అన్వేషించండి

‘ఫ్యామిలీ మ్యాన్’ టీమ్‌లోకి రెజీనా, రాశీ ఖన్నా.. బోల్డ్‌ సీన్లతో పిచ్చెక్కిస్తారట!

తమన్నా, కాజల్ బాటలోనే రాశీ ఖాన్నా, రెజినా నడుస్తున్నారు. త్వరలో వెబ్ సీరిస్‌ల్లో బోల్డ్‌ అవతారంలో ఆకట్టుకొనేందుకు వచ్చేస్తున్నారు.

‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సీరిస్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. ఈ హిందీ వెబ్‌సీరిస్‌లో టాలీవుడ్ తారలకు కూడా ప్రాధాన్యం ఇవ్వడం వల్ల దక్షిణాదిలో కూడా అభిమానులు పెరిగారు. ఇందులో ప్రియమణి కీలక పాత్ర పోషిస్తూ.. ఇప్పటికే మంచి పేరు కొట్టేసింది. రెండో సీజన్‌లో సమంత విభిన్న పాత్రలో ఉత్తరాది ప్రేక్షకులను ఆకట్టుకుంది. బోల్డ్ సీన్లతోనూ సామ్ ప్రేక్షకులను నోరు వెళ్లబెట్టేలా చేసింది. 

ఈ వెబ్ సీరిస్‌కు దర్శకత్వం వహించిన రాజ్ అండ్ డీకేలకు ఇప్పుడు భారీ డిమాండ్ పెరిగింది. ఈ సందర్భంగా వీరు పలు ఓటీటీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా బాలీవుడ్ హీరో షహీద్ కపూర్ హీరోగా ఓ వెబ్‌ సీరిస్‌ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ నటి రాశీ ఖన్నా నటించనుంది. ఇక వెబ్‌సీరిస్ అంటే బోల్డ్ సీన్లు ఏ స్థాయిలో ఉంటాయో తెలిసిందే. ఈ నేపథ్యంలో రాశీ ఖాన్నా అభిమానులు ఈ సిరీస్ గురించి వేయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం రాశీ ఖన్నా తమిళ, మలయాళం చిత్రాల షూటింగుల్లో బిజీగా గడిపేస్తోంది. 

‘అంధదూన్’ రీమేక్‌గా తెలుగులో ‘మాస్ట్రో’ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇందులో నితిన్, నభా నటేష్, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. ఇదే సినిమాను మలయాళంలో కూడా తెరకెక్కించారు. రవి కె.చంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించాడు. కథానాయికగా రాశి ఖన్నా నటించింది. తెలుగులో తమన్నా పోషించిన పాత్రలో మమ‌తా మోహ‌న్ దాస్ నటిస్తోంది.ఈ చిత్రం అక్టోబ‌ర్ 7 నుంచి నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుంది.

Also Read: సినిమాలు ఆపేస్తే కాళ్ల దగ్గరకు వస్తాం అనుకుంటున్నారు.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ స్పీచ్.. 

మరోవైపు.. రెజినా కూడా వెబ్‌సీరిస్‌ల వైపు దృష్టిపెట్టింది. టాలీవుడ్‌లో అవకాశాలు సన్నగిల్లిని నేపథ్యంలో వెబ్‌సీరిస్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరవ్వాలనే ప్లాన్ చేసుకుంది. ఈ సందర్భంగా ఆమెకు రాజ్ అండ్ డీకేలు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ లేడీ ఓరియెంటెడ్ వెబ్ సీరిస్‌లో బోల్డ్ సీన్లు కూడా దండిగా ఉంటాయని తెలిసింది. ఆ పాత్రకు రెజీనా సరిపోతుందని, దీనివల్ల దక్షిణాదిలో కూడా వ్యూవర్స్‌ను పెంచుకోవచ్చనేది దర్శకుల ప్లాన్. ప్రస్తుతం రెజీనా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ‘నేనే.. నా’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే కాజల్, తమన్నాలు ఓటీటీలో తమ లక్ పరీక్షించుకున్నారు. మరి, రాశీ ఖన్నా, రెజినాల సీరిస్‌లను ప్రేక్షకులు ఆధరిస్తారో లేదో చూడాలి. 

Also Read: సాయిపల్లవిలాంటి డ్యాన్సర్ ను ఎప్పుడూ చూడలేదు.. ట్వీట్ లో మహేష్ ప్రశంసలు, చైతూ రెస్పాన్స్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 18th: రాధ బెదిరింపులకు కూడా లొంగని సుందరి...గురూజీని అడ్డంపెట్టుకుని దొంగచిట్టి నాటకం
నువ్వులేక నేను లేను: రాధ బెదిరింపులకు కూడా లొంగని సుందరి...గురూజీని అడ్డంపెట్టుకుని దొంగచిట్టి నాటకం
Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Balakrishna Koratala Siva Movie: కొరటాలతో బాలకృష్ణ సినిమా ఆగిందా? యూనిట్ ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే?
కొరటాలతో బాలకృష్ణ సినిమా ఆగిందా? యూనిట్ ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Embed widget