Bigg Boss 6 Telugu Episode 32: సూర్య అంటే ఇష్టం, తన క్రష్ అని చెప్పేసిన ఇనయా, మరి సూర్యకు?
Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ హౌస్లో రెండు రోజుల నుంచి ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా సాగిపోతోంది.
Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ హౌస్లో రెండు రోజుల నుంచి ఎలాంటి అలకలు, గొడవలు లేవు. ఆటలు పాటలతో వినోదభరితంగా మార్చేశారు. గొడవల్ని ఇష్టపడేవాళ్లకి ఈ ఎపిసోడ్లు నచ్చకపోవచ్చు, కానీ వినోదాన్ని ఇష్టపడేవారికి కచ్చితంగా నచ్చే అవకాశం. ఇంటి సభ్యులు తమకొచ్చిన కళల్ని అవకాశం వచ్చినప్పుడల్లా ప్రదర్శించారు.
ఎపిసోడ్లో మెరీనా, వాసంతి ఎపిసోడ్లో ఎలా ఎలివేట్ అవ్వాలో తెలియక రాత్రిపూట దెయ్యాల వేషం వేశారు. కానీ వారిద్దరూ సరిగా నటించలేకపోయారు.కాసేపు ఫర్వాలేదనిపించారు. రాత్రవ్వడంతో అందరూ నిద్రపోయారు. ఫైమా తనకిచ్చిన సీక్రెట్ టాస్కు అమలు చేసింది. ఇందులో భాగంగా ముగ్గురు ఇంటి సభ్యుల నిద్రకు భంగం కలిగించాలి. స్పూన్లు విసరడం, తలగడలు విసరడం చేసింది. వాసంతి లేచి చూసింది. మిగతా వారు కదిలినట్టు కనిపించారు కానీ భంగం కలిగినట్టు అనిపించలేదు. ఈ విషయంలో బిగ్ బాస్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
తెల్లారాక ఓ కేకును పంపించారు బిగ్ బాస్. అయితే కేవలం నలుగురు మాత్రమే తినాలని, ఆ నలుగురు ఎవరో ఇంటి సభ్యులే నిర్ణయించుకోవాలని, అది కూడా పావుగంటలో చేయాలని చెప్పారు. ఇంటి సభ్యులు వాదులాడుకుంటూ టైమ్ వేస్టు చేశారు. దీంతో బిగ్ బాస్ కేకు వెనక్కి తీసుకున్నారు.
ఫైమా రంగు గురించి...
ఫైమా తన రంగు గురించి రాజశేఖర్ ఏదో అన్నాడని, చాలా బాధపడ్డానని అంది. దానికి రాజ్ చాలా వినయంగా సారీ చెప్పాడు. రంగు పేరుతో బాడీ షేమింగ్ చేయకూడదని చెప్పింది ఫైమా. ఎప్పుడు చేశాడన్నది మాత్రం తెలియడం లేదు. వీకెండ్లో చూపిస్తారేమో చూడాలి. సూర్య అపరిచితుడిలా మారి కాసేపు నవ్వించాడు. ఓసారి రాములా, మరోసారి రెమోలా అలరించాడు. ఇది కాసేపు నవ్వు తెప్పించింది. సూర్యతో ఫైమా కూడా కలవడంతో మరింతగా స్కిట్ పండింది. వీరిద్దరూ కలిసి డ్యాన్సు చేసి నవ్వించారు.
సూర్య అంటే ఇష్టం
ఇనయాను కన్ఫెషన్ రూమ్ కి పిలిచాడు. ఓ కేకు ముక్కని ఎదురుగా పెట్టి ఇంట్లో జరుగుతున్న ఆసక్తికరమైన విషయాలను చెప్పమని అడిగాడు. దానికి ఇనయా తనకు సూర్య అంటే ఇష్టమని, రోజురోజుకు ఇంకా నచ్చేస్తున్నాడని చెప్పింది. అతను తన క్రష్ అని చెప్పింది. ఆరోహితో దగ్గరగా మాట్లాడుతున్నప్పుడు కాస్త కోపం వచ్చేదని అంది. ఇనయా వైపు నుంచి ఇష్టం ఉన్నట్టు ముందు ఎపిసోడ్లో గీతూ కూడా చెప్పింది. అయితే సూర్య వైపు నుంచి మాత్రం ఏమీ కనిపించడం లేదు. అతనికి బయట బుజ్జమ్మ అనే ఒక అమ్మాయి ఉన్నట్టు మాత్రం అర్థమవుతోంది. ఇక ఇనయా అర్జున్ వాసంతి దగ్గరవుతున్నారని, భవిష్యత్తులో వారు జంటగా మారవచ్చని చెప్పింది. బిగ్ బాస్ తనకు నచ్చినవారితో కేకును షేర్ చేసుకోవచ్చు అని చెప్పారు.
రివ్యూ బ్యాచ్ మాత్రం మారదు...
రివ్యూ బ్యాచ్ గీతూ - ఆదిరెడ్డి కలిపి మళ్లీ రివ్యూ మొదలుపెట్టారు. సుదీప గురించి గాసిప్పులు మాట్లాడుకున్నారు. ఆమె బాసీగా ఉంటుంది, అన్నింట్లోకి మధ్యలో దూరిపోతుంది అంటూ చిరాకు తెప్పించేలా మాట్లాడారు. ఎందుకంటే ఇంట్లో గీతూ కన్నా చిరాకు పెట్టించే వారు ఎవరూ లేరు.
ఇంట్లోకి జోకర్
ఇంట్లోకి ఓ క్లౌన్ (జోకర్)ని పంపించారు బిగ్ బాస్. అతను వచ్చాక ఇంటి సభ్యులను ఫ్రీజ్ చేశారు. అతను కాసేపు ఇంటి సభ్యులతో ఆడుకున్నాడు. చివరికి శ్రీ సత్య ముఖానికి కేకును కొట్టి వెళ్లిపోయాడు. ఆ కేకును కొంతమంది ముఖం మీద నుంచి తీసుకుని తిన్నారు.
వ్యాక్సింగ్...
బిగ్ బాస్ శ్రీహాన్, చంటి కాళ్లకు వ్యాక్సింగ్ చేయాలని, కానీ వాళ్లు ఎలాంటి శబ్దాలు చేయకూడదని చెప్పాడు. తాను నిద్రపోతానని చెప్పాడు. అయితే శ్రీహాన్ వ్యాక్సింగ్ చేస్తుంటే అరవడం మొదలుపెట్టాడు. దీంతో బిగ బాస్ శ్రీహాన్ మౌనవ్రతం చేయాలంటూ పనిష్మెంట్ ఇచ్చారు.
గీతూ ఓవర్‌యాక్షన్
తరువాత ఇంటి సభ్యులంతా కలిసి స్కూల్ స్కిట్ వేశారు. ఇందులో బాలాదిత్య టీచర్లా మిగతావారంతా స్కూలు పిల్లల్లా నటించారు. ఇందులో ఫైమా కాస్త ఎక్కువ నచ్చింది. మిగతావారంతా ఫర్వాలేదనిపించారు. ఇక గీతూ మాత్రం చిన్న పిల్లలా మాట్లాడ్డానికి ప్రయత్నించింది. అందులో కూడా యాటిట్యూట్ చూపించింది. ఈమె ప్రతి విషయంలో ఓవర్ యాక్షన్ చేయడం అలవాటే.
Also read: ఎపిసోడ్‌లో హైలైట్ ఫైమానే, అందరినీ నవ్వించింది ఈమె ఒక్కతే, గీతూ ఎప్పటిలాగే ఓవర్ యాక్షన్