Mahesh Babu: సాయిపల్లవిలాంటి డ్యాన్సర్ ను ఎప్పుడూ చూడలేదు... ట్వీట్ లో మహేష్ ప్రశంసలు, చైతూ రెస్పాన్స్
లవ్ స్టోరీ సినిమాపై ప్రిన్స్ మహేష్ బాబు ప్రశంసలు కురిపించారు. ట్విట్టర్ వేదికగా సాయిపల్లవిని ప్రత్యేకంగా మెచ్చుకున్నారు.
దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన సున్నిత ప్రేమకధా చిత్రం ‘లవ్ స్టోరీ’. సినిమా విడుదలవ్వడానికి ముందే భారీ అంచనాలను మూటగట్టుకుంది. ఆ అంచనాల స్థాయిలోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది లవ్ స్టోరీ. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా తొలిసారి చేసిన ఈ సినిమాలో వారిద్దరి కెమిస్ట్రీ బాగా పండింది. ఈ సినిమా చూసిన సామాన్య ప్రజలతో పాటూ సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు సినిమాను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.
డైరెక్టర్ శేఖర్ కమ్ములను ఉద్దేశించి అన్నికోణాలను ఆవిష్కరించారు, అద్భుతమైన సినిమాను తెరకెక్కించారంటూ మెచ్చుకున్నారు. హీరో నాగచైతన్యకు ఈ సినిమా తప్పకుండా మంచి మలుపు అవుతుందని, అద్బుతంగా నటించాడని మెచ్చుకున్నారు. సాయిపల్లవిని మాత్రం ప్రత్యేకంగా ప్రశంసించారు. ‘ఎప్పటిలాగే ఆమె సెన్షేషనల్, ఈమెకు శరీరంలో ఎముకలున్నాయా అసలు? ఇలా డ్యాన్స్ చేసే వారిని వెండితెరపై నేనింత వరకు చూడలేదు’ అంటూ ప్రత్యేకంగా మెచ్చుకున్నారు.
సంగీత దర్శకుడు పవన్ చక్కటి సంగీతాన్ని అందించాడని, అతడు ఏఆర్ రెహమాన్ శిష్యుడని తెలిసిందని, రెహమాన్ సర్ మీ శిష్యుడిని చూసి మీరు గర్వించాలి అంటూ ట్వీట్ చేశారు. ప్రొడ్యూసర్లకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు మహేష్ బాబు. ఒక సినిమాను ఉద్దేశించి ప్రిన్స్ ఇంతగా మెచ్చుకోవడం లవ్ స్టోరీ టీమ్ కు ఆనందాన్ని మెచ్చింది. ఆయన ట్వీట్ కు హీరో నాగచైతన్య స్పందించారు. మీకు మా సినిమా నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది అని ట్వీట్ చేశారు.
ఫిదా తరువాత మళ్లీ తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన సినిమా లవ్ స్టోరీ. తెలంగాణ యాసతో హీరోహీరోయిన్లు మాట్లాడుకునే తీరే ప్రేక్షకులను ఆకట్టుకుంది. సెప్టెంబర్ 24న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను బాగానే రప్పిస్తోంది. సాయిపల్లవితో పోటీగా చైతూ కూడా డ్యాన్సులు ఇరగదీశారు.
#LoveStory @sekharkammula pulls all the right strings... delivers a knockout film!! @chay_akkineni comes of age as an actor, a game-changer for him... What a performance!! 👏👏👏
— Mahesh Babu (@urstrulyMahesh) September 25, 2021
Thank you so much !! Glad you liked it .. means a lot https://t.co/cUNHVQevaQ
— chaitanya akkineni (@chay_akkineni) September 26, 2021
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
Also read: మీకోసం బెస్ట్ ఫుడ్ ప్లాన్.. సూచిస్తున్నది ఓ బాలీవుడ్ సెలెబ్రిటీ న్యూట్రిషనిస్టు
Also read: ‘వరుడు కావలెను’ థియేటర్లోకి వచ్చేది ఎప్పుడంటే...
Also read: చిరు- నాగ్ ల కాంబోలో విక్రమ్ వేద రీమేక్? వైరలవుతున్న ఫ్యాన్ మేడ్ పోస్టర్