అన్వేషించండి

Bigg Boss 5 Telugu: 'నాకొద్దు బాబోయ్ నీ హగ్'.. సిరికి దండం పెట్టిన షణ్ముఖ్.. ఈ వారం సన్నీ సేఫ్.. 

ఈరోజు నామినేషన్స్ మొత్తం ఐదుగురు కంటెస్టెంట్ ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి నామినేట్ అయ్యారు. 

రవి ఎలిమినేట్ అవ్వడం పెద్ద షాక్ అని హౌస్ మేట్స్ మాట్లాడుకున్నారు. రవి హౌస్ లో జెన్యూన్ గా లేడని.. అందరితో గొడవ పెట్టుకుంటే గేమ్ లో ఉంటానని మిస్ కాల్క్యులేషన్ చేశాడని మానస్.. కాజల్ తో అన్నాడు. ప్రియాంకతో తన ట్రాక్ బయటకు ఎలా వెళ్తుందో అర్ధం కావడం లేదని.. బహుశా తన మీద సింపతీతో జనాలు కూడా ఓట్లు వేస్తున్నారేమోనని మానస్ తన ఒపీనియన్ చెప్పాడు. 

ఇక తెల్లవారుజామున.. పింకీ బాగా ఎమోషనల్ అయిపోయింది. ఏది ఉన్నా.. రవి అన్నయ్యతో చెప్పుకునేదాన్ని అని.. ధైర్యంగా ఉండేదని.. సిరితో చెప్పుకుంటూ బాధపడింది. ఆ తరువాత కాజల్-సన్నీ ఇద్దరూ కూర్చొని తమను ఎవరెవరు నామినేట్ చేస్తారో డిస్కస్ చేసుకున్నారు. షణ్ముఖ్ తో ఏదైనా మాట్లాడదామనుకున్నా.. ప్రతీది పెర్సనల్ గా తీసుకుంటాడని సన్నీ కామెంట్ చేశాడు. 

ఇక బెడ్ రూమ్ లో ప్రియాంకతో మాట్లాడాడు షణ్ముఖ్. సన్నీ-మానస్-కాజల్ లు వాళ్లలో ఎవరినీ నామినేట్ చేసుకోరని.. హౌస్ లో వాళ్లు కాకుండా నువ్ మాత్రమే ఉంటే నిన్నే నామినేట్ చేస్తారని ప్రియాంకతో చెప్పాడు షణ్ముఖ్. ఇప్పటివరకు అలా ఆలోచించలేదని చెప్పింది ప్రియాంక. మానస్ వాళ్ల మమ్మీ వచ్చిన తరువాతే అతని బిహేవియర్ లో చేంజ్ వచ్చిందని ప్రియాంకతో చెప్పాడు షణ్ముఖ్. 

కాజల్-సిరి-షణ్ముఖ్-మానస్ సరదాగా.. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడుతుండగా.. 'మా పాప(దీప్తి) నీకంత సీన్ ఇవ్వదని' సిరితో అన్నాడు షణ్ముఖ్. 'అయితే నీ దగ్గరే పెట్టుకో' అని డైలాగ్ కొట్టింది సిరి. వెంటనే షణ్ముఖ్ 'మొన్న స్టేజ్ పై ఉన్నప్పుడు నీ మొహం కూడా చూడలేదు' అంటూ సిరిని ఇన్సల్ట్ చేసినట్లుగా మాట్లాడాడు. దీంతో సిరి అలిగి అక్కడనుంచి వెళ్లిపోయింది. ఎప్పటిలానే షణ్ముఖ్ ఆమె వెనకే వెళ్లి సారీ చెప్పుకున్నాడు. దానికి సిరి షణ్ముఖ్ ని హగ్ చేసుకోవడానికి నుంచోమని చెప్పింది. దానికి షణ్ముఖ్ 'వద్దు మళ్లీ మీ మమ్మీ ఫీల్ అవుతారు. నాకొద్దు బాబోయ్ అంటూ దండం పెట్టాడు'. ఇది ఫ్రెండ్షిప్ హగ్ అంటూ డైలాగ్ కొట్టి అతడిని హగ్ చేసుకుంది సిరి. 

నామినేషన్ ప్రాసెస్: 

నామినేషన్ ప్రక్రియలో భాగంగా బిగ్ బాస్ ఇంటి గేట్స్ ని తెరిచారు. ప్రతి ఇంటి సభ్యుల ముందు వారి ముఖంతో బాల్స్ ఉన్నాయి. ఇంటి సభ్యులందరూ తగిన కారణాలు చెప్పిన తరువాత వారు నామినేట్ చేయాలనుకుంటున్న ఇద్దరు సభ్యుల ముఖం ఉన్న బాల్స్ ను ఇంటి బయటకు కిక్ చేయాల్సి ఉంటుంది.

షణ్ముఖ్ - కాజల్ ని నామినేట్ చేస్తూ 'కమ్యూనిటీ, కాస్ట్, రెలిజియన్ అనేవి సెన్సిటివ్ టాపిక్స్. ఆ పాయింట్ లో అసలు నచ్చలేదు. నువ్ అసలు అక్కడకి రావడం. ఆ స్టేట్మెంట్ ఇవ్వడం రాంగ్' అని చెప్పాడు. 'చాలా ప్లీజింగ్ గా అడిగాను.. బహుశా టైమింగ్ తప్పై ఉండొచ్చు కానీ నేను తప్పు చేయలేదు. నువ్ దాన్ని బ్యాడ్ ఇంటెన్షన్ లో తీసుకున్నావ్' అని కాజల్ చెప్పింది. ఆ తరువాత ప్రియాంకను నామినేట్ చేస్తూ.. 'పాజిటివ్స్ తీసుకున్నంత బాగా నెగెటివ్స్ తీసుకోలేకపోతున్నావని' రీజన్ చెప్పాడు. 

ప్రియాంక - షణ్ముఖ్ నామినేషన్ లో ఉండి ఉంటే అతడినే నామినేట్ చేసేదాన్ని అని చెప్పిన ప్రియాంక.. ఆలోచించడానికి టైమ్ తీసుకుంది. దీంతో బిగ్ బాస్ ప్రియాంకకు వార్నింగ్ ఇచ్చారు. ఆ తరువాత సిరి, కాజల్ ని నామినేట్ చేసింది. 

శ్రీరామ్ - మానస్ ని నామినేట్ చేస్తూ.. 'నేను వెళ్లిపోతే ఫరక్ పడదని అన్నావ్. బేసికల్లీ మానస్ తను అనుకున్నది.. కావాలన్నది అనేస్తాడు. విన్నవాడు ఊరకనే కూర్చోవాలి. నన్ను ప్రవోకింగ్ అంటున్నాడాయన. నన్ను డిస్ రెస్పెక్ట్ చేయడం నాకు నచ్చలేదు' అంటూ రీజన్ చెప్పాడు. ఆ తరువాత కాజల్ ని నామినేట్ చేస్తూ.. 'ఒక్కోసారి ఒక్కోలా ఉంటున్నావ్. కొన్ని సార్లు డిస్ రెస్పెక్ట్ చేశావ్. నేనంటే చులకనా..?' అంటూ రీజన్స్ చెప్పాడు. 

సిరి - నాకు నిన్ను నామినేట్ చేయాలని లేదు అని చెప్తూనే ప్రియాంకను నామినేట్ చేసింది. ఆ తరువాత కాజల్ ని నామినేట్ చేస్తూ.. 'ఇలాంటి ఫ్లాట్ ఫామ్ లో ఆ వర్డ్ యూజ్ చేయడం తప్పని నా ఫీలింగ్' అని చెప్పగా.. 'దొరికింది ఒక్క రీజన్ వాడుకుంటున్నావ్ అంతే' అంటూ కాజల్ డైలాగ్ కొట్టింది. 'అంటే తప్పు కాదా అది.. నువ్ తప్పు కాదంటే నేను బాల్ పెట్టేస్తా' అని చెప్పింది.

సన్నీ - తన ఫ్రెండ్స్ ని గుండెల్లో పెట్టుకున్నానని.. వారు కాకుండా నామినేట్ చేయడానికి మరో ఇద్దరే ఉన్నారని అన్నాడు సన్నీ. దానికి సిరి రియాక్ట్ అవుతూ.. 'ఫ్రెండ్స్ అయితే నామినేట్ చేయవా.. తప్పున్నా?' అని అడిగింది. 'నా విషయంలో అయితే తప్పుగా అనిపించలేదు. జెన్యూన్ గా చెప్తున్నా' అని ఆన్సర్ చేశాడు సన్నీ. 'అవునా ఓకే' అంటూ వెటకరంగా రియాక్ట్ అయింది సిరి. ముందుగా సిరిని నామినేట్ చేశాడు. ఆ తరువాత శ్రీరామ్ ని నామినేట్ చేస్తూ.. 'ఆప్షన్ లేక నామినేట్ చేస్తున్నానని.. నీతో అంత కనెక్టివిటీ లేదని' చెప్పాడు. 

మానస్ - 'డిస్ రెస్పెక్ట్ చాలా పెద్ద పదం. నువ్ నన్ను చాలా సార్లు డిస్ రెస్పెక్ట్ చేశావ్. గ్రూప్ గ్రూప్ అని కామెంట్స్ చేశావ్. ఎమోషనల్ కనెక్షన్ తక్కువ ఉందని నామినేట్ చేశానే తప్ప' అంటూ చెబుతుండగా.. శ్రీరామ్ ఫైర్ అయ్యాడు. 'చైన్ గ్యాంగ్ అని అనలేదా నువ్..?' అని మానస్ అనగా.. ఇప్పటికీ అంటా అంటూ యారోగంట్ గా మాట్లాడాడు. ఆ తరువాత సిరిని నామినేట్ చేస్తూ.. 'నియంత టాస్క్ లో పింకీ కోసం ఆడుతున్నావ్ అని అనడం నచ్చలేదు. ఆమె కోసం ఆడితే నీకోసం పూల్ లోకి దిగి ఎందుకు గేమ్ ఆడతాను' అని చెప్పాడు. 

కాజల్ - కమ్యూనిటీ అనే మాట తప్పు కాదు.. ఎవరినీ కించపరచడానికి నేను ఆ పదం వాడలేదు. దాన్నొక ఇష్యూలా చేసి నన్ను నామినేట్ చేస్తున్నారంటూ.. ప్రియాంక, సిరిలను నామినేట్ చేసింది. 

ఈ వారం నామినేట్ అయిన ఇంటి సభ్యులు.. సిరి, మానస్, ప్రియాంక, శ్రీరామ్, కాజల్. 

Also Read:పాయల్ బోల్డ్ వీడియో.. వెంటనే డిలీట్ చేసేసింది..

Also Read: 'రాధే శ్యామ్'లో రెండో సాంగ్ టీజర్ వచ్చింది... చూశారా?

Also Read: అమిత్ షా మీద జోక్ వేశాడని... ఎక్కడా ఏ జోక్ వేయడానికి వీలు లేకుండా!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Pushpa 2: యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
Embed widget