అన్వేషించండి
Advertisement
Samantha Divorce: సమంతకు భరణం ఇస్తున్నారా..? అసలు నిజాలివే!
నాగచైతన్య నుంచి విడిపోతుండడంతో సమంతకు భరణంగా రూ.200 కోట్లు ఆఫర్ చేశారని.. కానీ ఆమె రిజెక్ట్ చేసిందని ప్రచారం జరిగింది. ఇందులో నిజానిజాలేంటని ఆరా తీయగా.. అసలు విషయం బయటకొచ్చింది.
టాలీవుడ్ రొమాంటిక్ కపుల్ సమంత-చైతు విడిపోయారంటే నమ్మశక్యంగా లేదు. చాలా కాలంగా వీరిద్దరూ విడిపోతున్నట్లు మీడియాలో వార్తలు వస్తుంటే.. అభిమానులు మాత్రం చై-సామ్ కలిసుండాలనే అనుకున్నారు. కానీ ఈ జంట 'మేం విడిపోతున్నాం' అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. వీరి విడాకుల అనౌన్స్మెంట్ తో టాలీవుడ్ ఒక్కసారిగా షాకైంది. రెండు రోజులుగా మీడియా వర్గాల్లో ఇదే టాపిక్ నడుస్తుంది. వీరిద్దరు విడిపోవడానికి గల కారణాలేంటంటూ చర్చించుకుంటున్నారు. ఇదే సమయంలో మరో వార్త చక్కర్లు కొట్టింది.
నాగచైతన్య నుంచి విడిపోతుండడంతో సమంతకు భరణంగా రూ.200 కోట్లు ఆఫర్ చేశారని.. కానీ ఆమె రిజెక్ట్ చేసిందని ప్రచారం జరిగింది. ఇందులో నిజానిజాలేంటని ఆరా తీయగా.. అసలు విషయం బయటకొచ్చింది. నిజానికి పెళ్లికి ముందే సమంత-చైతు మధ్య ఓ అగ్రిమెంట్ ఉందట. అదేంటంటే పెళ్లి తరువాత వీరిద్దరూ విడిపోతే గనుక సమంతకు ఎలాంటి భరణం రాదనేది ఆ అగ్రిమెంట్ సారాంశం. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు, నాగార్జున కలిసి దీని గురించి చర్చించి డాకుమెంట్స్ సిద్ధం చేయగా.. పరస్పర అంగీకారంతో చైతు-సమంత ఈ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టారట.
పేరున్న లాయర్, నిర్మాత నిరంజన్ రెడ్డి ఈ అగ్రిమెంట్ కి సంబంధించిన ఫార్మాలిటీస్ అన్నీ చూసుకున్నట్లు సమాచారం. పెళ్లికి ముందే ఈ అగ్రిమెంట్ చేసుకున్నారు కాబట్టి భరణం పేరుతో సమంతకు ఎలాంటి ఆస్తి, డబ్బులు ఇవ్వడం లేదట. సమంత ఒక ఇండిపెండెంట్ విమెన్. ఆమె సంపాదన కోట్లలో ఉంటుంది. కాబట్టి డబ్బుల కోసం ఎవరిమీదో ఆధారపడాల్సిన అవసరం ఆమెకి లేదు. సినిమాలు, వెబ్ సిరీస్ లతో పాటు పలు యాడ్స్ లో నటిస్తూ బాగానే సంపాదిస్తోంది. ప్రస్తుతం సామ్ కొన్నాళ్లు బ్రేక్ తీసుకొని వచ్చే ఏడాది నుంచి కొత్త ప్రాజెక్ట్ లపై దృష్టి పెట్టనుంది.
Also Read: పవన్తో విభేదాలు.. ఆయన మార్నింగ్ షో కలెక్షనంత ఉండదు మీ సినిమా: ప్రకాష్ రాజ్
Also Read: సినీ పెద్దల ఆశీర్వాదం నాకొద్దు.. నరేష్ నీ చక్రం దొబ్బేశాం.. సిగ్గుపడేలా మాట్లాడకు: ప్రకాష్ రాజ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
న్యూస్
తిరుపతి
గాసిప్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion