అన్వేషించండి

Bigg Boss 6 Telugu: ఏం ఫిట్టింగ్ పెట్టావు బిగ్‌బాస్, ఇలాంటి నామినేషన్ అని పాపం ఊహించి ఉండరు, నామినేషన్లో ఆ ఎనిమిది మంది

Bigg Boss 6 Telugu: నామినేషన్ అనగానే చాలా ఊహించి ఉంటారు.. కానీ ఈసారి నామినేషన్ వెరైటీ.

Bigg Boss 6 Telugu: నామినేషన్ డే అనగానే ఆ రోజు ఫైటింగులు మామూలుగా ఉండవు. ప్రేక్షకులకు పండగే. ఇంట్లో ఉన్నవారందరిలో తనకు నచ్చని ఇద్దరిని ఎంచుకుని నామినేట్ చేసేవారు. కానీ ఇప్పుడు బిగ్ బాస్ ఆ అవకాశం ఇవ్వలేదు. తానే ఇద్దరినీ ఎంపిక చేసి, వారిద్దరిలో ఒకరిని నామినేట్ అవ్వమని కోరాడు. ఎవరు నామినేట్ అవుతారో వారిద్దరే వాదించుకోవాలి. బిగ్ బాస్ ఎంపిక చేసిన జోడీలు మామూలుగా లేవు. ఇంట్లో ఏ ఇద్దరికీ పడదో వారిని, ఏ ఇద్దరూ స్నేహంగా ఉంటారో వారిని ఎంపిక చేశాడు. దీనివల్ల వాదనలు ఎక్కువ అవుతాయి, కంటెంట్ వస్తుందన్ని బిగ్ బాస్ ప్లాన్. ఇది వర్కవుట్ అయిందో లేదో ఎపిసోడ్ చూశాకే తెలుస్తుంది. 

ఇక ప్రోమోలో ఏముందంటే...గార్డెన్ ఏరియాలో సంకెళ్లు పెట్టారు. తాము చెప్పినప్పుడు  ఇద్దరు వెళ్లి ఆ సంకెళ్లను చేతికి వేసుకోవాలి. ఎవరు నామినేట్ అవుతారో తేల్చుకోవాలి. ఇకపై ఇంటిలోకి జంటగా వచ్చిన మెరీనా - రోహిత్‌లు విడివిడిగా ఆడతారని చెప్పాడు బిగ్ బాస్. మెరీనా - రోహిత్ లలో ఎవరినో ఒకరిని నామినేట్ అవ్వమని అడిగాడు. వారిద్దరిలో మెరీనా నామినేట్ అయింది. తనకు తానే నామినేట్ అవుతున్నట్టు,తాను ఉన్నా లేకపోయినా భర్తను బాగా ఆడమని చెప్పింది. మెరీనా నామినేట్ అయింది. 

ఇక సుదీప - వాసంతిని పిలిచాడు బిగ్ బాస్. ఇద్దరూ కాసేపు వాదించుకున్నారు. సుదీప తాను టెన్షన్ జోన్లోకి వెళ్లనని, అందుకే నామినేట్ అవ్వనని చెప్పింది. వాసంతి తనకు ఓ అవకాశం ఇస్తే నిరూపించుకుంటానని చెప్పింది. సుదీప ఎంతకీ ఒప్పుకోలేదు. దీంతో వాసంతి కోపంగా వెళ్లిపోయింది. 

శ్రీ సత్యను నమ్మితే ఇంతే...
గత వారం అర్జున్ తన గేమ్ మానేసి మరీ శ్రీసత్యకు చాలా హెల్ప్ చేశాడు. ఈసారి వారిద్దరిలో ఒకరిని నామినేట్ అవ్వమని చెప్పాడు బిగ్ బాస్. గత వారం చేసిన సాయాన్ని కూడా మర్చిపోయి శ్రీ సత్య అర్జున్ తో ఆటాడుకుంది. అర్జున్ గత వారం నీకు చాలా సాయం చేశాను కదా అన్నాడు, దానికి శ్రీ సత్య నువ్వు ఫ్రీగా ఇవ్వలేదు, పనులు చేయించుకుని ఇచ్చావ్ అంటూ వాదించింది. మళ్లీ శ్రీ సత్య డబుల్ గేమ్ లో ఓడిపోయాడు అర్జున్ కళ్యాణ్. 

ఇనయా వర్సెస్ శ్రీహాన్
ఇనయా,  శ్రీహాన్‌లకు ఒక్క నిమిషం పడదు. వారిద్దరినీ పిలిచాడు బిగ్ బాస్. ఇందులో ఇద్దరూ ఎప్పటిలాగే వాదించుకున్నారు. చివరికి ఇనయా తానే నామినేట్ అవుతానని, తాను కప్పు కొట్టేందుకు డిజర్వ్ పర్సన్ అని చెప్పుకుంది. 

ఆదిరెడ్డి - రేవంత్ లలో ఆదిరెడ్డి నామినేట్ అయినట్టు సమాచారం. అలాగే గీతూ - చంటిలలో చంటి నామినేట్ అయ్యాడని తెలుస్తోంది. 

ఎప్పుడు నామినేషన్లలో ఉండే రేవంత్, గీతూ మాత్రం ఈ సారి నామినేషన్లలో లేరు. కానీ నామినేషన్లలో ఉంటేనే ఫ్యాన్ బేస్ పెరుగుతుందని వారికి తెలియడం లేదు. 

అందుతున్న సమాచారం ప్రకారం ఎనిమిది మంది నామినేషన్లలో ఉన్నారు.

1. చంటి 
2. బాలాదిత్య
3. మెరీనా
4. ఆదిరెడ్డి
5. వాసంతి
6. ఫైమా
7. అర్జున్
8. ఇనయా  

Also read: ఆరోహి ఎలిమినేషన్, వెక్కి వెక్కి ఏడ్చేసిన సూర్య - ఆదివారం ఎపిసోడ్ హైలైట్స్!

Also read: సీజన్ 6లో తొలి మహిళా కెప్టెన్‌గా కీర్తి, శ్రీసత్య కాళ్లు పట్టిన అర్జున్ కళ్యాణ్ - జైలుకెళ్లక తప్పలేదు

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Agnipariksha 2 : 'మీరు ట్రాన్స్ కదా?' - ఆ కామెంట్స్‌పై నెటిజన్స్ ఫైర్... ఉప్పల్ బాలుకు నెట్టింట పెరుగుతున్న సపోర్ట్
'మీరు ట్రాన్స్ కదా?' - ఆ కామెంట్స్‌పై నెటిజన్స్ ఫైర్... ఉప్పల్ బాలుకు నెట్టింట పెరుగుతున్న సపోర్ట్
Bigg Boss 10 Promo : ఈసారి ఆటే సవాల్ - దశావతారం గేమ్ స్ట్రాటజీస్... బిగ్ బాస్ సీజన్ 10 ప్రోమో వచ్చేసింది
ఈసారి ఆటే సవాల్ - దశావతారం గేమ్ స్ట్రాటజీస్... బిగ్ బాస్ సీజన్ 10 ప్రోమో వచ్చేసింది
Eknadh Harika: బుల్లితెర పాపులర్ కపుల్ ఏక్ నాథ్, జయ హారిక.. రియల్ లైఫ్, బిగ్ బాస్ ఎంట్రీ విశేషాలు
బుల్లితెర పాపులర్ కపుల్ ఏక్ నాథ్, జయ హారిక.. రియల్ లైఫ్, బిగ్ బాస్ ఎంట్రీ విశేషాలు
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget