అన్వేషించండి

US Flight Shutdown: అమెరికాలో నిలిచిన 11 వేల విమాన సర్వీసులు.. అన్ని విమానాలపై నిషేధం, కుట్ర కోణంపై టెన్షన్!

అమెరికాలో ఎయిర్‌ కంట్రోల్‌ సెంటర్లలో కమ్యూనికేషన్‌ సమస్య కారణంగా విమాన సేవలును నిలిపివేశారు. అన్ని ఫ్లైట్లను ప్రస్తుతం గ్రౌండ్ చేశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కమ్యూనికేషన్ సమస్యతో అమెరికాలో దేశవ్యాప్తంగా అన్ని విమానాలు నిలిచిపోయాయి.
  • నెట్‌వర్క్ రౌటర్ లోపం, అప్‌డేట్ వల్ల సిస్టమ్ క్రాష్ అయింది.
  • వేల విమానాలు నిలిచినా, కుట్రకు ఆధారాలు లేవని అధికారులు.
  • గాల్లోని విమానాల భద్రతకు హామీ, అంతర్జాతీయ విమానాలకు మినహాయింపు.

వాషింగ్టన్: అమెరికా ఏవియేషన్ ఇండస్ట్రీలో అతిపెద్ద సమస్య తలెత్తింది. అమెరికన్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) పిలుపు మేరకు దేశంలోని అన్ని విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. అమెరికా అంతటా ఎయిర్‌పోర్టులలో ఫ్లైట్లను గ్రౌండ్ చేశారు. దీంతో దేశవ్యాప్తంగా దాదాపు 11 వేలకు పైగా విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు శుక్రవారం నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

సీఎన్ఎన్ ప్రకారం, ఎయిర్‌ కంట్రోల్‌ సెంటర్లలో కమ్యూనికేషన్‌ సమస్య వల్ల విమానాలు నిలిపివేశారు. ఈ సమస్య నెట్‌వర్క్ రౌటర్‌లో వచ్చిన లోపంతో మొదలైందని అమెరికా ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌(FAA) అధికారులు వెల్లడించారు. 22 ప్రాంతీయ ఎయిర్‌ట్రాఫిక్‌ కంట్రోల్‌ సెంటర్లలో సమస్య తలెత్తడంతో దాని ప్రభావం అమెరికా అంతటా కనిపించింది. తదుపరి సమాచారం వచ్చేవరకు దేశంలో అన్ని ఫ్లైట్లపై నిషేధం విధించినట్లు ఎఫ్ఏఏ తెలిపింది.

'అన్ని ఎయిర్ రూట్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్లను ప్రభావితం చేసిన కమ్యూనికేషన్ సమస్య కారణంగా FAA అన్ని అమెరికా విమానాశ్రయాలను విమాన సర్వీసులను నిలిపివేయాలనే ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం FAA టెక్నీషియన్లు ఈ సమస్యను పరిశీలిస్తున్నారు. మాకు సమాచారం అందిన వెంటనే అప్డేట్ ఇస్తాం' అని అమెరికా రవాణా కార్యదర్శి సీన్ డఫీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. 

అప్‌డేట్ తర్వాత క్రాష్ అయిన కమ్యూనికేషన్ సిస్టమ్

సీబీఎస్ న్యూస్ నివేదిక ప్రకారం, అమెరికా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్‌ను అనుసంధానించే ప్రైవేట్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లో తాజాగా ఓ అప్‌డేట్ చేశారు. ఆ తర్వాత సిస్టమ్ దానంతటఅది రీబూట్ అయింది. కానీ అదే ప్రక్రియలో టెక్నికల్ ప్రాబ్లమ్ రావడంతో కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. ఎల్-3 హారిస్ కంపెనీ ఈ నెట్‌వర్క్‌ను నిర్వహిస్తోంది.

అమెరికా హోంసెక్యూరిటీ మంత్రి మార్క్వెన్ ములిన్ వైట్ హౌస్ బయట మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఎలాంటి కుట్ర లేదా అమెరికాపై ఉద్దేశపూర్వక దాడికి సంబంధించి సంకేతాలు కనిపించలేదని అన్నారు. ఇది టెలికమ్యూనికేషన్ సిస్టమ్‌లో వచ్చిన సాంకేతిక లోపం అని భావించి.. ముందుజాగ్రత్తగా అన్ని విమానాలను నిలిపివేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.


గాల్లో ఉన్న విమానాలపై నిఘా
ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ఫ్లైట్‌రాడార్24 ప్రకారం, దేశవ్యాప్తంగా విమానాలపై నిషేధం విధించిన సమయంలో సుమారు 3100 విమానాలు అమెరికన్ ఎయిర్‌పోర్టుల వైపు వస్తున్నాయి. ఆల్రెడీ బయలుదేరిన విమానాలు సురక్షితంగా ల్యాండ్ అవుతాయని, ఏ ప్రయాణికుడి భద్రత విషయంలో రాజీ పడబోమని ఆయన హామీ ఇచ్చారు.

అంతర్జాతీయ విమానాలకు కొన్ని మార్గాల్లో మినహాయింపు

అమెరికా తూర్పు తీరంనుంచి బయలుదేరే అంతర్జాతీయ విమానాలకు అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ప్రయాణించేందుకు అనుమతి ఇచ్చారని తెలుస్తోంది. అలాగే జాక్సన్‌విల్, మియామి, హ్యూస్టన్, సాన్ జువాన్ నుంచి కొన్ని విమానాలకు దక్షిణ దిశగా మెక్సికో గల్ఫ్, అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా వెళ్లేందుకు పర్మిషన్ ఇచ్చారని నివేదికలు చెబుతున్నాయి. 

పెద్ద ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికుల కష్టాలు

విమానాలపై నిషేధం ప్రభావం అమెరికాలోని పలు ప్రధాన ఎయిర్ పోర్టులైన బోస్టన్, అట్లాంటా, మియామి, పిట్స్‌బర్గ్, న్యూయార్క్, లాస్ ఏంజిలిస్, బాల్టిమోర్ సహా ఇతర విమానాశ్రయాల్లోనూ కనిపించింది. విమానాల నిర్వహణలో ఆలస్యం కారణంగా ప్రయాణికులు చాలా గంటల నుంచి వేచి ఉండాల్సి వచ్చింది. శుక్రవారం రోజే చికాగోలోని ఓ'హేర్ ఇంటర్నేషనల్, మిడ్‌వే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుల్లో పరికరాల లోపం కారణంగా విమానాల సర్వీసులు నిలిపివేశారు.

2023లో కూడా నిలిచిపోయిన విమాన సర్వీసులు

అమెరికాలో ఇంతకుముందు 2023 జనవరిలో కూడా FAA సిస్టమ్‌లో టెక్నికల్ ప్రాబ్లం కారణంగా దేశవ్యాప్తంగా కొన్ని గంటల పాటు విమానాలపై నిషేధం విధించారు. ఆ సమయంలో విమాన సిబ్బందికి అవసరమైన అలర్ట్‌లు పంపే సిస్టమ్ రాత్రి వేళ  నిలిచిపోయింది. దాంతో డొమెస్టిక్ విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి.

 

Frequently Asked Questions

అమెరికాలో విమాన సర్వీసులను ఎందుకు నిలిపివేశారు?

అమెరికన్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) పిలుపు మేరకు, ఎయిర్ కంట్రోల్ సెంటర్లలో కమ్యూనికేషన్ సమస్య తలెత్తడంతో దేశంలోని అన్ని విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు.

కమ్యూనికేషన్ సమస్యకు అసలు కారణం ఏమిటి?

అమెరికా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్‌ను అనుసంధానించే ప్రైవేట్ నెట్‌వర్క్‌కు అప్‌డేట్ చేసిన తర్వాత సాంకేతిక లోపం తలెత్తింది. దీనివల్లే కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది.

ఈ సమస్య వల్ల ఎంత మంది ప్రయాణికులు, ఎన్ని విమానాలు ప్రభావితమయ్యాయి?

దేశవ్యాప్తంగా దాదాపు 11 వేలకు పైగా విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిషేధం విధించినప్పుడు సుమారు 3100 విమానాలు గాల్లోనే ఉన్నాయి.

ఇది సైబర్ దాడి లేదా కుట్రా?

కాదు. ఇది టెలికమ్యూనికేషన్ సిస్టమ్‌లో వచ్చిన సాంకేతిక లోపంగా భావించారు. ఎలాంటి కుట్ర లేదా అమెరికాపై ఉద్దేశపూర్వక దాడి సంకేతాలు కనిపించలేదని అధికారులు తెలిపారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bulgaria Road Accident: బల్గేరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకేసారి 86 వాహనాలు ఢీ- 12 మంది మృతి, పలువురికి గాయాలు
బల్గేరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకేసారి 86 వాహనాలు ఢీ- 12 మంది మృతి, పలువురికి గాయాలు
Nvidia Jensen Huang Affair: చైనా గూఢచారితో రిలేషన్ నిజమే.. సారీ చెప్పిన ఎన్వీడీయా సీఈఓ జెన్సన్ హువాంగ్- స్పందించిన ట్రంప్
చైనా గూఢచారితో రిలేషన్ నిజమే.. సారీ చెప్పిన ఎన్వీడీయా సీఈఓ జెన్సన్ హువాంగ్- స్పందించిన ట్రంప్
Donald Trump Impeachment Possibility: కాంగ్రెస్‌పై విపక్షాల పట్టు - ట్రంప్‌కు ఇంపీచ్‌మెంట్ గండం నిజమేనా.. అమెరికా రాజ్యాంగం ఏం చెబుతోంది?
కాంగ్రెస్‌పై విపక్షాల పట్టు - ట్రంప్‌కు ఇంపీచ్‌మెంట్ గండం నిజమేనా.. అమెరికా రాజ్యాంగం ఏం చెబుతోంది?
Israel Politics: ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gautam Gambhir Fire: బ్యాటర్లపై గంభీర్ ఫైర్.. ఆడలేని బంతులంటూ ఏవీ ఉండవంటూ ఘాటు విమర్శలు
బ్యాటర్లపై గంభీర్ ఫైర్.. ఆడలేని బంతులంటూ ఏవీ ఉండవంటూ ఘాటు విమర్శలు
Revanth Reddy About Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్.. బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల రాయితీలు
ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్.. బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల రాయితీలు
Bigg Boss Season 10 Today November 13th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: కెప్టెన్సీ కోసం కొట్టుకున్న కంటెస్టెంట్స్! ముకేశ్ వర్షిణి గొడవ!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: కెప్టెన్సీ కోసం కొట్టుకున్న కంటెస్టెంట్స్! ముకేశ్ వర్షిణి గొడవ!
AP Panchayat Elections: ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
Matt Henry Sixer: కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
Ravi Babu Scary Picture : బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?
బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?
Vizag CII Summit: రెండో రోజు సైతం ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.1.41 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు
రెండో రోజు సైతం ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.1.41 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు
Embed widget