Vikram Veda Remake: చిరు- నాగ్ ల కాంబోలో విక్రమ్ వేద రీమేక్? వైరలవుతున్న ఫ్యాన్ మేడ్ పోస్టర్
టాలీవుడ్లో స్టార్ హీరోలు చిరంజీవి - నాగార్జున. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే కచ్చితంగా క్రేజీయే.
మల్టీస్టారర్ అంటేనే మినిమం గ్యారంటీ సినిమా. అలాంటిది క్రేజీ హీరోలు కలిసి స్క్రీన్ పై కనిపిస్తే అభిమానుల హంగామా మామూలుగా ఉండదు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి ఆర్ఆర్ఆర్ లో తొలిసారి నటిస్తున్నారు. ఆ సినిమాపై అంచనాలు భారీగా ఉండడంతో మల్టీస్టారర్ మూవీలకు మరింత విలువ పెరిగింది. చాలా మంది హీరోలు వేరే హీరోతో స్క్రీన్ పంచుకునేందుకు సిద్ధపడుతున్నారు. త్వరలో టాలీవుడ్ మన్మధుడు, మెగా స్టార్ కూడా కలిసి స్క్రీన్ పై కనిపించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. టాప్ హీరోలుగా కొనసాగుతున్న నాగార్జున, చిరంజీవి కలిసి ఇంతవరకు ఒక్కసినిమా కూడా చేయలేదు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే అభిమానులకు పండగే. ఈ వార్తకు సంబంధించి ఇప్పటి వరకు ఎక్కడ అధికారికంగా ప్రకటన రాకపోయినప్పటికీ వారి అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో పోస్టర్లు తయారు చేసి వైరల్ చేస్తున్నారు.
తమిళంలో సూపర్ హిట్ మూవీ ‘విక్రమ్ వేద’. దీన్ని తెలుగులో రీమేక్ చేయాలని ఎప్పట్నించో ప్రయత్నాలు జరుగుతున్నాయి. తమిళంలో విక్రమ్ గా మాధవన్, వేద గా విజయ్ సేతుపతి నటించారు. విక్రమ్ వేద మూవీ చిరు-నాగ్ కాంబినేషన్లో రావాలని వారి అభిమానుల కోరిక. ఇదే నిజమైతే ఆ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుంది. ప్రస్తుతం చిరు, నాగ్ ఇద్దరూ చేతినిండా సినిమాలో బిజీగా ఉన్నారు కనుక, అభిమానుల కోరిక నిజమవ్వడం కష్టమే అని అంచనా వేస్తున్నారు సినీ విమర్శకులు.
చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాతో పాటూ, మళయాళం రీమేక్ లూసిఫర్ లో కూడా నటిస్తున్నారు. దీన్ని తెలుగులో ‘గాడ్ ఫాదర్’ పేరుతో తెరకెక్కిస్తున్నారు. మరో తమిళ సినిమా వేదాళం రీమేక్ ‘భోళా శంకర్’ లో కూడా చేస్తున్నారు. నాగార్జున కళ్యాణ్ క్రిష్ణ దర్శకత్వంలో ‘బంగార్రాజు’ సినిమాతో పాటూ, ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేస్తున్న ‘ద ఘోస్ట్’ లో కూడా నటిస్తున్నారు.
విక్రమ్ వేద సినిమా హిందీ రీమేక్ లో సైఫ్ అలీఖాన్, హ్రుతిక్ రోషన్ నటిస్తున్నారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్ చేయండి
Also read: జపాన్ వారి సోబా నూడిల్స్ ట్రై చేశారా... ఎంత రుచో, అంత ఆరోగ్యం కూడా
Also read: లగ్జరీ ద్రాక్ష.. ఒక్క పండు తినాలంటే రూ.35,000 ఖర్చుపెట్టాలి
Also read: గుడ్డులోని పచ్చసొన తింటే బరువు పెరుగుతారని తినకుండా పడేస్తున్నారా? ఆరోగ్యనిపుణులు ఏమంటున్నారు?