Bigg Boss 6 Telugu Episode 30: ఇనయాను మళ్లీ రెచ్చగొట్టిన శ్రీహాన్, టైటిల్ కొట్టి తీరుతా అంటూ శపథం చేసిన ఇనయా, నామినేషన్స్ డే హీట్
Bigg Boss 6 Telugu: నామినేషన్స్ డేలో ఇనయా మళ్లీ గట్టిగా తన వాదనను వినిపించింది.
Bigg Boss 6 Telugu: ఇప్పటికే ఇనయా దెబ్బతిన్న పులిలా ఉంది, నామినేషన్స్ డే రోజు తన వెకిలి చేష్టలతో మరింతగా రెచ్చగొట్టాడు శ్రీహాన్. దీంతో ఆమె టైటిల్ కొట్టి తీరుతా అంటూ శపథం చేసింది. ఈనాటి ఎపిసోడ్లో ఏ జరిగిందంటే...
పవన్ కళ్యాణ్ పాటతో మార్నింగ్ కంటెస్టెంట్లను నిద్రలేపారు బిగ్‌బాస్. నామినేషన్స్ డేలో భాగంగా సంకెళ్లను ఇచ్చారు బిగ్ బాస్. తాను పిలిచే ఇద్దరు వెళ్లి ఈ సంకెళ్లను వేసుకుని వారిద్దరిలో ఎవరు నామినేట్ అవుతారో తేల్చుకోవాలని చెప్పారు. ఈ రోజు నుంచి మెరీనా, రోహిత్ విడివిడిగా ఆడతారు అని చెప్పారు బిగ్బాస్. వారిద్దరినే మొదట పిలిచి ఎవరో నామినేట్ అవుతారో తేల్చుకోమని చెప్పారు బిగ్బాస్. దీంతో మెరీనా భర్త కోసం తాను త్యాగం చేసింది. దీంతో రోహిత్ చాలా ఎమోషనల్ అయిపోయాడు. మెరీనా నామినేట్ అయింది.
ఇనయా వర్సెస్ శ్రీహాన్
పాము, ముంగిసల్లా ఉండే ఇనయా, శ్రీహాన్లను పిలిచారు బిగ్ బాస్. దీంతో శ్రీహాన్ వెకిలి చేష్టలు మొదలైపోయాయి. ‘వద్దు బిగ్‌బాస్ ఈమెతో నేను పడలేను’ అంటూ కామెంట్ చేశాడు. ఇక సంకెళ్లు వేసుకున్నాక శ్రీహార్ ఆస్కార్ రేంజ్‌లో ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇనయాను రెచ్చగొట్టడం ప్రారంభించాడు. నీకు కెప్టెన్ అయ్యే అర్హత లేదు, నువ్వు ఏం ఆడుతున్నావ్, నేను ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నా అని చెప్పుకొచ్చాడు శ్రీహాన్. నేను కూడా ఆడుతున్నా అంది ఇనయా. దానికి శ్రీహాన్ ‘అప్పుడు నేను ఎక్కడ ఉన్నాను ఇంట్లో’ అంటూ వెటకారం చేశాడు. ఇంకా చాలా రకాలుగా ఇరిటేట్ చేశాడు. దీంతో ఇనయా విసుగెత్తి ‘నేను నామినేట్ అవుతున్నా... నేను కెప్టెన్‌కు డిజర్వ్ కాదని చెప్పావ్, అందుకే ఫైట్ చేస్తా. ఆడతాను. ఆడి చూపిస్తాను. టైటిగ్ కొట్టి మరీ వెళతాను’ అంటూ శపథం చేసింది.
వాసంతి - సుదీపలను పిలిచారు. అయితే సుదీప తాను నామినేట్ అవ్వనని చెప్పింది. దీంతో వాసంతి నామినేట్ అయింది. శ్రీసత్య - అర్జున్ కళ్యాణ్లలో శ్రీసత్య మళ్లీ అవకాశాన్ని వాడుకుంది. అర్జున్ మాత్రం శ్రీసత్యను చూస్తూ మైమరచిపోయాడు. అలాగే నామినేట్ అయ్యాడు. రేవంత్- ఆదిరెడ్డిలలో ఆదిరెడ్డి, ఫైమా - సూర్యలలో ఫైమా నామినేట్ అయ్యారు. గీతూ - చంటిలు ఇద్దరినీ వాదించుకోమని చెప్పాడు బిగ్బాస్. ఇందులో గీతూ ‘నువ్వు నన్ను చాలా బాధపెట్టావ్, కాబట్టి ఈసారి నువ్వు నామినేట్ అయ్యి కాంపెన్సేట్ చేసుకో’ అని చెప్పింది. చంటి తనను తానే నామినేట్ చేసుకున్నాడు. ఇక రాజ్ - బాలాదిత్యల్లో బాలాదిత్య నామినేట్ అయ్యాడు.
ఈ వారం నామినేట్ అయిన సభ్యులు...
1. చంటి
2. బాలాదిత్య
3. మెరీనా
4. ఆదిరెడ్డి
5. వాసంతి
6. ఫైమా
7. అర్జున్
8. ఇనయా
Also read: ఏం ఫిట్టింగ్ పెట్టావు బిగ్‌బాస్, ఇలాంటి నామినేషన్ అని పాపం ఊహించి ఉండరు, నామినేషన్లో ఆ ఎనిమిది మంది