అన్వేషించండి
Advertisement
Prabhas: 'ఆదిపురుష్' సెట్స్ లో ప్రభాస్.. వైరలవుతోన్న లుక్..
వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తోన్న ప్రభాస్ ప్రస్తుతం 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్', 'సలార్' సినిమాల్లో నటిస్తున్నారు.
వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తోన్న ప్రభాస్ ప్రస్తుతం 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్', 'సలార్' సినిమాల్లో నటిస్తున్నారు. దీని తరువాత 'ప్రాజెక్ట్ కె' కూడా లైన్లో ఉంది. ఇప్పటికే ఓవైపు సలార్, మరోవైపు ఆదిపురుష్ సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. ఇటీవలే 'సలార్'కు సంబంధించిన కీలకమైన షెడ్యూల్ ను పూర్తి చేశారు ప్రభాస్. ఇప్పుడు గ్యాప్ తీసుకోకుండా 'ఆదిపురుష్' సినిమాకు సంబంధించిన యాక్షన్ షెడ్యూల్ ను ప్రారంభించారు. తాజాగా ఈ సినిమాలో సెట్ లో ప్రభాస్ ఫోటో ఒకటి బయటకొచ్చింది.
Also Read: మోహన్ బాబు గారూ.. వైఎస్ కుటుంబీకులు మీ బంధువులే కదా.. కావాలంటే నన్ను బ్యాన్ చేసుకోమని చెప్పండి
ఇందులో ప్రభాస్ సింపుల్ అండ్ స్టైలిష్ లుక్ తో కనిపిస్తున్నాడు. ఈ ఫోటో చూసిన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మొన్నామధ్య ప్రభాస్ లుక్ పై ట్రోల్స్ బాగా పడ్డాయి. అసలు తన లుక్ పై ప్రభాస్ దృష్టి పెట్టడం లేదంటూ అతడికి టార్గెట్ చేశారు. కానీ ఈసారి ప్రభాస్ ఎప్పటిలానే స్టైలిష్ గా కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషీ అయిపోయారు. ఇక 'ఆదిపురుష్' సినిమా విషయానికొస్తే.. ఇందులో కొన్ని యాక్షన్ సన్నివేశాలలో ప్రభాస్ డూప్ హెల్ప్ తీసుకోకుండా స్వయంగా తనే చేయాలనుకుంటున్నాడట. దానికోసం బాగా ప్రాక్టీస్ చేస్తున్నాడని సమాచారం.
అక్టోబర్ వరకు ఎలాంటి గ్యాప్ లేకుండా ఈ షెడ్యూల్ ను ప్లాన్ చేశారట. రామాయణం ఆధారంగా దర్శకుడు ఓంరౌత్ 'ఆదిపురుష్' సినిమాను చిత్రీకరిస్తున్నాడు. ఇందులో రాముడిగా ప్రభాస్ నటిస్తుంటే, రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. సీత పాత్రలో కృతిసనన్ నటించనుంది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ ఐదు భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్ట్ 11న ఈ సినిమాను విడుదల చేస్తామని యూనిట్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
Latest click of a handsome #Prabhas from the sets of #Adipurush. pic.twitter.com/S8Cc0SGmfi
— Manobala Vijayabalan (@ManobalaV) September 26, 2021
Also Read: పవన్ కళ్యాణ్‌కు మోహన్ బాబు కౌంటర్.. నువ్వు నాకంటే చిన్నవాడివి..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
హైదరాబాద్
రాజమండ్రి
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion