News
News
వీడియోలు ఆటలు
X

Bigg Boss 5 Telugu: ప్రియా సేఫ్.. లహరి ఔట్.. వెళ్తూ వెళ్తూ షణ్ముఖ్ తో ఫైట్..

బిగ్ బాస్ సీజన్ 5 మూడో వారం పూర్తి చేసుకోబోతుంది.

FOLLOW US: 
Share:

బిగ్ బాస్ సీజన్ 5 మూడో వారం పూర్తి చేసుకోబోతుంది. శనివారం ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున హౌస్ మేట్స్ అందరిపై సీరియస్ అయ్యారు. ఇక ఆదివారం ఎపిసోడ్ లో మాత్రం అందరితో ఫన్ చేశారు. ముందుగా.. హౌస్ మేట్స్ ని రెండు గ్రూప్ లుగా విడగొట్టి వారితో గేమ్ ఆడించారు నాగ్. ముందుగా హమీదను చూస్తూ.. 'లుకింగ్ హాట్ బేబీ' అని నాగ్ అనగా.. 'టెల్ మి సమ్‌థింగ్‌ న్యూ' అంటూ నాగ్ కి ఫన్నీ రిప్లై ఇచ్చింది హమీద. గేమ్ మధ్యలో 'ఈ బాయ్స్‌ అండ్‌ గర్ల్స్‌ విడివిడి ఉండడం నచ్చడంలేదని' నాగ్‌ అంటే.. 'మాక్కూడా ఇష్టంలేదు' అంటూ సిరి సెటైర్‌ వేసింది. 

ఆ తరువాత నాగార్జున ఇచ్చిన టాస్క్ కి.. సిరి-శ్రీరామ్ కలిసి 'బుట్టబొమ్మ' సాంగ్ కి డాన్స్ చేశారు. జెస్సీ-హమీద కలిసి 'చిట్టి నీ నవ్వంటే' సాంగ్ కి డాన్స్ చేశారు. విశ్వ-యానీ మాస్టర్ కలిసి 'ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ ఫీలింగ్' సాంగ్ కి డాన్స్ చేశారు. ప్రియాంక-మానస్ కలిసి 'జిలేలమ్మ జిట్టా' సాంగ్ కి పెర్ఫార్మ్ చేశారు. కాజల్.. షణ్ముఖ్ తో కలిసి 'నీ కన్ను నీలి సముద్రం' సాంగ్ కి డాన్స్ చేసింది. ఆ తరువాత షణ్ముఖ్-నటరాజ్ కలిసి 'ఓ మై గాడ్ డాడీ' సాంగ్ కి డాన్స్ చేశారు. నటరాజ్-యానీ మాస్టర్ 'ప్రియరాగాలే' అనే రొమాంటిక్ సాంగ్ కి మాస్ స్టెప్స్ వేశారు. 

మానస్ సేఫ్: ఈ వారం ఎలిమినేషన్ లో ఉన్న ఐదుగురిలో నిన్నటి ఎపిసోడ్ లో శ్రీరామ్, ప్రియాంకలను సేవ్ చేశారు. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ముందుగా మానస్ ను సేవ్ చేసి.. ప్రియా-లహరి డేంజర్ జోన్ లో ఉన్నట్లు చెప్పారు. 

టచ్ చెయ్.. గెస్ చెయ్..

హౌస్ మేట్స్ తో టచ్ చెయ్-గెస్ చెయ్ అనే ఫన్నీ టాస్క్ ఆడించారు నాగార్జున. ఇందులో ఇద్దరు హౌస్ మేట్స్ చొప్పున గేమ్ ఆడించారు. ఇద్దరూ కళ్లకు గంతలు కట్టుకొని ఉండాలి. స్టోర్ రూమ్ నుంచి తీసుకొచ్చిన వస్తువుని ఒక హౌస్ మేట్ టచ్ చేసి ఆ వస్తువేంటో వేరే హౌస్ కి ఎక్స్ ప్లైన్ చేయాలి. అతడు కరెక్ట్ గా చెప్తే మార్క్స్ వస్తాయి. ఈ టాస్క్ లో హౌస్ మేట్స్ కొందరు గెస్ట్ చేయలేక ఇబ్బంది పడుతూ నవ్వించారు. 

లహరి ఔట్: నామినేషన్స్ లో చివరివరకు ప్రియా-లహరిలను ఉంచి టెన్షన్ పెట్టారు నాగ్. స్టేజ్ పై ఉన్న నాగార్జున రెడ్ కలర్ లో ఉన్న రెండు టార్చ్ లైట్ లను పట్టుకున్నారు. వాటిపై లహరి, ప్రియాల పేర్లు రాసి ఉన్నాయి. ఎవరి టార్చ్ లైట్ అయితే గ్రీన్ కలర్ లోకి వస్తుందో వాళ్లు సేఫ్ అని చెప్పగా.. ప్రియా టార్చ్ లైట్ గ్రీన్ కలర్ లోకి వచ్చింది. దీంతో ఆమె సేఫ్ అయింది. అందరూ ఊహించినట్లుగానే ఈసారి లహరి ఎలిమినేట్ అయింది. దీంతో హౌస్ మేట్స్ అంతా ఒక్కసారిగా షాకయ్యారు. శ్వేతా.. లహరి పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చేసింది. హౌస్ నుంచి స్టేజ్ పైకి వెళ్లే సమయంలో లహరి.. షణ్ముఖ్ తో 'ఒకరు చేశారని నామినేట్ చేయకూడదు.. ఇది నేను స్టేజ్ పై చెప్పను' అంటూ కామెంట్ చేసింది. 
లహరి హౌస్ నుంచి వెళ్లిపోయిన తరువాత ఆమె షణ్ముఖ్ తో చేసిన కామెంట్స్ కరెక్ట్ కాదని.. సిరి.. రవితో చెప్పింది. 'అందరూ ఒకటే పాట పాడుతున్నారని.. అసలు మేమిద్దరం కూర్చొని మాట్లాడుకున్నది కూడా తక్కువే' అంటూ షణ్ముఖ్ గురించి సిరి చెప్పింది. 

స్టేజ్ పైకి వెళ్లిన లహరి.. ముందుగా సిరిని ఉద్దేశిస్తూ ఆమెకి కొంచెం ఇన్ సెక్యూరిటీ ఫీలింగ్ ఉందని చెప్పింది. యానీ మాస్టర్ చాలా స్వీట్ అని కానీ.. ఆమెతో ఎక్కువ ట్రావెల్ చేయలేకపోయానని చెప్పింది. 'కెమెరాస్ చాలా ఉన్నాయ్.. బీ కేర్ ఫుల్ బ్రో' అంటూ రవిని ఉద్దేశిస్తూ చెప్పింది. 'నీ గురించి నువ్ ఆలోచించుకో' అని శ్రీరామ్ కి చెప్పింది. 'బీ స్ట్రాంగ్' అని విశ్వకి సలహా ఇచ్చింది. 'నీ ఈక్వేషన్ మారిపోయింది' అని లోబోని ఉద్దేశిస్తూ అంది. నటరాజ్ మాస్టర్ కి ఏం తెలియదని.. భోళా శంకరుడు అని కామెంట్ చేసింది. శ్వేతాని ఉద్దేశిస్తూ స్ట్రాంగ్ గా ఉండు అని చెప్పింది. మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించుకో.. అంటూ కాజల్ కి సలహా ఇచ్చింది. సిరి వేసేసిందని నువ్ వేసేశావ్.. ఇదేంట్రా అని షణ్ముఖ్ ని ప్రశ్నించింది. తను వేసిందని నేను వేయలేదని.. నువ్ తప్పుగా ఆలోచిస్తున్నావు అంటూ లహరికి చెప్పాడు షణ్ముఖ్. జెస్సీ తమ్ముడు లాంటి వాడని చెప్పింది లహరి. సన్నీ షార్ప్ అని అనుకుంటాడు కానీ కాదని తన అభిప్రాయం చెప్పింది. మానస్ గురించి పూర్తిగా తెలుసుకునేలోపు బయటకు వచ్చేశానని తెలిపింది. ప్రియాంక చాలా స్వీట్ అని.. హమీద సూపర్ స్ట్రాంగ్ అని చెప్పింది. 

 
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 
Published at : 26 Sep 2021 09:57 PM (IST) Tags: Bigg Boss 5 Telugu Bigg Boss 5 Swetha Lahari lahari elimination

సంబంధిత కథనాలు

Karate Kalyani: కరాటే కళ్యాణి 'మా' మెంబర్షిప్ క్యాన్సిల్ - కావాలనే చేశారంటూ నటి ఆగ్రహం

Karate Kalyani: కరాటే కళ్యాణి 'మా' మెంబర్షిప్ క్యాన్సిల్ - కావాలనే చేశారంటూ నటి ఆగ్రహం

Shanmukh Jaswanth New Web Series : 'శివ'గా షణ్ముఖ్ జస్వంత్ - కొత్త సిరీస్ 'స్టూడెంట్' షురూ, లుక్ చూశారా?

Shanmukh Jaswanth New Web Series : 'శివ'గా షణ్ముఖ్ జస్వంత్ - కొత్త సిరీస్ 'స్టూడెంట్' షురూ, లుక్ చూశారా?

ఛీ, యాక్ - నమిలేసిన చూయింగ్ గమ్స్‌తో డ్రెస్, ఫ్యాషన్ ఉసురు తీస్తున్న ఉర్ఫీ!

ఛీ, యాక్ - నమిలేసిన చూయింగ్ గమ్స్‌తో డ్రెస్, ఫ్యాషన్ ఉసురు తీస్తున్న ఉర్ఫీ!

Uorfi Javed: రెస్టారెంట్ లోకి అనుమతించని సిబ్బంది, నేనెవరో తెలుసా అంటూ ఉర్ఫీ జావేద్ రచ్చ

Uorfi Javed: రెస్టారెంట్ లోకి అనుమతించని సిబ్బంది,  నేనెవరో తెలుసా అంటూ ఉర్ఫీ జావేద్ రచ్చ

రణ్‌బీర్ ‘గో టు హెల్’ - ‘బ్యాడ్ టేస్ట్’ కామెంట్స్‌పై ఉర్ఫీ ఫైర్

రణ్‌బీర్ ‘గో టు హెల్’ - ‘బ్యాడ్ టేస్ట్’ కామెంట్స్‌పై ఉర్ఫీ ఫైర్

టాప్ స్టోరీస్

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

YS Viveka Case : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !

YS Viveka Case  : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !