Bigg Boss 6 Telugu Episode 27: సీజన్ 6లో తొలి మహిళా కెప్టెన్‌గా కీర్తి, శ్రీసత్య కాళ్లు పట్టిన అర్జున్ కళ్యాణ్ - జైలుకెళ్లక తప్పలేదు
Bigg Boss 6 Telugu: తొలిసారి సీజన్ 6లో ఒక అమ్మాయి కెప్టెన్ అయ్యింది.
Bigg Boss 6 Telugu: నాలుగోవారంం కెప్టెన్సీ రేసులో ముగ్గురు అమ్మాయిలు మిగిలారు. వారిలో కీర్తి గేమ్ బాగా ఆడి కెప్టెన్ గా మారింది. మొదటి వారం బాలాదిత్య, రెండో వారం రాజ్, మూడో వారం ఆదిరెడ్డి కెప్టెన్ అయ్యారు. నాలుగో వారం కీర్తి భట్ ఇంటి కెప్టెన్ అయ్యింది. ఈ వారం ఎలిమినేషన్ డేంజర్ జోన్లో ఉంది కీర్తి. ఈసారి ఎలిమినేట్ కాకపోతే వచ్చే వారం సేవ్ అయిపోతుంది కీర్తి. కెప్టెన్ సింహాసనంపై కీర్తి కూర్చుంది.
ఇక ఎపిసోడ్ మొదలయ్యాక రేవంత్ - ఆదిరెడ్డి కాసేపు వాదించుకున్నారు. రేవంత్ నిద్రపోయాడని పనిష్మెంట్ తీసుకోమని అడిగాడు ఆదిరెడ్డి. తాను నిద్రపోలేదంటూ రేవంత్ వాదించాడు. తరువాత ఫైమా - రాజ్, చంటితో కలిసి కాసేపు ఫన్ క్రియేట్ చేసింది. ఆ ఫన్ కాసేపు ప్రేక్షకులకు నవ్వు తెప్పించింది. సూర్య అమ్మాయిలా మూల కూర్చుని ఏడ్వడం మొదలుపెట్టాడు. అమ్మ గుర్తొచ్చిందని చెప్పాడు. అతడిని బుజ్జగించే పనిని ఆరోహి, కీర్తి తీసుకున్నారు.
నెంబర్ గేమ్...
మళ్లీ పంచ్ పడింది టాస్కు మొదలైంది. ఇందులో ఇనయా గ్లవ్‌ను దక్కించుకుంది. అమ్మాయిలు కెప్టెన్ అవ్వాలని చెబుతూ శ్రీహాన్ ఫోటోపై పంచ్ ఇచ్చింది. తరువాత శ్రీహాన్ గ్లవ్ దక్కించుకుని రోహిత్ ను పోటీ నుంచి తప్పించాడు. తరువాత అర్జున్ ఆరోహి ఫోటోపై పంచ్ ఇచ్చాడు. చివరికి ముగ్గురమ్మాయిలు సుదీప, శ్రీసత్య, కీర్తి కెప్టెన్సీ రేసులో మిగిలారు.వీరికి నెంబర్ గేమ్ ఇచ్చారు. ఇందులో కీర్తి గెలిచి ఇంటి కెప్టెన్ అయ్యింది.
కాళ్లు పట్టిన అర్జున్
అర్జున్ కళ్యాన్ కేవలం శ్రీసత్య కోసమే ఆడుతున్నట్టు కనిపిస్తున్నాడు. నెంబర్ గేమ్‌లో ఓడిపోయిన శ్రీసత్యకు కాళ్లు పడుతూ కూర్చున్నాడు. శ్రీ సత్య మాత్రం అర్జున్‌ను వాడుకుని వదిలేస్తోంది. చూడటానికే ఏవగింపుగా ఉంది. అందుకు తగ్గ పనిష్మెంట్ కూడా వచ్చింది. చివరికి శ్రీసత్య చుట్టూ తిరుగుతూ వరస్ట్ ఫెర్ఫార్మర్ గా మారాడు.
బిగ్ బాస్ వరస్ట్ పెర్ఫార్మర్ ఎవరో చెప్పమని అడిగాడు. లాన్ లో పెట్టి డబ్బాలో వారి పేరు రాసి వేయమని, కారణం చెప్పమని చెప్పాడు. ఎక్కువ మంది అర్జున్ కళ్యాణ్ పేరే రాశారు. అతను ఏమీ ఆడకుండా సులువుగా డబ్బులన్నీ శ్రీ సత్యకు ఇచ్చేశాడని అన్నారు. ఫైమా, సుదీప, చంటి, ఆరోహి, కీర్తి, ఆర్జే సూర్య, మెరీనా రోహిత్ అర్జున్ కళ్యాణ్ కే ఓటేశారు. దీంతో ఆయనే జైలుకెళ్లాడు.
నాకోసం వచ్చావా?
జైల్లో కూర్చున్న అర్జున్ దగ్గర శ్రీసత్య ముచ్చట్లు పెట్టింది. నువ్వు బిగ్బాస్ హౌస్ కి ఎందుకు వచ్చావ్? నా కోసమా? నీ కోసమా? అని అడిగింది. అర్జున్ ‘నా కోసమే వచ్చా’ అని చెప్పాడు. కెమెరాల వైపు తిరిగి ఒక్క ఛాన్సు ఇవ్వండి, నేనేంటో చూపిస్తా అంటూ కబుర్లు చెప్పాడు.
Also read: కెప్టెన్సీ పోటీలో ఆ ముగ్గురు అమ్మాయిలు, ఇంటి కెప్టెన్ కీర్తి? వరస్ట్ కంటెస్టెంట్ ఆ హీరో?
Also read: ఇంట్లో అమ్మాయి కెప్టెన్ అవ్వాలి అంటూ శ్రీహాన్ పై పగ తీర్చుకున్న ఇనయా