X
Super 12 - Match 18 - 26 Oct 2021, Tue up next
SA
vs
WI
15:30 IST - Dubai International Cricket Stadium, Dubai
Super 12 - Match 19 - 26 Oct 2021, Tue up next
PAK
vs
NZ
19:30 IST - Sharjah Cricket Stadium, Sharjah

Mumbai Rave Party: ఎవరీ ఆర్యన్ ఖాన్.. మార్షల్ ఆర్ట్స్ నుంచి డ్రగ్స్ కేసు వరకు.. స్టార్ కిడ్ ఆసక్తికర విషయాలు

Who is Aryan Khan: బాలీవుడ్, టాలీవుడ్, శాండల్ వుడ్‌లోనూ గత కొన్నేళ్లుగా డ్రగ్స్ కేసుల విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో తనయుడు డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం కలకలం రేపుతోంది.

FOLLOW US: 

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో చిక్కుకున్నాడనే వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముంబై తీరంలోని కార్డెలియా క్రూయిజ్‌ లో జరిగిన రేవ్ పార్టీ బాలీవుడ్ బాద్ షా వారసుడిని చిక్కుల్లో పడేసింది. నౌకలో రేవ్‌ పార్టీ జరుగుతున్న సమయంలో ఎన్‌సీబీ అధికారులు దాడులు నిర్వహించి... కొకైన్‌, గంజాయి, ఎండీఎంఏ వంటి మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకొన్నారు. ఆర్యన్ ఖాన్‌తో పాటు మొత్తం ఎనిమిది మందిని ఎన్‌సీబీ అదుపులోకి తీసుకుంది. సుదీర్ఘ విచారణ అనంతరం ఎన్‌సీబీ కార్యాలయంలో వైద్యపరీక్షలు నిర్వహించిన అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆర్యన్ ఖాన్‌తో సహా ముగ్గుర్ని ఒక రోజు ఎన్‌‌సీబీ కస్టడీలోకి తీసుకోవటానికి అనుమతిచ్చింది. 


బాలీవుడ్ బాద్‌షా తనయుడు..


బాలీవుడ్, టాలీవుడ్, శాండల్ వుడ్‌లోనూ గత కొన్నేళ్లుగా డ్రగ్స్ కేసుల విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ పెద్ద కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను ముంబైలో రేవ్ పార్టీలో పాల్గొన్నాడని అదుపులోకి తీసుకున్నారు. ఇక అది మొదలు ఆర్యన్‌ ఖాన్ ఎవరు, ఈ స్టార్ కిడ్ బాల్యం, అతని వ్యవహార శైలి తెలుసుకోవాలని అతడి గురించి నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. షారుఖ్‌ ఖాన్‌-గౌరీ ఖాన్‌ల పెద్ద కుమారుడు ఆర్యన్ ఖాన్ 1997లో జన్మించాడు. మీడియాకు ఎక్కువగా ఆర్యన్ ఫోకస్ కాకుండా షారుఖ్ జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుతం ఆర్యన్‌ వయసు 23 సంవత్సరాలు. మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియాలో పెద్దగా కనిపించకపోయినా.. ఆర్యన్ ఖాన్ కు సోషల్‌ మీడియాలో భారీగా ఫాలోయర్లు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆర్యన్‌ను 14 లక్షల మంది ఫాలో అవుతున్నారు.


Also Read: డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ కుమారుడు అరెస్ట్.. సోమవారం వరకు ఎన్‌సీబీ కస్టడీలోనే!

 


 

  

 


View this post on Instagram


  

 

  

  

 

 
 

 


A post shared by Shah Rukh Khan (@iamsrk)లండన్‌లోని సెవెన్‌వోక్స్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసిన ఆర్యన్... ఈ ఏడాది మొదట్లో యూనివర్శిటి ఆఫ్‌ సౌత్‌ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని స్కూల్‌ ఆఫ్‌ సినిమాటిక్‌ ఆర్ట్స్‌ నుంచి సినిమాటిక్‌, ఫిల్మ్‌ అండ్‌ ప్రొడక్షన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీని అందుకున్నాడు. మార్షల్ ఆర్ట్స్ అంటే మక్కువ చూపించే ఆర్యన్ ఖాన్...  తైక్వాండోలో బ్లాక్‌బెల్ట్‌ సైతం సాధించాడు. 2010లో మహారాష్ట్రలో జరిగిన తైక్వాండో పోటీల్లో ఆర్యన్‌ బంగారు పతకం సాధించాడు. గాల్లోకి అలవోకగా జంప్స్ చేస్తూ అతను ఫీట్స్ చేస్తున్న వీడియోలు సైతం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఫిట్ నెస్ పై ప్రత్యేక దృష్టి సారించే ఆర్యన్ డ్రగ్స్ కేసులో చిక్కుకోవడం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.


Also Read: సముద్రం మధ్యన షిప్‌లో సోదాలు ఎలా? అధికారులు అమలు చేసిన పక్కా ప్లాన్ ఏంటంటే..

 


 

  

 


View this post on Instagram


  

 

  

  

 

 
 

 


A post shared by Aryan Khan (@___aryan___)బాలనటుడు.. కానీ నటనపై ఆసక్తి లేదు..


2001లోనే ‘కభీ ఖుషీ కభీగమ్‌’ చిత్రంలో షారుఖ్‌ ఖాన్‌ పాత్రను ఆర్యన్ పోషించాడు. 2004 విడుదలైన యానిమేషన్‌ చిత్రం ‘ఇంక్రెడిబుల్స్‌’లో చిన్నప్పటి తేజ్ పాత్రకు గాత్రాన్ని అందించాడు. హిందీ వెర్షన్‌ లయన్‌ కింగ్‌లో సింబా పాత్రకు తన వాయిస్ ను ఇచ్చాడు. నటన కంటే రచన, దర్శకత్వంపైన ఆర్యన్ కు ఎక్కువ ఆసక్తి అని షారుఖ్ పలు ఇంటర్వూల్లో చెప్పాడు. తొలుత ఆర్యన్  సినిమాల్లోకి వస్తాడని తాను అనుకోవటం లేదని చెప్పిన షారుఖ్....ఆ తర్వాత ఆర్యన్ ఖాన్ స్క్రీన్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చేశాడు. అతి త్వరలో హీరోగా బాలీవుడ్ బాద్ షా వారసుడు రంగప్రవేశానికి సర్వం సిద్ధం అవుతున్న తరుణంలో...ఇలా డ్రగ్స్ కేసులో చిక్కుకోవటం చర్చనీయాంశంగా మారింది. ఎన్సీబీ కస్టడీ తర్వాత ఈ కేసు వ్యవహారంలో మరిన్ని వివరాలు, ఆర్యన్ ఖాన్ పాత్ర పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


Also Read: ఆర్యన్ ఖాన్ అరెస్ట్.. షారుఖ్ ఇంటికి చేరుకున్న సల్మాన్ ఖాన్..

 


 

  

 


View this post on Instagram


  

 

  

  

 

 
 

 


A post shared by Shah Rukh Khan (@iamsrk)
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Mumbai Shahrukh Khan Shah Rukh Khan Mumbai rave party NCB aryan khan Mumbai Drug Party Mumbai Drug Party Case

సంబంధిత కథనాలు

Ration Shop: పోలీసుల కళ్లలో కారం కొట్టి, రాడ్‌తో దాడి చేసిన మహిళ.. ఆర్డీవో, డీఎస్పీ ముందే నానాబీభత్సం

Ration Shop: పోలీసుల కళ్లలో కారం కొట్టి, రాడ్‌తో దాడి చేసిన మహిళ.. ఆర్డీవో, డీఎస్పీ ముందే నానాబీభత్సం

Mahabubnagar: ఒకే చీరకు ఉరేసుకున్న వదిన, మరిది.. కారణం తెలిసి స్థానికులు షాక్

Mahabubnagar: ఒకే చీరకు ఉరేసుకున్న వదిన, మరిది.. కారణం తెలిసి స్థానికులు షాక్

Breaking News Live Updates: దిల్లీలో అగ్ని ప్రమాదం.. నలుగురు సజీవదహనం

Breaking News Live Updates: దిల్లీలో అగ్ని ప్రమాదం.. నలుగురు సజీవదహనం

Hyderabad Metro: అయ్యో.. కనీస సంస్కారం లేదా? ఒళ్లో పసిబిడ్డతో తల్లి ఇబ్బందులు, కనీసం సీటివ్వరా?’ వీడియో వైరల్

Hyderabad Metro: అయ్యో.. కనీస సంస్కారం లేదా? ఒళ్లో పసిబిడ్డతో తల్లి ఇబ్బందులు, కనీసం సీటివ్వరా?’ వీడియో వైరల్

Gold-Silver Price: ఎగబాకిన పసిడి ధర, అదే దారిలో వెండి కూడా.. నేడు మీ నగరంలో ధరలివీ..

Gold-Silver Price: ఎగబాకిన పసిడి ధర, అదే దారిలో వెండి కూడా.. నేడు మీ నగరంలో ధరలివీ..
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

IPL 2022 Format: ఐపీఎల్ 2022 ఫార్మాట్‌లో మార్పు.. ఈసారి మ్యాచ్‌లు ఎలా జరుగుతాయంటే?

IPL 2022 Format: ఐపీఎల్ 2022 ఫార్మాట్‌లో మార్పు.. ఈసారి మ్యాచ్‌లు ఎలా జరుగుతాయంటే?

Anger Management: కోవిడ్ తరువాత పెరుగుతున్న కోపం... ఇలా తగ్గించుకోండి

Anger Management: కోవిడ్ తరువాత పెరుగుతున్న కోపం... ఇలా తగ్గించుకోండి

Crime News: ఆమెతో కలిసి ఆ రోజు లాడ్జికి వెళ్లాడు.. చంపేశాడా? చచ్చిపోవాలనుకున్నారా?

Crime News: ఆమెతో కలిసి ఆ రోజు లాడ్జికి వెళ్లాడు.. చంపేశాడా? చచ్చిపోవాలనుకున్నారా?

Horoscope Today 26 October 2021: ఈ రోజు ఈ రాశుల వారికి ఏం చేసినా కలిసొస్తుంది, ఏ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే...

Horoscope Today 26 October 2021: ఈ రోజు ఈ రాశుల వారికి ఏం చేసినా కలిసొస్తుంది, ఏ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే...