రాహుల్ గాంధీ తన ఫోన్ ట్యాప్ అవుతోందని, ప్రధాని మోదీకి తన గురించి సమాచారం ఎలా చేరుతుందో తనకు తెలుసని ఆరోపించారు. అన్ని సాక్ష్యాలు తన ఫోన్‌లోనే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
Rahul Gandhi Phone Tapping Allegation: నా ఫోన్ ట్యాప్ అవుతోంది, అందులోనే సాక్ష్యాలు.. సీక్రెట్స్ బయటపెడతా: రాహుల్ గాంధీ ఆరోపణలు
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక యూజర్ ప్రశ్నకు సమాధానమిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ తన ఫోన్‌ను ట్యాప్ చేయిస్తున్నారని, సాక్ష్యాలు అందులోనే ఉన్నాయని ఆరోపించారు.

- తన ఫోన్ ట్యాప్ అవుతోందని, సాక్ష్యాలు అందులో ఉన్నాయని రాహుల్ ఆరోపించారు.
- మోదీతో ముఖాముఖి చర్చకు సిద్ధమని, విదేశీ శక్తుల నియంత్రణను వెల్లడిస్తానన్నారు.
- మోదీ చర్చకు వస్తే, ప్రధానిగా కొనసాగరని రాహుల్ స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ భారత ప్రధాని నరేంద్ర మోదీపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక యూజర్ ప్రశ్నకు సమాధానమిస్తూ రాహుల్ గాంధీ తన ఫోన్ వైపు చూపించి, అన్ని సాక్ష్యాలు ఇందులోనే ఉన్నాయన్నారు. తన గురించి సమాచారం ప్రధాని మోదీకి ఎలా చేరుతుందో తనకు తెలుసని, ఎందుకంటే తన ఫోన్ ట్యాప్ అవుతోందని సంచలన ఆరోపణలు చేశారు.
ప్రధాని మోదీ తనతో ఫేస్ టు ఫేస్ చర్చకు సిద్ధమయ్యే రోజున, ఎవరు విదేశీ శక్తుల నియంత్రణలో ఉన్నారో ప్రపంచానికి తెలిసిపోతుందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ ఎప్పటి నుంచి దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారో, దానికి సంబంధించిన ఇతర వివరాలు కూడా త్వరలోనే బయటకు వస్తాయన్నారు.
విదేశీ శక్తుల నియంత్రణపై మీతో ఏం సాక్ష్యం ఉంది?
ప్రధాని నరేంద్ర మోదీ తమకు విదేశీ సహాయం అందుతోందని అంటున్నారు, అయితే రాహుల్ గాంధీ మాత్రం ప్రధాని మోదీని విదేశీ శక్తులు నియంత్రిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణకు సాక్ష్యం ఏం ఉందని ఓ నెటిజన్ ప్రశ్నించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక యూజర్ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని అడిగిన ప్రశ్న అనంతరం చర్చకు దారితీస్తుంది.
ఈ ప్రశ్నకు సమాధానంగా రాహుల్ గాంధీ తన ఫోన్ వైపు చూపిస్తూ, అన్ని సాక్ష్యాలు మొబైల్ లోనే ఉన్నాయని పేర్కొన్నారు. తన ఫోన్ ట్యాప్ అవుతోందని, అందుకే ప్రధాని మోదీకి తన గురించి సమాచారం అందుతోందని ఆయన ఆరోపించారు. ప్రధాని మోదీ తనతో చర్చకు సిద్ధమయ్యే రోజున, ఎవరు విదేశీ శక్తుల నియంత్రణలో ఉన్నారో దేశ ప్రజలందరికీ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎవరిని కావాలంటే వారిని జడ్జిగా పెట్టుకుంటున్నారు
రాహుల్ గాంధీ ముఖాముఖి చర్చకు సిద్ధమా అని ప్రధాని మోదీకి సవాల్ విసిరారు. ఏ వేదికపైనైనా ప్రధాని మోదీతో వన్ ఆన్ వన్ డిబేట్‌కు తాను సిద్ధమని, ఆ తరువాత మోదీ ప్రధానిగా కొనసాగరని స్పష్టం చేశారు. బీజేపీ నేతలు కోరుకుంటే తమకు నచ్చిన వారిని ఈ చర్చకు జడ్జిగా పెట్టుకోవచ్చని రాహుల్ అన్నారు. అదానీ, RSS అధినేత మోహన్ భాగవత్‌ను కూడా జడ్జిగా కూర్చోబెట్టవచ్చని ఆయన అన్నారు. ప్రధానితో చర్చకు తాను సిద్ధమని, ఆ చర్చ తర్వాత నరేంద్ర మోదీ ప్రధానిగా ఉండలేరని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
ఇంతకుముందు కూడా చర్చకు ప్రధాని మోదీకి సవాల్
రాహుల్ గాంధీ ఇంతకుముందు కూడా పలు సందర్భాల్లో ప్రధాని నరేంద్ర మోదీకి బహిరంగ చర్చకు సవాల్ విసిరారు. 2019 ఏప్రిల్‌లో లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా రఫేల్ ఒప్పందం (Rafale Deal), అవినీతి అంశంపై ప్రధాని మోదీని 15 నిమిషాల ప్రత్యక్ష చర్చకు సవాల్ చేశారు. ఆ తర్వాత 2024 మే నెలలో లోక్‌సభ ఎన్నికల సమయంలో మాజీ న్యాయమూర్తి మదన్ బి. లోకూర్, అజిత్ పి. షా, సీనియర్ జర్నలిస్ట్ ఎన్. రామ్ ఇద్దరు నేతలను బహిరంగ చర్చకు ఆహ్వానించారు. రాహుల్ గాంధీ ఈ ఆహ్వానాన్ని స్వీకరిస్తూ, ఎన్నికల అంశాలపై ప్రధాని మోదీతో ముఖాముఖి చర్చకు ఆహ్వానించారు.
Frequently Asked Questions
రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై ఎలాంటి ఆరోపణలు చేశారు?
రాహుల్ గాంధీ ప్రధాని మోదీకి ఎలాంటి సవాల్ విసిరారు?
రాహుల్ గాంధీ ప్రధాని మోదీకి ముఖాముఖి చర్చకు సవాల్ విసిరారు. ఈ చర్చ తర్వాత మోదీ ప్రధానిగా కొనసాగలేరని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ ఎవరిని విదేశీ శక్తులు నియంత్రిస్తున్నాయని ఆరోపించారు?
ప్రధాని మోదీని విదేశీ శక్తులు నియంత్రిస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. మోదీ తనతో చర్చకు సిద్ధపడితే ఎవరు విదేశీ శక్తుల నియంత్రణలో ఉన్నారో ప్రపంచానికి తెలుస్తుందని ఆయన అన్నారు.
ప్రధానితో చర్చకు న్యాయనిర్ణేతలుగా ఎవరు ఉండాలని రాహుల్ గాంధీ సూచించారు?
బీజేపీ నేతలు తమకు నచ్చిన వారిని న్యాయనిర్ణేతలుగా పెట్టుకోవచ్చని రాహుల్ గాంధీ అన్నారు. అదానీ లేదా RSS అధినేత మోహన్ భాగవత్‌ను కూడా జడ్జిగా కూర్చోబెట్టవచ్చని ఆయన సూచించారు.
ట్రెండింగ్ వార్తలు






















