News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Mumbai Rave Party: డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ కుమారుడు అరెస్ట్.. సోమవారం వరకు ఎన్‌సీబీ కస్టడీలోనే!

ముంబయి క్రూయిజ్ నౌకలో జరిగిన రేవ్​ పార్టీలో పట్టుబడ్డవారిలో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఉన్నాడు. ఈ విషయాన్ని ముంబయి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వెల్లడించింది.

FOLLOW US: 
Share:
ముంబయి రేవ్ పార్టీలో పట్టుబడిన వారిలో బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఉన్నాడని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో స్పష్టం చేసింది. ఆర్యన్ ఖాన్ సహా అర్బజ్  మర్చంట్, మన్‌మన్ ధమేచలను రేపటి వరకు ఎన్‌సీబీ కస్టడీలో ఉంచుకోనుంది. ఈ పార్టీలో అదుపులోకి తీసుకున్న ఎనిమిది మంది వివరాలను ఎన్​సీబీ వెల్లడించింది.

వీరే వాళ్లు..

ఆర్యన్ ఖాన్​తో పాటు అర్బాజ్ మర్చంట్, మున్​మున్ ధమేచ, నుపుర్ సారిక, ఇస్మీత్ సింగ్, మోహక్ జైశ్వాల్, విక్రాంత్ ఛోకర్, గోమిత్ చోప్రాలను అదుపులోకి తీసుకున్నట్లు ముంబయి ఎన్​సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖెడే తెలిపారు. వీరిని ప్రశ్నిస్తున్నట్లు వెల్లడించారు.

మెడికల్ టెస్ట్..

అదుపులోకి తీసుకున్న ఎనిమిది మందిలో ముగ్గురికి మెడికల్ టెస్టులు నిర్వహించింది ఎన్‌సీబీ. వీరిలో ఆర్యన్ ఖాన్ కూడా ఉన్నట్లు సమాచారం.

#WATCH | Mumbai: Three of the eight detained persons, in connection with the raid at a party at a cruise off the Mumbai coast, were being taken for the medical test by NCB pic.twitter.com/JVAYF6fMb5

— ANI (@ANI) October 3, 2021

మాటు వేసి..

సాధారణ ప్రయాణికుల్లానే మాదకద్రవ్యాల నిరోధకశాఖ అధికారులు కూడా నౌకలోకి ఎక్కారు. నౌక ముంబయి తీరాన్ని వదిలి సముద్రం మధ్యలోకి చేరగానే పార్టీ మొదలైంది. దీంతో అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమై పలువురిని అదుపులోకి తీసుకొన్నారు. నౌక యాజమాన్యానికి కూడా అధికారులు నోటీసులు పంపించినట్లు తెలిసింది. నౌకలోని చాలా గదులను అధికారులు తనిఖీ చేశారు.

కోర్టుకు..

మాదకద్రవ్యాలను అనుమానితులు తమ దుస్తులు, లోదుస్తులు, పర్సులలో దాచేసుకున్నారని వెల్లడించారు. అదుపులోకి తీసుకున్నవారందరినీ న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నట్లు ఎన్​సీబీ అధికారులు వెల్లడించారు.

Also Read: Punjab Congress Crisis: 'కాంగ్రెస్ దీన స్థితిలో ఉంది.. ఆ ఆరోపణలు బాధాకరం'

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Published at : 03 Oct 2021 04:34 PM (IST) Tags: Drugs Case Shah Rukh Khan NCB SRK aryan khan Rave Party

ఇవి కూడా చూడండి

Komatireddy Wishes Revanth: సీఎంగా రేవంత్​రెడ్డి ఎంపిక, హర్షం వ్యక్తం చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Komatireddy Wishes Revanth: సీఎంగా రేవంత్​రెడ్డి ఎంపిక, హర్షం వ్యక్తం చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Roja Dance in Rain: జోరు వానలో మంత్రి రోజా ఎంజాయ్, వీడియోలు వైరల్ - ఏకిపారేస్తున్న నెటిజన్లు!

Roja Dance in Rain: జోరు వానలో మంత్రి రోజా ఎంజాయ్, వీడియోలు వైరల్ - ఏకిపారేస్తున్న నెటిజన్లు!

AP Fibernet Scam: ఏపీ ఫైబర్ నెట్ స్కామ్‌లో డీఆర్ఐ కొరడా! వారిపై రూ.34 కోట్ల పెనాల్టీ

AP Fibernet Scam: ఏపీ ఫైబర్ నెట్ స్కామ్‌లో డీఆర్ఐ కొరడా! వారిపై రూ.34 కోట్ల పెనాల్టీ

ABP Desam Top 10, 5 December 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 5 December 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Revanth Reddy: తెలంగాణను ఏలుతున్న ఫ్యామిలీని ముంచేసిన సునామీ రేవంత్ రెడ్డి!

Revanth Reddy: తెలంగాణను ఏలుతున్న ఫ్యామిలీని ముంచేసిన సునామీ రేవంత్ రెడ్డి!

టాప్ స్టోరీస్

Revanth Reddy Political Career: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిది- వివాదాలు, కేసులతోనూ సంచలనమే!

Revanth Reddy Political Career: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిది- వివాదాలు, కేసులతోనూ సంచలనమే!

Sandeep Reddy Vanga: వర్మ ‘యానిమల్’ రివ్యూపై స్పందించిన సందీప్ - కొన్ని విషయాలు పక్కన పెట్టాల్సిందే!

Sandeep Reddy Vanga: వర్మ ‘యానిమల్’ రివ్యూపై స్పందించిన సందీప్ - కొన్ని విషయాలు పక్కన పెట్టాల్సిందే!

Chandrababu: 'తుపాను అప్రమత్తతలో ప్రభుత్వం విఫలం' - బాధితులకు సహాయం అందించాలని శ్రేణులకు చంద్రబాబు పిలుపు

Chandrababu: 'తుపాను అప్రమత్తతలో ప్రభుత్వం విఫలం' - బాధితులకు సహాయం అందించాలని శ్రేణులకు చంద్రబాబు పిలుపు

Telangana Congress : తెలంగాణ నుంచి కాంగ్రెస్‌కు ఎంపీలు జీరో - ముగ్గురూ రాజీనామా చేయక తప్పదా ?

Telangana Congress : తెలంగాణ నుంచి కాంగ్రెస్‌కు ఎంపీలు జీరో -  ముగ్గురూ రాజీనామా చేయక తప్పదా ?
×