Bigg Boss Season 6: ‘బిగ్ బాస్’ హౌస్‌లో ఎలక్షన్స్, సూర్యకు హ్యాండిచ్చిన ఇనయా - యాంగ్రీ మ్యాన్ కి కెప్టెన్సీ?
బిగ్ బాస్ ఇంటి కెప్టెన్ అవ్వాలనే కోరిక రేవంత్ కి తీరిందా? లేదా తెలియాలంటే కొన్ని గంటలు ఆగాల్సిందే..
బిగ్ బాస్ సీజన్ 6 తెలుగు 34వ ఎపిసోడ్ కి సంబంధించి లేటెస్ట్ ప్రోమోని వదిలారు. దాన్ని బట్టి చూస్తే ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి కెప్టెన్ అవ్వాలని ఆశపడిన రేవంత్ కోరిక తిరినట్టే కనిపిస్తోంది. కెప్టెన్సీ కంటెండర్లుగా బాలాదిత్య, సూర్య, రేవంత్ ఎంపిక అయ్యారు. పూల దండ ద్వారా కెప్టెన్ ఎవరో ఎంచుకోవాల్సిందిగా బిగ్ బాస్ సూచించారు. అందరూ తమకి నచ్చిన వారి గురించి చెప్తూ వాళ్ళ మెడలో పూల మాల వేశారు. అందరి కంటే యాంగ్రీ యంగ్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్న రేవంత్ మెడలోనే ఎక్కువ కనిపిస్తున్నాయి.
తాజా ప్రోమో ప్రకారం.. కెప్టెన్సీకి కేవలం ఒక్క అడుగు దూరంలో ఉన్న సూర్య, బాలాదిత్య, రేవంత్ కి బిగ్ బాస్ గేమ్ ఆఫ్ గార్ ల్యాండ్ టాస్క్ ఇచ్చారు. ఇంటి కెప్టెన్ అవ్వడానికి పోటీదారులు వీలైనంత ఎక్కువ మంది ఇంటి సభ్యుల మద్దతు వాళ్ళు వేయించుకునే పూల దండల రూపంలో పొందాల్సి ఉంటుంది. రాజు ఎక్కడ ఉన్న రాజే.. ఇప్పుడు ఆ రాజుకి రాజ్యం ఇస్తే ఎలా ఉంటుందో చూడాలని అనిపిస్తుందని గీతూ అంటుంది. కెప్టెన్ అయితే తన కోపం తగ్గుతుందేమో అని అర్జున్.. రేవంత్ గురించి తన అభిప్రాయం చెప్పి దండ వేశాడు. ఇక మేరీనా, అర్జున్ రేవంత్ కి పూల మాల వేస్తారు. కోపం తగ్గించుకున్న తర్వాత కెప్టెన్ అయితే ఇంకా బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తూ శ్రీ సత్య, సుదీప, ఫైమా బాలాదిత్యకి పూల మాల వేస్తారు.
ఇక అందరి కంటే పెద్ద షాక్ ఇచ్చింది ఇనయా. పూల దండ తీసుకుని ఇనయా సూర్య దగ్గరకి వచ్చి వెంటనే పక్కకి వెళ్ళి రేవంత్ మెడలో వేస్తుంది. తన ఫేవరెట్ సూర్యని వదిలేసి ఇనయా రేవంత్ కి పూల మాల వెయ్యడంతో ఇంట్లో వాళ్ళే కాదు.. సూర్య కూడా బిత్తరపోయాడు. వెంటనే వెళ్ళి ఇనయా సూర్యని హగ్ చేసుకుంటే దండ అటు, హగ్ నాకా అని అని అంటాడు. మరోవైపు.. ఏమైందో తెలియదు కానీ.. నీ పొజిషన్లో నేను ఉంటే ఆట వేరేగా ఉండేది అని చంటి అనేసరికి రేవంత్ చాలా బాధపడతాడు.
నిన్నటి ఎపిసోడ్లో తన బర్త్ డే సందర్భంగా తమ కోరికలను చెప్పమని అడిగాడు బిగ్ బాస్. ఒక్కొక్కరూ ఒక్కో కోరికను చెప్పసాగారు. శ్రీహాన్ తన పేరుతో పెట్టిన ‘శ్రీహాన్ హెల్పింగ్ హ్యాండ్స్’ ద్వారా సాయం చేయమని స్నేహితులను కోరాడు. అలాగే తన తల్లిదండ్రులతో తరచూ మాట్లాడమని ప్రేయసి సిరికి చెప్పాడు. ఇక బాలాదిత్య తన కూతురికి మంచి పేరు పెట్టాలని కోరాడు. ఇక రేవంత్ తన భార్యని, తల్లిని తలచుకుని, వాళ్లు ఎలా ఉన్నారో తెలియజేయాలని కోరాడు. ఇక ఆర్జే సూర్య తన తల్లి, తండ్రి, బుజ్జమ్మ ఎలా ఉన్నారో వీడియో చూపించమని కోరారు. ఇనయ తన తల్లిని తలుచుకుని ఎమోషనల్ అయిపోయింది. సుదీప తన భర్త రంగనాథ్ ఫోటో, టీషర్టు అడిగింది.
కుక్క బొచ్చు కావాలట: ఇక గీతూ ఎప్పటిలాగే వెరైటీగా ప్రవర్తించింది. తల్లినో, తండ్రినో, భర్తనో కాకుండా తన కుక్కల్ని తలచుకుంది. తన రెండు కుక్కల బొచ్చులు కావాలని అడిగింది. అది తనకు చాలా అమూల్యమైనదని అంది. ఇక ఆది రెడ్డి తన కూతురి బర్త్ డే బిగ్ బాస్ హౌస్‌లో జరగాలని కోరుకున్నాడు. అలా జరిగితే బాగా ఓట్లు పడతాయని తెలుసు కాబట్టే తెలివిగా కోరాడు.
Also read: సూర్య అంటే ఇష్టం, తన క్రష్ అని చెప్పేసిన ఇనయా, మరి సూర్యకు?
Also read: ఎపిసోడ్‌లో హైలైట్ ఫైమానే, అందరినీ నవ్వించింది ఈమె ఒక్కతే, గీతూ ఎప్పటిలాగే ఓవర్ యాక్షన్
View this post on Instagram