Bigg Boss 6 Telugu: జంబలకిడి పంబలా శ్రీహాన్, పిచ్చోడిలా సూర్య, ఫైమాకు సీక్రెట్ టాస్క్ - బిగ్‌బాస్ హౌస్‌లో ఫన్ మామూలుగా లేదు
Bigg Boss 6 Telugu: నేటి ఎపిసోడంతా నవ్వి నవ్వి పొట్ట నొప్పి వచ్చేలా రెడీ చేశాడు బిగ్ బాస్. అందుకు ఈ ప్రోమోలో సాక్ష్యం.
Bigg Boss 6 Telugu: సోమవారం నామినేషన్ డే. ఆ హీట్ తగ్గడానికేమో మంగళవారం ఫుల్ ఫన్ డేగా మార్చాడు బిగ్ బాస్. ఇంట్లోని సభ్యులకు రకరకాల పనులు చెప్పాడు. ప్రోమో ఓపెన్ అవ్వగానే శ్రీహాన్ రూపమే మారపోయింది. అందరికీ షాకిచ్చేలా చీరకట్టుకుని, తలకు పూలతో, చెవులకు జుంకాలతో దర్శనమిచ్చాడు. అతడిని చూసి పడి పడి నవ్వారంతా.
ఇక సుదీపని తడుముకోకుండా తొమ్మిదో ఎక్కాన్ని చెప్పమని అడిగాడు బిగ్‌బాస్. సుదీప సరిగా చెప్పలేక ఇబ్బంది పెడింది. తరువాత ఇంట్లోని కొంతమంది సభ్యులకు తలపై స్టీలు ప్లేటు, గిన్నె పెట్టి తిరగమన్నారు. ఆ సమయంలో బిగ్ బాస్ గురక పెడుతూ నిద్రపోయారు. ఆ సమయంలో రాజశేఖర్ తల మీద పెట్టుకున్న ప్లేటు పడిపోయింది. ఆ శబ్ధానికి బిగ్ బాస్ ‘నా నిద్ర చెడగొట్టినందుకు ఏదైనా లాలి పాట పాడి నన్ను తిరిగి నిద్రపుచ్చు’ అని ఆదేశించాడు.రాజశేఖర్ లాలి లాలి అని పాడుతూ ‘వసపత్ర సాయికి’ అని పాడాడు. దీంతో అందరూ నవ్వరు. వటపత్రసాయికి అని కూడా రాజశేఖర్ కి తెలియకపోవడం అతని అమాయకత్వాన్ని సూచించేలా ఉంది.
View this post on Instagram
ఫైమాకు సీక్రెట్ టాస్క్...
ఇక ఫైమాను కన్ఫెషన్ రూమ్‌కి పిలిచాడు బిగ్ బాస్. అక్కడ ఆమె కోసం పిజా పెట్టాడు. అలాగో ఓ సీక్రెట్ టాస్కు ఇచ్చాడు. కానీ ఆ టాస్కేంటో చెప్పలేదు. ఆ టాస్కును విజయవంతంగా పూర్తి చేస్తే ఆ పిజా తినవచ్చని చెప్పి ఉంటాడు బిగట్ బాస్. ఇక ఫైమా ఇంటి సభ్యులతో చిర్రుబుర్రులాడుతూ కనిపించింది. చంటితో ‘వేస్టన్నా, ఎవరినీ నమ్మకు. గీతూ చెప్పినట్టు ఎవరినీ ఫ్యామిలీ అనుకోవద్దు, ఫ్రెండ్స్ అనుకోవద్దు’ అంటూ వెళ్లిపోయింది. సీక్రెట్ టాస్కులో భాగంగానే ఆమె ఇంత డ్రామా ఆడినట్టు అర్థమైపోతోంది.
ఈ వారం ఎనిమిది మంది నామినేషన్లలో ఉన్నారు.
1. చంటి
2. బాలాదిత్య
3. మెరీనా
4. ఆదిరెడ్డి
5. వాసంతి
6. ఫైమా
7. అర్జున్
8. ఇనయా
Also read: శ్రీసత్యను శ్రీహాన్ ఎత్తుకోగానే అర్జున్ కళ్లల్లో అసూయ చూడాల్సిందే
Also read: ఇనయాను మళ్లీ రెచ్చగొట్టిన శ్రీహాన్, టైటిల్ కొట్టి తీరుతా అంటూ శపథం చేసిన ఇనయా, నామినేషన్స్ డే హీట్