Salman Khan Visits Mannat: ఆర్యన్ ఖాన్ అరెస్ట్.. షారుఖ్ ఇంటికి చేరుకున్న సల్మాన్ ఖాన్..
క్రూజ్ షిప్ లో రేవ్ పార్టీ వ్యవహారంలో ఆర్యన్ ను అరెస్ట్ చేసిన విషయం తెలుసుకున్న సల్మాన్.. షారుఖ్ తో మాట్లాడడానికి ఆయన ఇంటికి వెళ్లినట్లు ఉన్నారు.
![Salman Khan Visits Mannat: ఆర్యన్ ఖాన్ అరెస్ట్.. షారుఖ్ ఇంటికి చేరుకున్న సల్మాన్ ఖాన్.. Salman Khan spotted entering Shah Rukh Khan residence mannat after son Aryan khan arrested Salman Khan Visits Mannat: ఆర్యన్ ఖాన్ అరెస్ట్.. షారుఖ్ ఇంటికి చేరుకున్న సల్మాన్ ఖాన్..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/03/9d9c9269a21a31dbc8fb6af7f48fc41b_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ముంబయి రేవ్ పార్టీలో పట్టుబడిన వారిలో బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఉన్నాడని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో స్పష్టం చేసింది. ఆర్యన్ ఖాన్ సహా అర్బజ్ మర్చంట్, మన్‌మన్ ధమేచలను రేపటి వరకు ఎన్‌సీబీ కస్టడీలో తీసుకుంది. ఈ పార్టీలో అదుపులోకి తీసుకున్న ఎనిమిది మంది వివరాలను ఎన్సీబీ వెల్లడించింది. అదుపులోకి తీసుకున్న ఎనిమిది మందిలో ముగ్గురికి మెడికల్ టెస్టులు నిర్వహించింది ఎన్‌సీబీ. వీరిలో ఆర్యన్ ఖాన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసుల అదుపులో ఉన్న తనయుడి కోసం షారూక్ భార్య గౌరీ ఎన్సీబీ ఆఫీసుకు వెళ్లిన సంగతి తెలిసిందే.
Also Read:ఎవరీ ఆర్యన్ ఖాన్.. మార్షల్ ఆర్ట్స్ నుంచి డ్రగ్స్ కేసు వరకు.. స్టార్ కిడ్ ఆసక్తికర విషయాలు
ఇదిలా ఉండగా.. ఆదివారం రాత్రి షారుఖ్ ఖాన్ మన్నత్ బంగ్లాకు చేరుకున్నారు స్టార్ హీరో సల్మాన్ ఖాన్. క్రూజ్ షిప్ లో రేవ్ పార్టీ వ్యవహారంలో ఆర్యన్ ను అరెస్ట్ చేసిన విషయం తెలుసుకున్న సల్మాన్.. షారుఖ్ తో మాట్లాడడానికి ఆయన ఇంటికి వెళ్లినట్లు ఉన్నారు. మన్నత్ కి చేరుకున్న సమయంలో సల్మాన్ ఫోటోలను క్లిక్ మనిపించారు ఫోటోగ్రాఫర్లు. తన రేంజ్ రోవర్ కార్ లో షారుఖ్ ఇంటికి చేరుకున్న సల్మాన్ మీడియా వాళ్లను పలకరించారు.
బాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారాలు కొత్తేమీ కాదు. అయితే ఇంతకాలం చిన్న నటీనటులు మాత్రమే ఇలాంటి వ్యవహారాలలో పట్టుబడ్డారు. అయితే ఇప్పుడు బాలీవుడ్ బాద్ షా కుమారుడు డ్రగ్స్ వ్యవహారంలో దొరకడం సంచలనమని చెప్పొచ్చు. రేపోమాపో కొడుకుని ఇండస్ట్రీకి తీసుకురావాలనుకున్న షారుఖ్ కి ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి.
View this post on Instagram
Also Read: డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ కుమారుడు అరెస్ట్.. సోమవారం వరకు ఎన్‌సీబీ కస్టడీలోనే!
Also Read: సముద్రం మధ్యన షిప్‌లో సోదాలు ఎలా? అధికారులు అమలు చేసిన పక్కా ప్లాన్ ఏంటంటే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)