Mohan Babu: పవన్ కళ్యాణ్‌కు మోహన్ బాబు కౌంటర్.. నువ్వు నాకంటే చిన్నవాడివి..
పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మోహన్ బాబు స్పందించారు. ‘మా’ ఎన్నికల తర్వాత అన్నింటికీ సమాధానం చెబుతానని వెల్లడి.
సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘రిపబ్లిక్’ సినిమా ప్రీ-రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఏపీ ప్రభుత్వ విధానాలపై మండిపడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పవన్.. నటుడు మోహన్ బాబు మీద కూడా వ్యాఖ్యలు చేశారు. ‘‘వైఎస్సార్ కుటుంబికులు మీ బంధువులే కదా.. చిత్ర పరిశ్రమను హింసించొద్దని చెప్పండి’’ అని పవన్ సభలో పేర్కొన్నారు.
దీనిపై మోహన్ బాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘నా చిరకాల మిత్రుని సోదరుడైన పవన్ కళ్యాణ్ నువ్వు నాకంటే చిన్నవాడివి. అందుకని ఏకవచనంతో సంబోధించాను. పవన్ కళ్యాణ్ గారు అనడంలో కూడా తప్పేమీ లేదు. చాలా కాలానికి నన్ను మెల్లగా లాగావ్. సంతోషమే. ఇప్పుడు ‘మా’ ఎన్నికలు జరుగుతున్నాయి. నా కుమారుడు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా నిలబడ్డాడ అన్న సంగతి నీకు తెలిసిందే. అక్టోబరు 10వ తేదీన ఎన్నికలు అయిపోతాయి. ఆ తర్వాత నువ్వు అడిగిన ప్రతి మాటకి నేను హృదయపూర్వకంగా సమాధానం చెబుతాను. ఈలోగా నువ్వు చేయవలసిన ముఖ్యమైన పని.. నీ అమూల్యమైన ఓటుని నీ సోదర సమానుడైన విష్ణుబాబుకు, అతని ప్యానెల్‌కి వేసి.. వాళ్లని గెలిపించాలని కోరుకుంటున్నాను. థాంక్యూ వేరీమచ్’’ అని మోహన్ బాబు పేర్కొన్నారు.
To My Dear @PawanKalyan pic.twitter.com/xj1azU3v8B
— Mohan Babu M (@themohanbabu) September 26, 2021
వైఎస్ కుటుంబానికి, మోహన్ బాబు కుటుంబానికి ఉన్న సన్నిహిత్యంపైనా పవన్ మాట్లాడుతూ.. ‘‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చిత్ర పరిశ్రమ పట్ల ఉన్న వైఖరిపై మోహన్ బాబు స్పందించాలి. వైఎస్ఆర్ కుటుంబీకులు మీ బంధువులు కదా.. చిత్ర పరిశ్రమను హింసించొద్దని చెప్పండి. కావాలంటే పవన్ కల్యాణ్‌ను బ్యాన్ చేసుకోండి. అతను, మీరూ తేల్చుకోండి. కానీ చిత్రపరిశ్రమ జోలికి మాత్రం రావొద్దు అని మీరు వైసీపీ పెద్దలకు చెప్పండి. మీరు మాజీ ఎంపీ కూడా. ఈ అంశంపై మాట్లాడాల్సిన నైతిక బాధ్యత మీపై ఉంది. ఎందుకంటే.. ఇవాళ చిత్రపరిశ్రమకు అమలు చేసిన చేసిన రూల్స్.. రేపటి రోజున మీ విద్యానికేతన్ స్కూళ్లకు కూడా అప్లై చేయొచ్చు. నా వరకు రాలేదు కదా? అని గమ్మునుండటం సరికాదు. ఈ చర్యలు రేపటి రోజున అది మీకు కూడా సమస్యగా మారొచ్చు. అప్పుడు మీరూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఈ విషయాన్ని గుర్తుంచుకోని స్పందించండి’’ అని మోహన్ బాబుపై పవన్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు.. ‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్‌కు మెగా ఫ్యామిలీ అండదండలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ వ్యాఖ్యలు మంచు కుటుంబాన్ని ఆలోచనలో పడేసినట్లు తెలుస్తోంది.
Also Read: ‘ఫ్యామిలీ మ్యాన్’ టీమ్‌లోకి రెజీనా, రాశీ ఖన్నా.. బోల్డ్ సీన్లతో పిచ్చెక్కిస్తారట!
Also Read: మోహన్ బాబు గారూ.. వైఎస్ కుటుంబీకులు మీ బంధువులే కదా.. కావాలంటే నన్ను బ్యాన్ చేసుకోమని చెప్పండి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి