖ్, ప్రియా, సన్నీ, రవి, మానస్, విశ్వ, హమీద. 

ఫేస్ టు ఫేస్ ఆడినప్పుడు అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారని సిరి, జెస్సీ మాట్లాడుకున్నారు. 

'నాకు నీతో మాట్లాడాలని లేదని' మానస్.. శ్వేతతో చెప్పగా.. 'అంత యాటిట్యూడ్ అవసరం లేదు' అని శ్వేతా అనగా.. 'నీక్కూడా అంత యాటిట్యూడ్ అవసరం లేదని' మానస్ బదులిచ్చాడు. 

జెస్సీతో రవి డిస్కషన్ పెట్టాడు. 'గే లవ్ స్టోరీ ఎలా ప్లాన్ చేస్తారని..' జెస్సీ ప్రశ్నించగా.. నిన్ను గ్రాంటెడ్ గా తీసుకొని ఉంటాం.. మమ్మల్ని క్షమించు అని రవి, లోబోలు చెప్పారు. 

ఎందుకు నామినేట్ చేయాల్సి వచ్చిందో రవి.. షణ్ముఖ్ కి వివరణ ఇచ్చే ప్రయత్నం చేయగా.. అతడు కోపంగానే తీసుకున్నాడు. రవి,సన్నీ, లోబో, విశ్వా, మానస్ కలిసి డిస్కషన్ పెట్టుకున్నారు. 

'ఇది మీ ఇల్లు కాదు.. బిగ్ బాస్ హౌస్'

జెస్సీ కిచెన్ లో పని చేయడం లేదని శ్రీరామ్ అతడిపై ఫైర్ అయ్యాడు. 'ఇలా ఉంటే ఎవరి తిండి వాళ్లు వండుకోవాలని రూల్ పెడతా ఓకేనా నీకు' అని ప్రశ్నించాడు శ్రీరామ్. దీంతో జెస్సీకి కోపం వచ్చింది. 'నా ఫుడ్ మొత్తం తీసి పక్కన పెట్టండి నేను వండుకుంటా' అంటూ ఫైర్ అయ్యాడు. 'తొక్కలో యాటిట్యూబ్ నా దగ్గర చూపించకు' అంటూ శ్రీరామ్ మండిపడ్డాడు. 'ఫుడ్ ఇవ్వను.. ఫుడ్ పెట్టను అని ఎలా చెప్తారు..?' అని జెస్సీ ఫైర్ అవుతుండగా.. షణ్ముఖ్ ఇన్వాల్వ్ అవుతూ.. 'ఇది మీ ఇల్లు కాదు.. బిగ్ బాస్ హౌస్ ఇది' అని శ్రీరామ్ పై విరుచుకుపడ్డాడు. వెంటనే శ్రీరామ్.. 'షణ్ముఖ్ నువ్ మధ్యలో వచ్చి మాట్లాడకు.. నీకు ఫస్ట్ నుంచి ఏమైందో తెలియదు' అని వేలు చూపిస్తూ మాట్లాడగా.. 'నేను మధ్యలో వస్తాను' అని షణ్ముఖ్.. 'అసలు నువ్ ఎవరు చెప్పడానికి, నువ్ కెప్టెన్ మాత్రమే.. ఆర్డర్ చేయకూడదని సిరి' శ్రీరామ్ ని వేసుకున్నారు.
కిచెన్ క్లీనింగ్ కోసం గొడవ పడడం చాలా చీప్ అని యానీ మాస్టర్ కామెంట్ చేయగా.. 'మీరు నాదే తప్పు అంటున్నారా..?' అని జెస్సీ అనగా.. ఆమె ఏం చెప్పకుండా వెళ్లిపోయింది. 

ప్రియాంక-శ్వేతా-సన్నీలు కలిసి కాసేపు ఫన్ చేశారు. షణ్ముఖ్-సిరి-జెస్సీ లు ఫుడ్ తినడం మానేయడంతో యానీ మాస్టర్ వెళ్లి డిన్నర్ చేయమని అడిగారు. ఒక్కొక్కడు యాక్టింగ్ చేస్తున్నారని.. నిజంగా మనం తినలేదని ఫీలింగ్ కాదని షణ్ముఖ్.. సిరి-జెస్సీలతో అన్నాడు. ఇంతలో శ్రీరామ్ వచ్చి షణ్ముఖ్, జెస్సీలకు చపాతి తినిపించాడు.  

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
Pushpa 2: హమ్మయ్య... 'పుష్ప 2'కి రెండేళ్ల తర్వాత టాటా చెప్పిన బన్నీ - క్యారెక్టర్ గురించి అల్లు అర్జున్ ఏమన్నారో తెలుసా?
హమ్మయ్య... 'పుష్ప 2'కి రెండేళ్ల తర్వాత టాటా చెప్పిన బన్నీ - క్యారెక్టర్ గురించి అల్లు అర్జున్ ఏమన్నారో తెలుసా?
Afifabad Tiger News: ఆసిఫాబాద్ జిల్లాలో హైవే పక్కన తిరుగుతున్న పెద్దపులి, కేరామరిలో మరో పులి సంచారం
ఆసిఫాబాద్ జిల్లాలో హైవే పక్కన తిరుగుతున్న పెద్దపులి, కేరామరిలో మరో పులి సంచారం
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలుRail Bus in Mysore Rail Museum | తెలుగు రాష్ట్రాలకే ప్రత్యేకమైన రైలు బస్సు ఇలాగే ఉండేది | ABP DesamPrithvi Shaw Unsold IPL 2025 Auction | అద్భుతమైన భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకున్న పృథ్వీ షా | ABP DesamMS Dhoni Auction Plan CSK IPL 2025 Team | ధోని ప్లాన్ వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
Pushpa 2: హమ్మయ్య... 'పుష్ప 2'కి రెండేళ్ల తర్వాత టాటా చెప్పిన బన్నీ - క్యారెక్టర్ గురించి అల్లు అర్జున్ ఏమన్నారో తెలుసా?
హమ్మయ్య... 'పుష్ప 2'కి రెండేళ్ల తర్వాత టాటా చెప్పిన బన్నీ - క్యారెక్టర్ గురించి అల్లు అర్జున్ ఏమన్నారో తెలుసా?
Afifabad Tiger News: ఆసిఫాబాద్ జిల్లాలో హైవే పక్కన తిరుగుతున్న పెద్దపులి, కేరామరిలో మరో పులి సంచారం
ఆసిఫాబాద్ జిల్లాలో హైవే పక్కన తిరుగుతున్న పెద్దపులి, కేరామరిలో మరో పులి సంచారం
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Telangana Airports: తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
CID VijayPal: ఏపీ సీఐడీ మాజీ డీఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ - రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసుల దూకుడు!
ఏపీ సీఐడీ మాజీ డీఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ - రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసుల దూకుడు!
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
Pushpa Actor Shritej: మోసం చేశాడు... ఎఫైర్ల విషయంలో
మోసం చేశాడు... ఎఫైర్ల విషయంలో "పుష్ప" నటుడు శ్రీతేజ్ మీద బాంబు పేల్చిన భార్య
Embed widget